
📌 Key Points
- రామ్‌గోపాల్ వర్మ ‘ధురంధర్’ సినిమాపై సంచలన రివ్యూ ఇచ్చారు.
- రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోపై ప్రశంసల జల్లు కురిసింది.
- ఇది సాధారణ సినిమా కాదని, ఇండియన్ సినిమాను మార్చేస్తుందని RGV అభిప్రాయం.
- ఆదిత్య ధర్ తన విజన్‌తో సినిమా ప్రమాణాలను పెంచాడని వర్మ అన్నారు.
ధురంధర్ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టిస్తోంది. ఈ సినిమా చూసిన ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రశంసల వర్షం కురిపించారు. రణ్‌వీర్ సింగ్ నటించిన ఈ మూవీ భారతీయ సినిమా గమనాన్ని మార్చేస్తుందని RGV అభిప్రాయపడ్డారు. వర్మ రివ్యూ ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది.
ఆర్జీవీ ప్రశంసల వర్షం
ధురంధర్ సినిమాకు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ చూస్తే వెంటనే వెళ్లి సినిమా చూసేస్తారేమో. ఆ స్థాయిలో ఈ మూవీని, దీనిని తీసిన డైరెక్టర్ ను ఆర్జీవీ ఆకాశానికెత్తాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ ధురంధర్ సంచలనాలు సృష్టిస్తున్న విషయం తెలిసిందే.
రణ్‌వీర్ సింగ్ హీరోగా ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన ‘ధురంధర్’ సినిమాపై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇది సాధారణ సినిమా కాదని, భారతీయ సినిమా గమనాన్నే మార్చేసే అద్భుతమని వర్ణిస్తూ ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇచ్చిన రివ్యూ ఇప్పుడు వైరల్ అవుతోంది.
ఇండియన్ సినిమాను మార్చే మూవీ
భారతీయ సినిమా గమనం మార్చే మూవీ
“నార్త్ అయినా, సౌత్ అయినా సరే.. ఆదిత్య ధర్ ఒంటిచేత్తో భారతీయ సినిమా భవిష్యత్తును మార్చేశారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే ‘ధురంధర్’ అనేది జస్ట్ ఒక సినిమా కాదు.. అది సినిమా ప్రమాణాలను పెంచిన ఒక భారీ ముందడుగు. ఈ సినిమాలో ఉన్నది కేవలం భారీతనం మాత్రమే కాదు.. మనమెప్పుడూ చూడని ఒక కొత్త విజన్ ఉంది. ఆదిత్య ధర్ ఇక్కడ సీన్లను డైరెక్ట్ చేయలేదు.. పాత్రల మైండ్ సెట్‌ని, మన మైండ్ సెట్‌ని కూడా ఇంజనీరింగ్ చేశారు. ఈ సినిమా మన అటెన్షన్‌ని అడగదు.. డిమాండ్ చేసి మరీ లాక్కుంటుంది. ఫస్ట్ షాట్ నుంచే ఏదో జరగబోతోందనే ఫీలింగ్ మొదలవుతుంది. మనం కేవలం ప్రేక్షకుల్లా కాకుండా, అందులో జరుగుతున్న దాంట్లో భాగమైపోతాం” అని ఆర్జీవీ అన్నాడు.
ఆడియెన్స్ చాలా తెలివైన వాళ్లు
ఆదిత్య ధర్ విజన్‌కి హ్యాట్సాఫ్
అన్నిటికంటే ముఖ్యంగా.. ఈ సినిమా తీయాలన్న ఉద్దేశమే గొప్పదని, ట్రెండ్స్ ఫాలో అవ్వడానికో, డబ్బుల కోసమో తీసింది కాదని చెప్పాడు. మనం హాలీవుడ్ ని కాపీ కొట్టక్కర్లేదు, మన నేటివిటీతోనే ఇంటర్నేషనల్ రేంజ్ సినిమా తీయొచ్చని ఆదిత్య ధర్ నిరూపించాడని వర్మ అభిప్రాయపడ్డాడు.
టైటిల్స్ పడుతున్నప్పుడు.. ఏదో ఎంటర్టైన్ అయ్యాం అనిపించదు.. మనం మారిపోయాం అనిపిస్తుంది.. మనలాంటి ఫిల్మ్ మేకర్స్ అందరూ నిలబడే పునాదిని మార్చేసే సత్తా ఉన్న డైరెక్టర్ ఆదిత్య ధర్ అంటూ అతన్ని రామ్ గోపాల్ వర్మ ఆకాశానికెత్తాడు.
మొత్తం మీద, ‘ధురంధర్’ కేవలం ఒక సినిమా కాదు, భారతీయ సినిమా భవిష్యత్తును మార్చే భారీ ముందడుగు అని రామ్‌గోపాల్ వర్మ రివ్యూ స్పష్టం చేస్తోంది. ఆదిత్య ధర్ విజన్, రణ్‌వీర్ సింగ్ నటన సినిమా ప్రమాణాలను పెంచాయని చెప్పొచ్చు.


