|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

మీరు మీ కుటుంబ భద్రత గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే ఇలా చేయండి.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

Published: 16-05-2025, 1:15 AM
మీరు మీ కుటుంబ భద్రత గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే ఇలా చేయండి.. రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. అందులో చైనా ఉత్పత్తులను కొనకూడదని, కుటుంబ భద్రత గురించి ఆలోచించాలని పిలుపునిచ్చింది. ఈ పోస్ట్ నెట్టింట వైరల్ అయింది.

Key Points

1

రేణు దేశాయ్ చైనా ఉత్పత్తులను కొనకూడదని పిలుపునిచ్చారు.

2

కుటుంబ భద్రత కోసం చైనా ఉత్పత్తులను నిరాకరించాలని సూచించారు.

4

దేశభక్తితో చైనా ఉత్పత్తులకు దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు.

రేణు దేశాయ్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్

పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్(Renu Desai) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ‘జానీ’(Johny), ‘బద్రి’(Badri) వంటి సినిమాల్లో పవన్‌ కళ్యాణ్(Pawan Kalyan) సరసన నటించి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ కొన్ని కారణాల రీత్యా విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. ఇక విడాకుల తర్వాత పవన్‌ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా వ్యవహరిస్తున్నాడు. ఇక రేణు దేశాయ్ మాత్రం మరో పెళ్లి చేసుకోకుండా తమ పిల్లల (ఆద్య, అకిరా నందన్) బాధ్యతలను చూసుకుంటుంది. అయితే గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.

అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ.. పేద పిల్లలకు, జంతువులకు సహాయం చేస్తుంది. తనకు తోచినంత సహాయం చేయడంతో పాటుగా.. తన ఫ్యాన్స్‌ను కూడా విరాళాలు అడుగుతూ గుడ్ హార్ట్ అనిపించుకుంటుంది. అలాగే సోషల్ మీడియా(Social Media)లో పలు పోస్టులు పెడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ నోట్ షేర్ చేసింది. అందులో ‘మీరు మీ దేశం గురించి, మీ స్వీయ మరియు, మీ కుటుంబ భద్రత గురించి నిజంగా శ్రద్ధ వహిస్తే, చైనాలో తయారైన వస్తువులను కొనడం మానేయండి. లేబుల్‌ను చదవడం ప్రారంభించండి.

చైనా ఉత్పత్తులపై ఆందోళన

అలాగే మీరు చైనాలో తయారైన వాటిని కొనరని దుకాణ యజమానులకు మరియు వ్యాపార యజమానులకు బిగ్గరగా చెప్పడం ప్రారంభించండి. అవును, నేను ఇప్పటివరకు చైనాలో తయారైన చాలా వస్తువులను కూడా కొన్నాను. కానీ ముందుకు సాగుతూ నేను లేబుల్‌లను చదవడానికి మరియు చైనాలో తయారైన వస్తువులను తిరస్కరించడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నాను. ఇది సుధీర్ఘమైన ప్రక్రియ మరియు కష్టం, కానీ మనం ఎక్కడో ప్రారంభించాలి. మీరు కొనాలనుకునే వస్తువుల మూలం కోసం లేబుల్‌లను చదవండి మరియు మీ దేశాన్ని గర్వంగా ఆదరించండి.. జై హింద్’ అని రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

నేటిజన్ల స్పందన

A post shared by renu desai (@renuudesai)

రేణు దేశాయ్ పోస్ట్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. కుటుంబ భద్రతపై ఆమె అభిప్రాయం చాలా మందిలో ఆలోచన కలిగించింది. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలనే ఆలోచనను ప్రజల్లో జిల్లేలా చేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.