
📌 Key Points
- రేణు దేశాయ్ ’16 రోజుల పండగ’ చిత్రంతో రీఎంట్రీ ఇస్తూ కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
- తనను ‘వదిన’ అనవద్దని కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కి రేణు దేశాయ్ గట్టి వార్నింగ్ ఇచ్చారు.
- పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక ఆ వరుస ఎలా అవుతుందని, ‘అక్కా’ లేదా పేరు పెట్టి పిలవమని ఆమె స్పష్టం చేశారు.
- ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా, నెటిజన్లు మిశ్రమంగా స్పందిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తన ‘వదిన’ అని పిలవద్దనే విషయంలో మరోసారి వార్తల్లో నిలిచారు. ఇటీవల ఆమె తనను ‘వదిన’ అని పిలిచిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, ఆమె సినిమా రీఎంట్రీ కూడా చర్చనీయాంశంగా మారింది.
రేణు దేశాయ్ రీఎంట్రీ: ’16 రోజుల పండగ’ చిత్రంతో సందడి
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ (Renu Desai)అందరికీ సుపరిచితమే. గత కొద్ది రోజులుగా సినిమాలకు దూరంగా ఉంటున్న ఆమె సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ అయింది. మూగ జీవాలకు అండగా..ఉంటూ వాటిని ఎవరు హింసించినా స్ట్రాంగ్‌గానే వార్నింగ్‌లు ఇవ్వడంతో పాటు కేసులు కూడా పెడుతోంది. అలాగే తనను పవన్ కళ్యాణ్ అభిమానులు ఏమైనా అంటే కూడా తనదైన స్టైల్లో కౌంటర్లు వేస్తూ ఉంటుంది. ముఖ్యంగా పవన్‌ను అన్నయ్య అని పిలిచి, తనను వదిన అంటే అస్సలు ఊరుకోదు. గట్టిగానే ఇచ్చిపడేస్తూ ఉంటుంది. ఇలా ఎంతోమంది అని ఆమె కోపానికి బలయ్యారు. ఇక ఇటీవల తన ఇద్దరు పిల్లలు ఆద్య,అకీరా నందన్ పెద్దయ్యాక రెండో పెళ్లి చేసుకుంటానని ప్రకటించింది.
ఇక ఈ వార్తలు ట్రెండింగ్‌లో ఉండగానే.. సన్యాసిగా మారిపోతానని చెప్పి అందరినీ షాక్‌కు గురి చేసింది. ఇదిలా ఉంటే.. రేణు దేశాయ్ మరోసారి సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ‘16 రోజుల పండగ’ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. దమ్మాలపాటి హీరోగా పరిచయం అవుతుండగా.. గోపిక ఉదయన్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్, రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీ చిత్ర బ్యానర్స్‌పై మొదటి సినిమాగా ప్రొడక్షన్-1పేరుతో రాబోతుండగా.. సురేష్ కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది.
జానీ మాస్టర్‌కు రేణు దేశాయ్ వార్నింగ్: ‘వదిన’ వివాదం
ఈ పూజా కార్యక్రమాలకు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(jani master) కూడా హాజరు కాగా.. రేణు దేశాయ్‌ని చూసి వదిన అనేశాడు. ఇక ఆ పదం విన్న వెంటనే కోపంగా..ఎన్ని సార్లు చెప్పాలిరా నీకు వదిన అనకని. పవన్‌తో విడిపోయాక ఆ వరుస ఎలా అవుతా అక్కా అని పిలవండి లేదా రేణు దేశాయ్ అనండి అని వార్నింగ్ ఇచ్చింది. దీంతో వెంటనే జానీ మాస్టర్ చేతులెత్తి దండం పెట్టి పొరపాటున నోటి నుంచి వచ్చేసింది.. ఇంకోసారి అలా పిలవను అని అంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక అది చూసిన నెటిజన్లు ప్రతిసారి ఇలా చెప్పాల్సిన పని లేదు.. చూసి చూడనట్టు వదిలేస్తే బాగుంటుందని అభిప్రాయపడుతున్నారు.
సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో: నెటిజన్ల స్పందన
A post shared by Chilll_Vibes (@chilll_vibes_)
రేణు దేశాయ్ తనను ‘వదిన’ అని పిలవొద్దని జానీ మాస్టర్‌కు ఇచ్చిన వార్నింగ్ వీడియో వైరల్ అయ్యింది. ఆమె రీఎంట్రీ, సోషల్ మీడియాలో ఆమె తీరు ఎప్పుడూ చర్చనీయాంశమే. ఈ సంఘటన కూడా టాలీవుడ్‌లో కొత్త చర్చకు దారితీసింది.


