|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఆర్జీవీ సంచలనం! టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2.. బాక్సాఫీస్ బద్దలే!!

Published: 23-02-2026, 3:35 AM
ఆర్జీవీ సంచలనం! టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2.. బాక్సాఫీస్ బద్దలే!!
  • మార్చి 19న టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2.. బాక్సాఫీస్ వద్ద భారీ పోటీ!
  • ఆర్జీవీ ట్వీట్‌తో దుమారం.. ధురంధర్ 2 సినిమాపై ప్రశంసలు కురిపించిన వర్మ!
  • డేవిడ్ వర్సెస్ గోలియత్ పోలిక.. టాక్సిక్, ధురంధర్‌ల మధ్య పోరు రసవత్తరంగా ఉంటుందని కామెంట్!
  • యశ్ ‘టాక్సిక్’‌లో నయనతార, హ్యూమా ఖురేషీ, కియారా అద్వానీ వంటి స్టార్ హీరోయిన్స్!

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి వార్తల్లో నిలిచారు. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 సినిమాల బాక్సాఫీస్ పోరుపై ఆయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అసలు వర్మ ఏం మాట్లాడారో చూద్దాం!

బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2!

మార్చి 19న అతిపెద్ద బాక్సాఫీస్ పోటీ టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 మధ్య నడవనుంది. ఈ విషయంపై నిన్న (ఫిబ్రవరి 22) సంచలన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పెట్టిన ట్విటర్ పోస్ట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఆయన చేసిన కామెంట్లను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ తాజాగా క్లారిటీ ఇచ్చారు ఆర్జీవీ.

తెలుగు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంట్రవర్సీ కామెంట్లతో ఎప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటారు. రీసెంట్‌గా టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2 బాక్సాఫీస్ వార్‌పై ట్వీట్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. అయితే, తన కామెంట్లపై ఎప్పుడు వివరణ ఇచ్చుకోని ఆర్జీవీ తాజాగా క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేయడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.

ఆర్జీవీ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

రీసెంట్‌గా నిన్న (ఫిబ్రవరి 22) ఆదివారం రెండు సినిమాల బాక్సాఫీస్ పోటీపై కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆయన మాటల్లో దాదాపుగా ధురంధర్ 2 సినిమాను పొగుడుతున్నట్లుగానే ఉంది. టాక్సిక్ వర్సెస్ ధురంధర్ 2పై ఆర్జీవీ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేశాయి.

పాత ట్వీట్‌ను రీపోస్ట్ చేస్తూ ఈ కామెంట్స్ చేశారు రామ్ గోపాల్ వర్మ. గత ట్వీట్‌లో రామ్ గోపాల్ వర్మ “భారతీయ సినిమా చరిత్రలో మునుపెన్నడూ చూడని ఒక వింత యుద్ధాన్ని చూడబోతున్నాం. ఇది డేవిడ్, గోలియత్ మధ్య జరుగుతున్న పోరాటం. గతంలో కేజీఎఫ్ ’ సాధించిన భారీ వసూళ్లు ధురంధర్ ముందు చిన్నవిగా అనిపించాయి. ఇప్పుడు ధురంధర్ 2 అనే డేవిడ్ ముందు టాక్సిక్ అనే కొత్త గోలియత్ నిలబడింది” అని తెలిపారు.

ట్వీట్‌కు క్లారిటీ ఇచ్చిన రామ్ గోపాల్ వర్మ!

ఇదిలా ఉంటే గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో కన్నడ స్టార్ యశ్ నటించిన సినిమానే టాక్సిక్. నయనతార , హ్యూమా ఖురేషీ, కియారా అద్వానీ , రుక్మిణి వసంత్, తారా సుతారియా వంటి హీరోయిన్స్ ఉన్న ఈ సినిమాలో బ్రూటల్ వయోలెన్స్, బోల్డ్ సీన్స్‌ ఎక్కువగానే ఉన్నాయి.

రామ్ గోపాల్ వర్మ కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. టాక్సిక్, ధురంధర్ 2 సినిమాల బాక్సాఫీస్ పోరుపై మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.