|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

‘రెట్రో’ మూవీ రివ్యూ.. సూర్య హిట్‌ కొట్టాడా..?

Published: 01-05-2025, 7:18 AM
'రెట్రో' మూవీ రివ్యూ.. సూర్య హిట్‌ కొట్టాడా..?

భారీ అంచనాల మధ్య విడుదలైన సూర్య నటించిన ‘రెట్రో’ సినిమా రివ్యూ ఇది. కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యాక్షన్, రొమాన్స్, భావోద్వేగాలతో కూడిన కథను ఆవిష్కరిస్తుంది. సూర్య ఈ సినిమాతో హిట్ కొట్టాడా?

Key Points

1

సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన యాక్షన్ రొమాంటిక్ చిత్రం 'రెట్రో'.

2

కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మే 1న విడుదలైంది.

4

సూర్య తన నటనతో మళ్ళీ అభిమానులను మెప్పించగలిగాడా?

కథాంశం మరియు నటన

టైటిల్‌ : రెట్రో’పైనే నటీనటులు: సూర్య, పూజా హెగ్డే, జోజూ జార్జ్‌, జయరామ్‌, నాజర్‌, ప్రకాశ్‌రాజ్‌  తదితరులు నిర్మాణ సంస్థలు: స్టోన్ బెంచ్ క్రియేషన్స్, 2డి ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: జ్యోతిక, కార్తేకేయన్ సంతానం, రాజశేఖర్ పాండియన్ ఎడిటింగ్: షఫీక్ మొహమ్మద్ అలీ దర్శకత్వం, కథ: కార్తీక్‌ సుబ్బరాజ్‌ సంగీతం: సంతోష్ నారాయణన్ సినిమాటోగ్రఫీ: శ్రేయాస్ కృష్ణ విడుదల: మే1, 2025

గతేడాదిలో భారీ అంచనాలతో విడుదలైన ‘కంగువా’ చిత్రం  సూర్య (Suriya)కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ఈ సినిమా తర్వాత ఏలాగైన తన అభిమానులను  సంతోషపెట్టాలని ‘రెట్రో’పైనే ఆయన ఆశలు పెట్టుకున్నారు. దీంతో కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వంలో  రొమాంటిక్‌ యాక్షన్‌ ఫిల్మ్‌ ప్రాజెక్ట్‌ను తెరపైకి సూర్య తీసుకొచ్చాడు. ఇందులో పూజా హెగ్డే (Pooja Hegde) హీరోయిన్‌గా నటించగా.. జోజూ జార్జ్‌, జయరామ్‌, నాజర్‌ తదితరులు కీలక పాత్రలలో కనిపించారు.  మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ  2 గంటలా 40 నిమిషాల రన్‌టైమ్‌ ఉంది. గతంలో దర్శకుడు సుబ్బరాజ్‌ తెరకెక్కించిన  పేట, మహాన్‌, జిగర్తాండ, జిగర్తాండ డబుల్‌ ఎక్స్‌ చిత్రాల నిడివి కూడా ఇంతే ఉండటం గమనార్హం. యాక్షన్‌తో పాటు, ప్రేమ, భావోద్వేగాలతో కూడిన ఒక గ్యాంగ్‌స్టర్‌ రెట్రోతో మెప్పించాడా అనేది ఈ కథనంలో తెలుసుకుందాం.

కథేంటంటే.. గ్యాంగ్‌స్టర్ తిలకన్ (జోజు జార్జ్) కొడుకులా పెంచుకున్న పారివేల్ కన్నన్ (సూర్య)తో  గ్యాంగ్‌స్టర్స్‌గా ఒక సామ్రాజ్యాన్నే ఏర్పాటు చేసుకుని చలామణి సాగిస్తుంటారు. అయితే, ఒకరోజు వారు ఫారిన్‌ గ్యాంగ్‌తో కుదుర్చుకున్న ఢీల్‌ (గోల్డ్ ఫిష్) వల్ల సమస్యలు వస్తాయి. అప్పటి వరకు తిలకన్ చెప్పిన ప్రతి విషయాన్ని పూర్తి చేసిన పారివేల్‌.. గోల్డ్‌ఫిష్‌ ఢీల్‌ను వదులుకోవాలని పెంచిన తండ్రికి ఎదరుతిరుగుతాడు. ఇదే సమయంలో తన ప్రియురాలు రుక్మిణి (పూజా హెగ్డే)ని వివాహం చేసుకోవడానికి పారివేల్‌ రెడీ అవుతుంటాడు. తనతో పెళ్లి తర్వాత గ్యాంగ్‌స్టర్ జీవితాన్ని వదులుకుని ఆమెతో సాధారణ జీవితాన్ని గడుపుతానని వాగ్దానం చేస్తాడు. అలాంటి సమయంలోనే గోల్డ్ ఫిష్ వివరాలు చెప్పాలని ఆ పెళ్లికి అడ్డుగా తిలకన్‌ నిలబడుతాడు.

తన గ్యాంగ్‌తో ఆ వేడుకలో అల్లకల్లోలం సృష్టిస్తాడు.  దీంతో పారివేల్‌ కన్నన్‌ మళ్లీ ఆయుధాలు పట్టాల్సి వస్తుంది. ఈ గొడవ కారణంగా ఐదేళ్లు జైలుకు వెళ్తాడు పారివేల్‌. గొడవలు అంటే నచ్చని రుక్మిణి అతని జీవితం నుంచి వెళ్లిపోతుంది. ఆమె ఆచూకి వివరాలు తెలుసుకోవాలని తన గ్యాంగ్‌ను కోరతాడు. చివరికి ఆమె అండమాన్‌లకు దూరంగా ఒక ఐల్యాండ్‌లో ఉన్నట్లు వివరాలు తెలుసుకుంటారు. ఆమెను ఎలాగైనా కలుసుకోవాలని జైలు నుంచి  తప్పించుకున్న పారివేల్‌ ఆమె ఉన్న చోటుకు వెళ్తాడు. దీంతో తనను పెంచిన తండ్రి తిలకన్‌ కూడా గోల్డ్‌ఫిష్‌ వివరాలు కోసం అదే ఐలాండ్‌కు చేరుకుంటారు.

దర్శకత్వం మరియు సాంకేతిక విభాగం

అయితే, అప్పటికే అక్కడ ఒక పెద్ద గ్యాంగ్‌తో రాజ్‌వేల్‌ దొర (నాజర్‌) అతని కుమారుడు మైఖేల్‌ ఉంటారు. అక్కడి ప్రజలను తమ గుప్పెట్లో పెట్టుకుని అనేక దారుణాలు చేస్తుంటారు. వారితో ఒక ఢీల్‌ సెట్‌ చేసుకుని తిలకన్‌ అక్కడికి చేరుకుంటాడు. తన ప్రియురాలు రుక్మిణి కోసం పారివేల్‌  ఆ ప్రాంతంలో అడుగుపెట్టగానే మళ్లీ గ్యాంగ్‌ వార్‌ మొదలౌతుంది. అక్కడి నుంచి  గోల్డ్‌ఫిష్‌ వేట కొనసాగుతుంది. ఇంతకీ గోల్డ్‌ఫిష్‌ సీక్రెట్‌ ఏంటి..? దాని కోసం పెంచిన కొడుకునే తండ్రి చంపాలని ఎందుకు అనుకుంటాడు..? అనాధగా ఉన్న పారివేల్‌కు ఆ ఐల్యాండ్‌తో ఉన్న గత సంబంధం ఏంటి..? అక్కడి గుడితో అతనికి ఉన్న అనుబంధం ఏంటి..? పారివేల్‌ పుట్టక ముందే రాజ్‌వేల్‌ దొర (నాజర్‌)తో ఉన్న లింక్‌ ఏంటి..? ఫైనల్‌గా రుక్మిణిని పారివేల్‌ పెళ్లి చేసుకుంటాడా..? అనేది తెలియాలంటే రెట్రో చూడాల్సిందే.

ఎలా ఉందంటే..? ఈ సినిమాకు ప్రధాన బలం దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్, సూర్య తొలిసారి కలిసి పనిచేయడమే అని చెప్పవచ్చు. అందుకే, రెట్రో సినిమా ప్రేక్షకులలో చాలా ఆసక్తిని రేకెత్తించింది. ఊహించినట్లుగానే.. కార్తీక్ సుబ్బరాజ్, సూర్య బలాలను వెండితెరపై చూపించారు. యాక్షన్, రొమాన్స్ అంశాలను సమానంగా చూపించేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు. చాలా సినిమాల్లో మాదిరే.. రెట్రో కథలో కూడా ప్రేమ కోసం అన్నీ వదులుకోవడానికి ప్రయత్నించే ఒక గ్యాంగ్‌స్టర్ గురించి చెప్పారు. ఇందులో అతను ఎలా విజయం సాధిస్తాడు అనేది కాస్త ప్రత్యేకంగా చూపారు.  సినిమా మొదటి భాగంలో తిలకన్‌, పారివేల్‌, రుక్మిణిల చుట్టూ తిరుగుతుంది. భారీ యాక్షన్‌ సీన్స్‌లకు కాస్త రొమాంటిక్‌ టచ్‌ ఇచ్చి కథను చూపారు. అదంతా మనకు రొటిన్‌గానే అనిపించవచ్చు.

సెకండ్‌ పార్ట్‌ అంతా ఒక ఐలాండ్‌లో జరుగుతుంది. అక్కడి నుంచి  స్క్రీన్‌ప్లే  గజిబిజిగా మారడం ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న గ్యాంగ్‌స్టర్స్‌ రాజ్‌వేల్‌ దొర (నాజర్‌) అతని కుమారుడు మైఖేల్‌తో పారివేల్‌ పోరాటం చేయాల్సి వస్తుంది.  అక్కడి నుంచి పూర్తిగా భిన్నమైన ట్రాక్‌లోకి స్టోరీ వెళుతుంది. ఇక్కడే సినిమా కాస్త తడబడినట్లు అనిపిస్తుంది.  దీనిని దర్శకుడు సుబ్బరాజు కూడా ముందుగానే అంచనా వేసినట్లు ఉన్నాడు.  వార్ అండ్ కల్ట్ వంటి అధ్యాయాలుగా కథను విభజిస్తూ ప్రేక్షకులకు చూపించాడు. అయితే, ఈ మూవీలో సూర్య, పూజా హెగ్డే  దుస్తులు, లుక్స్ వంటి అంశాలు టైటిల్‌కు తగ్గట్లుగానే పూర్తిగా పాతకాలానికి చెందినవిగా ఉంటాయి.

చివరి మాట

కథలో గ్రిప్పింగ్‌ లేకున్నా.. భారీ యాక్షన్‌ సీన్స్‌ ప్రేక్షకులను మెప్పిస్తాయి. సూర్య, పూజాల మధ్య సరైన లవ్‌ ట్రాక్‌ కనిపించదు. కానీ, వారిద్దరి మధ్య చాలా ఎమోషన్స్‌తో కూడిన ప్రేమ ఉన్నట్లుగా మనకు దర్శకుడు చూపే ప్రయత్నం చేశాడు. ఐల్యాండ్‌కు పారివేల్‌కు ఉన్న రిలేషన్‌ ఏంటి అనేది వివరంగా చెప్పడంలో విఫలం అయ్యాడనిపిస్తుంది. కథ, స్క్రీన్‌ప్లే రెట్రో సినిమాకు కాస్త మైనస్‌ అని చెప్పవచ్చు. కానీ, యాక్షన్‌ సినిమాలను ఇష్టపడేవారు మాత్రం తప్పకుండా ఎంజాయ్‌ చేస్తారు.  సూర్య, పూజా హెగ్డేలను చాలా కొత్తగా దర్శకుడు చూపించారు.

ఎవరెలా చేశారంటే.. సూర్య తన అన్ని చిత్రాల మాదిరిగానే ఈ మూవీలో కూడా తన ప్రతిభను చాటుకున్నాడు. యాక్షన్ అయినా, కామెడీ అయినా సూర్య చాలా అద్భుతంగా నటించాడు.  పూజ హెగ్డేతో అతను కనిపించే సన్నివేశాలు పెద్దగా క్లిక్‌ కాకపోయిన కెమెరామెన్‌ పనితనంతో కాస్త గట్టెక్కించాడని చెప్పవచ్చు. రెట్రో డ్రెస్‌లో పూజా చాలా చక్కగా సెట్‌ అయిపోయింది. ఆపై గ్లామర్‌కు ఎలాంటి స్కోప్‌లేకుండా కేవలం యాక్టింగ్‌కు మాత్రమే ప్రాముఖ్యత ఇవ్వడంతో తన కెరీర్‌లో ఇదొక బెస్ట్‌ చిత్రంగా నిలుస్తుంది. మలయాళ నటుడు జోజు జార్జ్ తిలకన్ పాత్రలో మరోసారి తన ప్రతిభను ప్రదర్శించగా, మైఖేల్ పాత్రను పోషించిన నటుడు కూడా అద్భుతంగా నటించాడు. ప్రకాష్ రాజ్ అతిధి పాత్రలో కనిపిస్తాడు, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ కూడా అతిధి పాత్రలో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

సంతోష్ నారాయణ్ ఇచ్చిన సంగీతం రెట్రోకు బాగా ప్లస్‌ అయింది. ముఖ్యంగా యాక్షన్ సన్నివేశాలను ఎలివేట్ చేసే అద్భుతమైన BGMను ఆయన అందించాడు. కన్నిమ పాట ఇప్పటికే థియేటర్లలో పెద్ద సంచలనంగా మారింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ చేసిన రెట్రో మంచి ప్రయత్నమే కానీ చాలా ట్రాక్‌లతో కూడిన గజిబిజి స్క్రీన్‌ప్లే వల్ల కాస్త ఇబ్బంది పెట్టొచ్చు. సూర్య, పూజా హెగ్డే తమ అభిమానులను  రెట్రోతో తప్పకుండా అలరిస్తారు.

మొత్తం మీద, ‘రెట్రో’ సినిమా సూర్య కెరీర్‌లో మరో మలుపు అవుతుందో లేదో తెలియాల్సి ఉంది. కథ, నటన, దర్శకత్వం ఎలాంటి ప్రభావాన్ని చూపించాయో ప్రేక్షకుల తీర్పు చెప్పాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.