
📌 Key Points
- యాంకర్ అరియనా గ్లోరీ ఆర్జీవీ ఇంటర్వ్యూతో భారీ పాపులారిటీ సాధించింది.
- ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయడానికి ఆమె మూడుసార్లు తిరస్కరణకు గురైంది.
- ‘నువ్వు ఆర్జీవీని డీల్ చేయలేవు’ అంటూ మొదటిసారి ఆమెను పంపించేశారు.
- ఆ వైరల్ ఇంటర్వ్యూ తర్వాత అరియనాకు బిగ్‌బాస్ ఆఫర్ వచ్చింది, కెరీర్ మలుపు తిరిగింది.
యాంకర్ అరియనా గ్లోరీ రామ్ గోపాల్ వర్మతో చేసిన ఇంటర్వ్యూతో రాత్రికి రాత్రే స్టార్‌డమ్ సంపాదించుకుంది. అయితే ఆ ఇంటర్వ్యూ వెనుక ఆమె పడిన కష్టం, ఎదుర్కొన్న తిరస్కరణలు చాలానే ఉన్నాయి. ‘డీల్ చేయలేవు’ అంటూ మూడుసార్లు రిజెక్ట్ చేసినప్పటికీ, అరియనా తన పట్టుదలతో ఎలా విజయం సాధించిందో ఈ కథనంలో చూద్దాం.
అరియనాకు ఆర్జీవీ ఇంటర్వ్యూ ఛాన్స్ ఎలా వచ్చింది?
RGV : యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టిన అరియనా కరోనా ముందు ఆర్జీవీతో చేసిన ఒక్క ఇంటర్వ్యూతో బాగా వైరల్ అయింది. ఓ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆర్జీవీని అరియనా ఇంటర్వ్యూ చేసింది. ఆర్జీవీ ఇంటర్వ్యూలు అంటే మాములుగా ఉండవని తెలిసిందే గా. అరియనాతో జిమ్ సెటప్ లో, జిమ్ డ్రెస్ లో కాస్త అడల్ట్ గా కనిపించేలా ఇంటర్వ్యూ చేసారు.(RGV)
దాంతో ఆ ఇంటర్వ్యూ, అరియనా రెండూ వైరల్ అయ్యాయి. పలువురు ఈ ఇంటర్వ్యూపై విమర్శలు కూడా చేసారు. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అరియనా దీనిగురించి మాట్లాడింది.
‘నువ్వు డీల్ చేయలేవు’ అంటూ పదేపదే తిరస్కరణ
అరియనా మాట్లాడుతూ.. నేను ఆర్జీవిని ఇంటర్వ్యూ చేయాలని ఎప్పుడో టార్గెట్ పెట్టుకున్నా. అది అనుకున్న సంవత్సరం తర్వాత ఛాన్స్ వచ్చింది. ఒక సినిమాకు ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయమని వచ్చింది. సరే అని రామానాయుడు స్టూడియోకి వెళ్తే నేను చిన్నపిల్లలా కనిపించాను వాళ్లకు. చిన్నపిల్లలా ఉంది, సన్నగా ఉన్నాను ట్యాలెంట్ లేదు, ఆర్జీవిని డీల్ చేయలేదు అని పంపించేశారు. నేను బాధపడ్డా.
వైరల్ ఇంటర్వ్యూతో వచ్చిన ఫేమ్, బిగ్‌బాస్ ఛాన్స్
రెండో సారి కూడా ఛాన్స్ వచ్చింది కానీ ఆ రోజు ఆర్జీవీ అనుకోకుండా రాలేదు. దాంతో క్యాన్సిల్ అయింది ఆ ఇంటర్వ్యూ కూడా. మూడో సారి ఛాన్స్ వస్తే అప్పుడు కూడా చాలా సన్నగా ఉన్నావు, నువ్వు డీల్ చేయలేవు అని పక్కనపెట్టి వేరే వాళ్ళతో ఇంటర్వ్యూ చేయించారు. దాంతో చాలా బాధపడ్డాను. నేను ఇంక ఆర్జీవీని ఇంటర్వ్యూ చేయాలనే టార్గెట్ వదిలేసా. కరోనా వచ్చే ముందు నాలుగో సారి ఛాన్స్ వచ్చింది. ఇన్ని సార్లు రిజెక్ట్ చేసిన తర్వాత ఈసారి కూడా రిజెక్ట్ చేస్తారేమో అని మొదట నో చెపుదాం అనుకున్నా. కానీ ఓకే చెప్పి ఇంటర్వ్యూ చేశా. ఆ ఇంటర్వ్యూ వల్లే నాకు ఫేమ్ వచ్చింది, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ ఛాన్స్ వచ్చింది అని తెలిపింది.
ఆర్జీవీ ఇంటర్వ్యూ కోసం అరియనా చూపిన పట్టుదల, ఎదుర్కొన్న తిరస్కరణలు ఆమెకు చివరికి భారీ విజయాన్ని అందించాయి. ఆ ఒక్క ఇంటర్వ్యూతో ఆమె కెరీర్ మలుపు తిరిగి, బిగ్‌బాస్ వంటి పెద్ద అవకాశాలను పొందగలిగింది. ఇది ఆమె నిబద్ధతకు నిదర్శనం.


