|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రిపబ్లిక్ డే ధమాకా: ఈ 8 దేశభక్తి సినిమాలు చూస్తే గూస్ బంప్స్ పక్కా! మిస్ అయితే అంతే సంగతులు!

Published: 26-01-2026, 12:35 AM
రిపబ్లిక్ డే ధమాకా: ఈ 8 దేశభక్తి సినిమాలు చూస్తే గూస్ బంప్స్ పక్కా! మిస్ అయితే అంతే సంగతులు!
  • సన్నీ డియోల్ ‘బార్డర్’ మూవీ: 1971 ఇండో-పాక్ యుద్ధం ఆధారంగా రూ.65 కోట్ల వసూళ్లు రాబట్టింది, దేశభక్తి చిత్రం!
  • విక్కీ కౌశల్ ‘ఉరి’: రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూ.360 కోట్లు కొల్లగొట్టింది, ఇండియన్ ఆర్మీలో చేరేలా చేసింది!
  • సిద్ధార్థ్ ‘షేర్షా’: కార్గిల్ యుద్ధం నేపధ్యంలో ఓటీటీలో విడుదలైంది, విక్రమ్ బాత్రా పాత్రలో అద్భుత నటనతో మెప్పించాడు!
  • అక్షయ్ కుమార్ ‘కేసరి’: సారాగఢీ యుద్ధం ఆధారంగా రూ.207 కోట్లు వసూలు చేసింది, సీక్వెల్ నిరాశపరిచింది!

భారతదేశం గర్వించదగ్గ సినిమాలు మీకోసం! రిపబ్లిక్ డే సందర్భంగా దేశభక్తిని ఉట్టిపడేలా చేసే టాప్ 8 సినిమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం! ఈ మూవీస్ చూస్తే ప్రతి భారతీయుడు గర్వపడతాడు!

బార్డర్ మూవీ సంచలనం.. కలెక్షన్ల సునామీ!

1997లో వచ్చిన సన్నీ డియోల్ సినిమా ‘బార్డర్’ 1971 ఇండో-పాక్ యుద్ధం ఆధారంగా తెరకెక్కింది. ఇందులో సన్నీ సైనికుడి పాత్ర పోషించారు. రూ.10 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా రూ.65 కోట్లు వసూలు చేసింది. ఇది దేశభక్తి చిత్రాల్లో బెస్ట్ అని చెప్పొచ్చు. దీనికి సీక్వెల్‌గా ఇప్పుడు `బార్డర్‌ 2` రూపొందించిన విషయం తెలిసిందే. ఇందులో సన్నీ డియోల్‌తోపాటు వరుణ్‌ ధావన్‌ మరో ముఖ్య పాత్ర పోషించారు. ఇది బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది. ఇది రిపబ్లిక్‌ డే సందర్భంగా విడుదల కావడం విశేషం.

విక్కీ కౌశల్ హీరోగా వచ్చిన సినిమా ‘ఉరి: ది సర్జికల్ స్ట్రైక్’ 2016 ఉరి దాడి ఆధారంగా తీశారు. 2019లో విడుదలైన ఈ సినిమా రూ.25 కోట్ల బడ్జెట్‌తో రూ.360 కోట్లు వసూలు చేసింది. దేశభక్తి చిత్రంగా విశేషంగా ఆకట్టుకుంది. ఎంతో మందిని ప్రభావితం చేసింది. చాలా మందిని ఇండియన్‌ ఆర్మీలో జాయిన్‌ అయ్యే దిశగా అడుగులు వేసేలా చేసింది. హీరో విక్కీ కెరీర్‌నే మలుపుతిప్పింది.

సిద్ధార్థ్ మల్హోత్రా సినిమా ‘షేర్షా’ 2021లో విడుదలైంది. కార్గిల్ యుద్ధం నేపథ్యంలో ఈ సినిమా తీశారు. ఇందులో సిద్ధార్థ్.. పరమవీర చక్ర విక్రమ్ బాత్రా పాత్ర పోషించారు. ఈ సినిమా కరోనా నేపథ్యంలో ఓటీటీలో విడుదలైంది. విశేష ఆదరణ పొందింది.  తప్పక చూడాల్సిన చిత్రంగా నిలిచింది.

ఉరి సినిమాతో విక్కీ కౌశల్ క్రేజ్ మాములుగా లేదుగా!

అక్షయ్ కుమార్ హీరోగా ‘కేసరి’ అనే సినిమా 2019లో విడుదలైంది. ఈ సినిమా సారాగఢీ యుద్ధం ఆధారంగా తీశారు. రూ.80 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.207 కోట్లు రాబట్టింది.  దీనికి సీక్వెల్‌గా `కేసరి 2` గతేడాది వచ్చింది. ఈ మూవీ పెద్దగా ఆడలేదు.

అమీర్‌ ఖాన్ హీరోగా నటించిన ‘మంగళ్ పాండే: ది రైజింగ్’ మూవీ 2005లో వచ్చింది. 1857లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా మంగళ్ పాండే చేసిన పోరాటాన్ని ఈ సినిమాలో చూపించారు. రూ.34 కోట్లతో తీసి రూ.52 కోట్లు వసూలు చేసింది.అప్పట్లో భారతీయ యువతని బాగా ప్రభావితం చేసిన చిత్రమిది. దేశ భక్తి చిత్రాలకు సంబంధించి ఇప్పటికీ బెస్ట్ ఫిల్మ్ లో ఒకటిగా నిలుస్తుంది.

2004లో  హృతిక్ రోషన్ హీరోగా వచ్చిన ‘లక్ష్య’ సినిమాని కార్గిల్ యుద్ధం ఆధారంగా తీశారు. ఈ సినిమా బడ్జెట్ రూ.14 కోట్లు కాగా, బాక్సాఫీస్ వద్ద రూ.26 కోట్లు వసూలు చేసింది. ఇది కూడా బెస్ట్ పేట్రియాటిక్‌ ఫిల్మ్ గా నిలుస్తుంది.

షేర్షా మూవీ ఓటీటీలో రికార్డులు క్రియేట్ చేసిందా!

విక్కీ కౌశల్ హీరోగా ‘సామ్ బహదూర్’ అనే మూవీ రూపొందింది. ఇది 2023లో విడుదలైంది.  భారతదేశపు మొదటి ఫీల్డ్ మార్షల్ సామ్ మానెక్‌షా బయోపిక్ గా ఈ చిత్రం రూపొందడం విశేషం. దీని బడ్జెట్ రూ.55 కోట్లు,  రూ.93 కోట్లు వసూలు చేసింది.

రానా దగ్గుబాటి హీరోగా ‘ది ఘాజీ ఎటాక్’ అనే చిత్రాన్ని ఇండో-పాక్ యుద్ధం నేపథ్యంలో తీశారు. ఈ సినిమా 2017లో విడుదలైంది. దీని బడ్జెట్ రూ.15 కోట్లు, బాక్సాఫీస్ వద్ద రూ.20 కోట్లు వసూలు చేసింది. డీసెంట్‌ హిట్‌గా నిలిచింది. మంచి ప్రశంసలందుకుంది. ఇది హిందీతోపాటు తెలుగులో కూడా రూపొందింది. బెస్ట్ పేట్రియాటిక్‌ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. వీటితోపాటు తెలుగులో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా `ఆర్‌ఆర్‌ఆర్‌`, అడవిశేషు హీరోగా `మేజర్‌`, చిరంజీవి హీరోగా `సైరా నరసింహారెడ్డి`, శ్రీకాంత్‌ హీరోగా `ఖడ్గం`, కృష్ణ హీరోగా `అల్లూరి సీతారామరాజు`, ఎన్టీఆర్‌, మోహన్‌ బాబు `మేజర్‌ చంద్రకాంత్‌`, ఎన్టీఆర్‌ `నాదేశం`, `బొబ్బిలి పులి`, విజయశాంతి `నేటి భారతం`, కమల్‌ హాసన్‌ `భారతీయుడు`, వెంకటేష్‌ `సుభాష్‌ చంద్రబోస్‌` వంటి చిత్రాలు దేశ భక్తి ప్రధానంగా రూపొందాయి. మంచి ఆదరణ పొందాయి.

ఈ దేశభక్తి సినిమాలు మీలో దేశభక్తిని నింపుతాయనడంలో సందేహం లేదు. ఇలాంటి మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.