
📌 Key Points
- రేణు దేశాయ్ ‘పదహారు రోజుల పండుగ’ చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు.
- సోషల్ మీడియాలో ఒడిలో పసిబిడ్డతో ఉన్న ఫొటో షేర్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
- ఆ చిన్నారి ఎవరనే దానిపై నెటిజన్లలో తీవ్ర చర్చ జరుగుతోంది.
- పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేయడం చర్చను మరింత పెంచింది.
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ తాజాగా సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టారు. ‘పదహారు రోజుల పండుగ’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్న ఆమె, ఒడిలో ఓ పసిబిడ్డతో ఉన్న ఫొటోను షేర్ చేసి అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఈ బిడ్డ ఎవరు, రేణుకు సంబంధం ఏంటి అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
సినిమాలతో రేణు దేశాయ్ సెకండ్ ఇన్నింగ్స్
పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)మాజీ భార్య రేణు దేశాయ్(Renu Desai) మరోసారి తన కెరీర్‌కు కొత్త ఊపునిచ్చే ప్రయత్నం చేస్తోంది. ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాతో చివరగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, కొంతకాలం గ్యాప్ తీసుకుని మళ్లీ సినిమాలపై ఫోకస్ పెట్టింది. ఈ మధ్య సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తన అభిప్రాయాలు, వ్యక్తిగత క్షణాలను పంచుకుంటూ వార్తల్లో నిలుస్తోంది. ఇప్పుడు వరుస ప్రాజెక్టులతో సెకండ్ ఇన్నింగ్స్‌ను గట్టిగా స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా రేణు దేశాయ్ అభిమానులకు ఓ బిగ్ అప్డేట్ ఇచ్చింది. ‘పదహారు రోజుల పండుగ’ అనే కొత్త చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు ప్రకటించింది. ఈ సినిమాలో సాయి కిరణ్ అడివి హీరోగా నటిస్తుండగా, షూటింగ్ కూడా ప్రస్తుతం వేగంగా జరుగుతోంది. దర్శక, నట బృందంతో కలిసి ఓ వీడియోను షేర్ చేస్తూ ఈ ప్రాజెక్ట్‌లో భాగమైన ఆనందాన్ని వ్యక్తం చేసింది.
త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఇదే సమయంలో రేణు దేశాయ్ చేసిన మరో పోస్ట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె ఒడిలో ఓ చిన్నారి ఉండగా తీసిన ఫొటోను షేర్ చేయడంతో నెటిజన్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ ఫొటోకు “పసిపిల్లలు తమ రెక్కలను దాచుకున్న దేవదూతల లాంటివారు.. ఈ చిన్నారి తన ముద్దులొలికే రూపంతో నా హృదయాన్ని దోచుకున్నాడు” అనే భావోద్వేగ క్యాప్షన్ జత చేసింది. అయితే ఆ పోస్టుకు కామెంట్స్ ఆఫ్ చేయడం మరింత చర్చకు దారి తీసింది. అంతేకాకుండా అందరినీ షాక్‌కు గురి చేస్తోంది. ఆ చిన్నారి ఎవరు? రేణు దేశాయ్‌కు ఏ విధంగా సంబంధించినవారు? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొత్తానికి ఒకవైపు సినిమాలతో సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్లాన్ చేస్తూనే, మరోవైపు ఇలాంటి భావోద్వేగ పోస్టులతో రేణు దేశాయ్ మళ్లీ వార్తల్లో నిలుస్తున్నారు.
ఒడిలో పసిబిడ్డతో షాకిచ్చిన రేణు దేశాయ్
A post shared by renu desai (@renuudesai)
పసిబిడ్డ రహస్యం: నెటిజన్ల ప్రశ్నలు
A post shared by renu desai (@renuudesai)
సినిమాలతో బిజీగా ఉన్న రేణు దేశాయ్, ఇలాంటి భావోద్వేగ పోస్టులతో మళ్ళీ వార్తల్లో నిలుస్తున్నారు. ఆమె పసిబిడ్డ ఫొటో వెనుక ఉన్న నిజం ఏమిటో తెలుసుకోవడానికి అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


