
కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన ‘కాంతార: చాప్టర్1’ ఘన విజయం సాధించింది. ఈ సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్ చేశారు. రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ, భారతదేశంలోని ఇతర దర్శకనిర్మాతలు సిగ్గుపడాలంటూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి.
Key Points
'కాంతార: చాప్టర్1' సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుని రికార్డులు క్రియేట్ చేస్తోంది.
రామ్ గోపాల్ వర్మ 'కాంతార'ను, రిషబ్ శెట్టిని ప్రశంసిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
భారతదేశంలోని అన్ని చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి కృషిని చూసి సిగ్గుపడాలని వర్మ వ్యాఖ్యానించారు.
ఆర్జీవీ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతూ భిన్నాభిప్రాయాలకు దారితీసింది.
కాంతార విజయానికి ఆర్జీవీ ప్రశంసలు
కన్నడ స్టార్ హీరో, డైరెక్టర్ రిషబ్ శెట్టి(Rishabh Shetty) లేటెస్ట్ మూవీ ‘కాంతార: చాప్టర్1(Kantara: Chapter 1)’. ఈ పాన్ ఇండియా సినిమాను హోంబలే ఫిలిమ్స్ భారీ బడ్జెట్‌తో నిర్మించగా.. రుక్మిణి వసంత్(Rukmini Vasanth) హీరోయిన్‌గా నటించింది. ఇక ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్స్‌లో విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లో పాజిటివ్ టాక్ రావడంతో పాటు భారీ కలెక్షన్లు రాబడుతూ పలు రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈనేపథ్యంలో..పలువురు సినీ సెలబ్రిటీలు ‘కాంతార:చాప్టర్1’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ పోస్టులు పెడుతున్నారు.
దర్శకనిర్మాతలపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
తాజాగా, ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తూ వివాదాస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘కాంతార ఒక అద్భుతమైన సినిమా. భారతదేశంలో ఉన్న అన్ని చిత్ర నిర్మాతలు రిషబ్ శెట్టి అలాగే అతని బృందం.. సౌండ్ డిజైన్, సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అలాగే బిఎఫ్ ఎక్స్‌లలో చేసిన కృషిని చూసి సిగ్గుపడాలి. బోనస్ అయిన కంటెంట్‌ను మరచిపోయి వారి కృషి మాత్రమే ఈ సినిమాను బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలబెట్టింది.
సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ పై దుమారం
క్రియేటివ్ టీం రాజీ పడకుండా పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చిన హోంబలే ఫిలిమ్స్‌కు అభినందనలు. రిషబ్ శెట్టి మీరు గొప్ప డైరెక్టరా.. లేకపోతే నటుడా అనే విషయాన్ని నేను నిర్ణయించలేకపోతున్నాను’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా నమస్కరిస్తున్న ఎమోజీని కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతోంది. రిషబ్ శెట్టిపై ప్రశంసలు కురిపించిన వర్మ మిగతా దర్శకనిర్మాతలను విమర్శిస్తూ పోస్ట్ పెట్టడంతో అది చూసిన నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
రిషబ్ శెట్టిని అభినందిస్తూనే, ఇతర దర్శకనిర్మాతలను విమర్శించిన ఆర్జీవీ పోస్ట్ నెటిజన్లలో భిన్నాభిప్రాయాలకు దారితీసింది. కాంతార విజయం నేపథ్యంలో వర్మ చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


