|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RGV సంచలనం: ఆ జంటను ఓడించాలని ఇండస్ట్రీ కుట్ర! అసలు నిజాలు బయటపెట్టిన వర్మ!

Published: 14-03-2026, 1:05 AM
RGV సంచలనం: ఆ జంటను ఓడించాలని ఇండస్ట్రీ కుట్ర! అసలు నిజాలు బయటపెట్టిన వర్మ!
  • దర్శకుడు ఆదిత్య ధర్‌పై ప్రశంసలు కురిపించిన రామ్ గోపాల్ వర్మ!
  • యామీ గౌతమ్, ఆదిత్య ధర్ జంటను ఓడించాలని ఇండస్ట్రీ ఎదురుచూస్తోందన్న ఆర్జీవీ.
  • ‘దురంధర్’ దెబ్బకు టాలీవుడ్‌లో బడ్జెట్లు పెరిగాయని సంచలన వ్యాఖ్యలు!
  • మార్చి 19న విడుదల కానున్న ‘దురంధర్ 2’ సినిమా, భారీ పోటీ!

రామ్ గోపాల్ వర్మ మరోసారి సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు. ఆదిత్య ధర్, యామీ గౌతమ్‌ల సక్సెస్‌ను తట్టుకోలేక ఇండస్ట్రీ కుట్రలు చేస్తోందని బాంబ్ పేల్చారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.

ఆదిత్య ధర్ సక్సెస్‌పై ఆర్జీవీ కామెంట్స్!

Ram Gopal Varma About Aditya Dhar Yami Gautam Success: దర్శకుడు ఆదిత్య ధర్ సృష్టించిన సంచలనం సినీ పరిశ్రమలో ప్రకంపనలు పుట్టిస్తోందని రామ్ గోపాల్ వర్మ విశ్లేషించారు. ఆదిత్య దెబ్బకు టాలీవుడ్‌లో బడ్జెట్లు పెరిగిపోతున్నాయని, అందుకే చాలామంది ఆయన పతనాన్ని కోరుకుంటున్నారని ఆర్జీవీ బాంబు పేల్చారు.

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తనదైన శైలిలో హాట్ కామెంట్స్ చేశారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ధురంధర్’తో బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన దర్శకుడు ఆదిత్య ధర్‌పై ఆర్జీవీ ప్రశంసల వర్షం కురిపిస్తూనే, సినీ పరిశ్రమలోని చీకటి కోణాన్ని బయటపెట్టారు.

ఇండస్ట్రీలో అసూయ, కుట్రలున్నాయన్న వర్మ

ఆదిత్య ధర్ ఎదుగుదల చూసి ఇండస్ట్రీలో చాలామంది అసూయతో రగిలిపోతున్నారని, ఆయన, అతని భార్య యామీ గౌతమ్ ఎప్పుడు ఫెయిల్ అవుతారా అని అందరూ కాచుకుని కూర్చున్నారని రామ్ గోపాల్ వర్మ పేర్కొన్నారు.

“హిందీలోనే కాదు, ఇకపై ఏ భాషలోనూ సినిమాలు పాత పద్ధతిలో ఉండవు. ఆదిత్య సృష్టించిన బెంచ్ మార్క్ చూసి తెలుగులో కూడా చాలా పెద్ద బడ్జెట్ యాక్షన్ సినిమాలు ప్రస్తుతం రీ-షూటింగ్ జరుపుకుంటున్నాయి. దీనివల్ల నిర్మాతలపై కోట్ల రూపాయల భారం పడుతోంది. అందుకే ఇండస్ట్రీకి ఆయనంటే కోపం. అందరినీ కంఫర్ట్ జోన్ నుంచి బయటకు లాగారు, దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది” అని ఆర్జీవీ విశ్లేషించారు.

దురంధర్ 2కు పవన్ కళ్యాణ్ పోటీ!

” ఆదిత్య ధర్ , యామీ గౌతమ్ జంట ఇప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే, వారు ఎప్పుడు పొరపాటు చేస్తారా, ఎప్పుడు కింద పడతారా అని చిత్ర పరిశ్రమ మొత్తం వేచి చూస్తోంది” అని ఆర్జీవీ హెచ్చరించారు. అంటే దర్శకుడిగా ఆదిత్య ధర్, నటిగా యామీ గౌతమ్ ఇద్దరు మంచి సక్సెస్‌లో ఉన్నారు. వారెప్పుడు ఫెయిల్ అవుతారా అని అసూయతో ఇండస్ట్రీ వేచి చూస్తుందన్న అర్థంలో ఆర్జీవీ అలా కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

మార్చి 19న విడుదల కానున్న ధురంధర్ 2 సినిమా సుమారు నాలుగు గంటల (3 గంటల 55 నిమిషాలు) నిడివితో విడుదల కానుంది. అయితే, ధురంధర్ ది రివేంజ్ సినిమాకు యశ్ మూవీ టాక్సిక్ నుంచి బాక్సాఫీస్ పోటీ తప్పింది. కానీ, ఇప్పుడు టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి మాత్రం ధురంధర్ 2కి గట్టి పోటీ ఎదురవుతోంది.

రామ్ గోపాల్ వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. దీనిపై మరింత సమాచారం కోసం చూస్తూ ఉండండి. మరిన్ని అప్డేట్స్ కోసం వేచి ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.