|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

RGV : సినిమా రివ్యూలకు సపోర్ట్ గా మాట్లాడిన ఆర్జీవీ.. వాటికి రివ్యూలు ఇస్తున్నప్పుడు సినిమాలకు ఎందుకు ఇవ్వకూడదు?

Published: 04-06-2025, 6:51 AM
RGV : సినిమా రివ్యూలకు సపోర్ట్ గా మాట్లాడిన ఆర్జీవీ.. వాటికి రివ్యూలు ఇస్తున్నప్పుడు సినిమాలకు ఎందుకు ఇవ్వకూడదు?

తాజాగా, ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ సినిమా రివ్యూలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. నిర్మాతలు రివ్యూలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఆయన ఈ విషయంపై స్పందించారు. ఆయన అభిప్రాయం ప్రకారం…

Key Points

1

సినిమా రివ్యూలపై నిర్మాతల అభ్యంతరాలను ఆర్జీవీ విమర్శించారు.

2

రివ్యూలు సినిమా విజయానికి ప్రభావితం చేస్తాయన్న వాదనను ఆయన తోసిపుచ్చారు.

4

రివ్యూ రచయితలు ప్రేక్షకులకు, సినీ పరిశ్రమకు కాదు, పనిచేస్తున్నారని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు.

ఆర్జీవీ రివ్యూలపై తన అభిప్రాయం

RGV : గత కొన్నాళ్లుగా సినీ పరిశ్రమలో పలువురు నిర్మాతలు రివ్యూలను తప్పు పడుతున్నారు. రివ్యూలు సినిమా రిలీజయిన రోజే రాయడం వల్ల సినిమాకు ఎఫెక్ట్ అవుతుందని అంటున్నారు. అయితే వీళ్ళు వెబ్ సైట్ రివ్యూల గురించే ఎక్కువగా మాట్లాడుతున్నారు కానీ అంతకంటే ఎక్కువ రీచ్ అయ్యే సోషల్ మీడియా, యూట్యూబ్ రివ్యూస్ గురించి మాత్రం స్పందించట్లేదు.

రివ్యూల గురించి సినీ పరిశ్రమలో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఒకప్పటి సెన్సేషనల్ డైరెక్టర్ ఆర్జీవీ ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూలు ఇవ్వగా ఈ రివ్యూల గురించి మాట్లాడారు.

నిర్మాతల వాదనలపై విమర్శ

ఆర్జీవీ మాట్లాడుతూ.. సినిమాలే కాదు పాలిటిక్స్, ఈవెంట్స్, ఫోన్స్, రెస్టారెంట్స్.. ఇలా చాలా వాటిపై రివ్యూస్ ఇస్తారు. అన్ని జడ్జ్ చేస్తారు. అలాంటప్పుడు సినిమాల గురించి ఎందుకు జడ్జ్ చేయకూడదు. రివ్యూస్ ఎందుకు ఉండకూడదు సినిమాలకు. సోషల్ మీడియాలో కూడా రివ్యూలు చెప్తారు. వాళ్ళని ఆపగలమా? నిర్మాతలు కొంతమంది రివ్యూలు ఉండొద్దు, మూడు రోజుల తర్వాత ఇవ్వాలి అని చెప్పడానికి వాళ్లెవరు. సినిమా బాగోకపోతే సినిమా చూసొచ్చిన ఒక ఆడియన్ ఎవర్ని ఆ సినిమా చూడొద్దు అంటాడు, అతన్ని ఆపగలరా? రివ్యూ రాసేవాళ్ళు ఆడియన్స్ కోసం పని చేస్తున్నారు. ఫిలిం ఇండస్ట్రీ కోసం కాదు అని అన్నారు. దీంతో ఇది కూడా నిజమే కాదా అని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

ప్రేక్షకులకు రివ్యూల ప్రాముఖ్యత

Also See : Supritha : శ్రీశైలం మల్లన్న సన్నిధిలో సుప్రీత.. చీరకట్టులో పద్దతిగా.. ఫోటోలు వైరల్..

చివరగా, ఆర్జీవీ వాదన ప్రకారం, సినిమా రివ్యూలు ప్రేక్షకులకు సహాయపడతాయి మరియు సినీ పరిశ్రమను నియంత్రించడం సాధ్యం కాదు. రివ్యూలు ప్రజాస్వామ్యం యొక్క భాగం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.