|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుమ్మురేపిన ‘ధురంధర్ 2’.. RGV షాకింగ్ కామెంట్స్! బాక్సాఫీస్ బద్దలు.. రికార్డుల మోత!!

Published: 21-03-2026, 12:05 PM
దుమ్మురేపిన 'ధురంధర్ 2'.. RGV షాకింగ్ కామెంట్స్! బాక్సాఫీస్ బద్దలు.. రికార్డుల మోత!!
  • మార్చి 19, 2026న విడుదలైన ‘ధురంధర్ 2’ మూవీ!
  • తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 200 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.
  • దర్శకుడు ఆదిత్య ధర్ టేకింగ్‌కు RGV ప్రశంసలు కురిపించారు.
  • రణవీర్ సింగ్ నటన అద్భుతంగా ఉందని, సినిమా ఒక బెంచ్ మార్క్ అని కొనియాడిన RGV.

భారతీయ సినిమా పరిశ్రమలో సరికొత్త సంచలనం ‘ధురంధర్ 2’. రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. రణవీర్ సింగ్ యాక్షన్ మరియు ఆదిత్య ధర్ దర్శకత్వంపై ప్రశంసలు కురిపించారు.

‘ధురంధర్ 2’తో ఆదిత్య ధర్ సంచలనం!

RGV: భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ‘ధురంధర్: ది రివెంజ్’ ప్రభంజనం సృష్టిస్తోంది. మార్చి 19, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ స్పై యాక్షన్ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులను తిరగరాస్తోంది. మొదటి రోజే రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను సాధించి ట్రేడ్ వర్గాలను సైతం విస్మయానికి గురిచేసింది. దర్శకుడు ఆదిత్య ధర్ తన అద్భుతమైన మేకింగ్‌తో ఈ సీక్వెల్‌ను తొలి భాగం కంటే బెటర్ గా తీర్చిదిద్దారు. ఇక హీరోగా రణవీర్ సింగ్ తన పవర్ ఫుల్ నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేశాడు. ఇక మాధవన్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, అక్షయ్ ఖన్నా తమదైన శైలిలో మెప్పించారు.

రణవీర్ సింగ్ నటనకు RGV ఫిదా!

ఈ చిత్రంపై ఇప్పటికే టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళి ప్రశంసల జల్లు కురిపించారు. సినిమా స్కేల్, ఎమోషన్స్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా రణవీర్ సింగ్ పాత్రలో లీనమై నటించిన తీరు అద్భుతమని ఆయన కొనియాడారు. సాంకేతిక అంశాలు, యాక్షన్ సన్నివేశాలు అంతర్జాతీయ స్థాయిలో ఉన్నాయని రాజమౌళి అభిప్రాయపడ్డారు. మరోవైపు, వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV) సైతం ఈ సినిమాపై తనదైన శైలిలో స్పందించారు. ఆదిత్య ధర్ ఈ చిత్రంతో సినిమా వ్యాకరణాన్నే మార్చేశారని, భవిష్యత్తు దర్శకులకు ఇదొక బెంచ్ మార్క్‌గా నిలుస్తుందని వర్మ పేర్కొన్నారు. ఇదే క్రమంలో మోహిత్ సూరి రూపొందించిన ‘సయారా’ చిత్రాన్ని కూడా ఆయన ప్రస్తావనకు తీసుకోవడం వీశేషం.

బాక్సాఫీస్ వద్ద రికార్డుల సునామీ!

కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెకు హత్తుకునే భావోద్వేగాలతో సాగే ‘ధురంధర్: ది రివెంజ్’ లాంగ్ రన్‌లో రెండు వేల కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు. భారతీయ సినిమా స్థాయిని ప్రపంచ వేదికపై మరో మెట్టు ఎక్కించిన ఈ చిత్రం, ప్రేక్షకులకు ఒక సరికొత్త అనుభూతిని పంచుతోంది. ఆదిత్య ధర్ ప్రతిభకు ఈ సినిమా ఒక నిదర్శనంగా నిలిచిందని సినీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి రానున్న రోజుల్లో ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయనుంది అనేది చూడాలి.

‘ధురంధర్ 2’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి. మరిన్ని సినిమా అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.