|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సౌత్ సినిమాల ప్రభావాన్ని తోసిపుచ్చి.. ఇండస్ట్రీని వణికించబోతోందన్న ఆర్జీవీ సంచలన పోస్ట్!

Published: 29-12-2025, 10:25 PM
సౌత్ సినిమాల ప్రభావాన్ని తోసిపుచ్చి.. ఇండస్ట్రీని వణికించబోతోందన్న ఆర్జీవీ సంచలన పోస్ట్!
  • రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ రూ.1000 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
  • బాలీవుడ్‌పై సౌత్ సినిమాల ప్రభావాన్ని ‘ధురంధర్’ తన ఎడమ కాలితో వెనక్కి తన్నిందని ఆర్జీవీ పోస్ట్.
  • ‘ధురంధర్ 2’ పార్ట్ 1 కన్నా ఎక్కువ భయంకరంగా, ఇండస్ట్రీని వణికించేలా ఉంటుందని ఆర్జీవీ సంచలనం.
  • ‘ధురంధర్ 2’ మార్చి 19న విడుదల కానుంది, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్’ చిత్రం భారీ విజయం సాధించగా, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన పోస్ట్ పెట్టారు. బాలీవుడ్‌కు దూసుకొచ్చిన సౌత్ సినిమాల ప్రభావాన్ని ‘ధురంధర్’ తిప్పికొట్టిందని ఆర్జీవీ పేర్కొన్నారు. పార్ట్ 2 ఇండస్ట్రీని వణికించడం ఖాయమని ఆయన కామెంట్ చేశారు.

‘ధురంధర్’ బాక్సాఫీస్ వద్ద సృష్టించిన సునామీ

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్(Ranveer Singh) నటించిన ‘ధురంధర్’(Dhurandhar) ఈ ఏడాది నంబర్ 1 సినిమాగా నిలిచింది. డిసెంబర్ 5న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద పలు రికార్డులను బద్దలు కొట్టింది. అంతేకాకుండా మొదటి షో నుంచి సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది. ఏకంగా రూ.1000 కోట్లు వసూల్ చేసిన సినిమాగా నిలిచింది. ఆదిత్య ధర్ తెరకెక్కించిన ఈ సినిమాపై సినీ స్టార్స్ ఎంతోమంది ప్రశంసలు కురిపించారు.పాకిస్థాన్ లోని బలోచ్ గ్యాంగ్ లోకి చొరబడిన ఇండియన్ స్పై కథగా వచ్చి ప్రేక్షకులను మంత్రమగ్దులను చేసింది. ఇకఫస్ట్ పార్ట్ ఇంతటి ఘన విజయం సాధించడంతో.. మూవీ మేకర్స్ ఈ సినిమాకు రెండో పార్ట్ తీసుకురాబోతున్నారు. వచ్చే ఏడాది మార్చి 19 ‘ధురంధర్-2’ థియేటర్స్‌లోకి రాబోతుంది.

అయితే ఇప్పటికే ఎన్నోసార్లు ఈ సినిమాపూ ప్రశంసలు కురిపించిన ఆర్జీవీ మరోసారి సంచలన పోస్ట్ పెట్టాడు. తాజాగా, ట్విట్టర్ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ‘‘బాలీవుడ్ మీదకు దూసుకొచ్చిన సౌత్ సినిమాల ఫైర్ బాల్‌‌ను.. ఆదిత్య ధర్ తన ఎడమ కాలితో ‘ధురంధర్’ రూపంలో వెనక్కి తన్నాడు. ఇప్పుడు తన కుడి కాలుతో ‘ధురంధర్-2’ ని రెడీ చేస్తున్నాడు. నేను పార్ట్-2లో చూసిన దానిబట్టి చెప్తున్నా.. పార్ట్-1 మిమ్మల్ని భయపెట్టి ఉంటే, పార్ట్-2 మిమ్మల్ని వణికించేస్తుంది’’ అని రాసుకొచ్చారు. ప్రజెంట్ ఈ పోస్ట్ సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. అది చూసిన నెటిజన్లు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. “ఆర్జీవీ నుంచి ఇంత పెద్ద కాంప్లిమెంట్ అంటే నిజంగా పార్ట్–2 రేంజ్ వేరే లెవల్‌లో ఉండబోతోంది” అంటూ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ‘ధురంధర్’ సక్సెస్‌తో బాలీవుడ్‌లో కొత్త జోష్ కనిపిస్తుండగా, రెండో భాగంపై అంచనాలు మరింతగా పెరిగాయి.

పార్ట్ 2పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

అంచనాలు పెంచుతున్న ‘ధురంధర్ 2’ విడుదల

మొత్తానికి, ‘ధురంధర్’ విజయం బాలీవుడ్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆర్జీవీ పోస్ట్‌తో ‘ధురంధర్ 2’పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఈ సినిమా ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.