
📌 Key Points
- రేణు దేశాయ్ సంచలనం: బూతులు తిడితే అరెస్టులు ఖాయం అని హెచ్చరిక!
- సైబర్ క్రైమ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన రేణు దేశాయ్.
- నెటిజన్ల ఆగడాలు ఇక చెల్లవు: చర్యలు తప్పవంటున్న రేణు దేశాయ్.
- వ్యక్తిగత దూషణలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిక!
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మరోసారి హాట్ టాపిక్ గా మారారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న అసభ్యకరమైన కామెంట్స్ పై ఆమె సీరియస్ అయ్యారు. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
సోషల్ మీడియాలో రేణు దేశాయ్ ఫైర్!
Renu Desai : పవన్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల కుక్కలా సంరక్షణ కోసం ఓ ప్రెస్ మీట్ పెట్టి మరీ జనాల మీద ఫైర్ అయ్యారు రేణు దేశాయ్. అంతకు ముందు కూడా ఆమెకు సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ వచ్చినా ఆ ప్రెస్ మీట్ తర్వాత ఆమెపై బూతులతో కామెంట్స్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు పలువురు నెటిజన్లు.
గతంలోనే దీనిపై లైవ్ పెట్టి అలంటి వాళ్ళను అరెస్ట్ చేయిస్తాను అంటూ, తనని బూతులతో అకారణంగా అవిమర్శించేవారిపై సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేసింది రేణు దేశాయ్. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ కూడా చేసారు పోలీసులు. తాజాగా రేణు దేశాయ్ దీనికి సంబంధించి మరో వీడియోని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
నెటిజన్లకు రేణు దేశాయ్ స్ట్రాంగ్ వార్నింగ్
ఈ వీడియోలో రేణు దేశాయ్ మాట్లాడుతూ.. లాస్ట్ టైం లైవ్ కి వచ్చినప్పుడు చెప్పాను నన్ను బూతులు తిడితే అరెస్ట్ చేయిస్తాను అని. ఇప్పటికే ఆరుగురికి పైగా అరెస్ట్ చేసారు. అందులో ఇద్దర్ని వదిలేసారు. మిగిలిన వాళ్ళని ఎందుకు రిలీజ్ ఆపేసారు అంటే వాళ్ళని ఎందుకు ఇలా బూతులు పెడుతున్నారు ఆవిడ గురించి పర్సనల్ గా మీకేమి తెలుసు అని అడిగితే సోషల్ మీడియాలో, యూట్యూబ్ లో ఫేమ్ తెచ్చుకోవడం కోసం, సెలబ్రిటీల గురించి తప్పుగా రాస్తే నేను ఫేమస్ అయిపోతాను, నాకు ఫాలోయింగ్ వస్తుంది అని చెప్పారు. అందుకే ఇక నుంచి అరెస్ట్ చేసే వాళ్ళ ఐడెంటిటీ పబ్లిక్ కి రివీల్ చేయకూడదు అని ఫిక్స్ అయ్యాము. కానీ అరెస్టులు మాత్రం ఆగవు.
సైబర్ క్రైమ్ పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన రేణు
మీరు బూతులు పెట్టాలనుకుంటే మీ ఇంట్లో వాళ్ళు ఎఫెక్ట్ అవుతారు. సొసైటీ ముందు మీరు అరెస్ట్ అవుతారు. మీ కెరీర్ మీద, లైఫ్ లో బ్లాక్ మార్క్ పడుతుంది. మీ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఇంకోలా చూపించండి బూతులతో కాదు. కొంచెం ఆలోచించి కామెంట్స్ చేయండి. బూతులు పెట్టడం మంచిది కాదు. మీరు ఏదైనా ఆఫీస్ లో పనిచేస్తే ఆ ఆఫీస్ లో మీ పై వాళ్లకు మీరు ఇలా చేస్తున్నట్టు కూడా చెప్తాము. నాకే కాదు ఎవరికీ అయినా బూతులతో కామెంట్స్ చేస్తే మీరు అరెస్ట్ అవుతారు. మీకు మా సెలబ్రిటీల వర్క్ నచ్చకపోతే చెప్పండి అంతే కానీ బూతులతో కామెంట్స్ చేస్తే కచ్చితంగా FIR ఫైల్ అవుతుంది. ఈ విషయంలో గచ్చిబౌలి సైబర్ క్రైమ్ పోలీసులకు థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు కూడా సమాజం కోసం ఇలాంటి అబ్యూజ్ చేసే వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. నాకు మళ్ళీ సిస్టమ్ మీద నమ్మకం వచ్చింది అంటూ మరోసారి బూతులతో కామెంట్స్ చేసే నెటిజన్లను హెచ్చరించింది.
రేణు దేశాయ్ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి? ఆమె మాటలకు మద్దతు తెలుపుతూనే, మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


