|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అఫీషియల్: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి ‘రైడ్ 2’.. స్ట్రీమింగ్ వివరాలివే

Published: 24-06-2025, 10:51 AM
అఫీషియల్: ఒకరోజు ముందుగానే ఓటీటీలోకి ‘రైడ్ 2’.. స్ట్రీమింగ్ వివరాలివే

అజయ్ దేవ్‌గణ్ నటించిన బాలీవుడ్ థ్రిల్లర్ ‘రైడ్ 2’ సినిమా ఓటీటీలోకి రాబోతోంది. మే 1న విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

Key Points

1

బాలీవుడ్ సూపర్ హిట్ ‘రైడ్ 2’ ఓటీటీలోకి ఎంట్రీ

2

జూన్ 26న నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం

4

థియేటర్ రిలీజ్ తర్వాత 8 వారాలకు ఓటీటీ రిలీజ్

రైడ్ 2 ఓటీటీ రిలీజ్ డేట్

బాలీవుడ్ థ్రిల్లర్ చిత్రం ‘రైడ్ 2’ ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. స్ట్రీమింగ్ డేట్ గురించి అధికారిక ప్రకటన వచ్చేసింది. అజయ్ దేవ్‍గణ్ హీరోగా నటించిన ఈ సినిమా మే 1వ తేదీని థియేటర్లలో రిలీజైంది. రాజ్‍కుమార్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ సీక్వెల్ మూవీ మంచి హిట్ సాధించింది.

రైడ్ 2 మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కోసం చాలా మంది ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. థియేట్రికల్ రన్‍లో పాజిటివ్ టాక్‍ను ఈ సినిమా దక్కించుకుంది. ఓటీటీ రిలీజ్‍పై కూడా ఇంట్రెస్ట్ నెలకొంది. ఈ క్రమంలో ఇప్పుడు రైడ్ 2 సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‍పై అధికారిక ప్రకటన వచ్చేసింది.

రైడ్ 2 చిత్రం నెట్‍ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో జూన్ 26వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. అంటే మరో రెండు రోజుల్లో ఈ మూవీ స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (జూన్ 24) అధికారికంగా వెల్లడించింది. “కొత్త కేసు, పాత ఫైర్‌తో అమయ్ పట్నాయక్ వచ్చేస్తున్నాడు. రైడ్ 2 మూవీ జూన్ 26న నెట్‍ఫ్లిక్స్‌లోకి రానుంది” అని సోషల్ మీడియాలో నేడు ప్రకటించింది.

నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్

రైడ్ 2 చిత్రం సినిమా నెట్‍ఫ్లిక్స్‌లోకి జూన్ 27వ తేదీన వస్తుందనే అంచనాలు ఇటీవల బయటికి వచ్చాయి. ఈ డేట్‍పై జోరుగా ప్రచారం జరిగింది. అయితే, అందుకు ఒకరోజు ముందుగా జూన్ 26నే ఈ చిత్రాన్ని స్ట్రీమింగ్‍కు తీసుకొస్తోంది నెట్‍ఫ్లిక్స్ . థియేటర్లలో రిలీజైన 8 వారాలకు ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వస్తోంది.

సూపర్ హిట్‍ అయిన రైడ్‍కు సీక్వెల్‍గా ఏడేళ్ల తర్వాత రైడ్ 2 సినిమా వచ్చింది. ఈ సీక్వెల్‍లోనూ ఐటీ శాఖ అధికారి అమయ్ పట్నాయక్ పాత్రలో అజయ్ దేవ్‍గణ్ అదరగొట్టారు. మరో ఐటీ రైడ్ చుట్టూ ఈ థ్రిల్లర్ మూవీ సాగుతుంది. ప్రేక్షకులను నుంచి మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది.

సినిమా వివరాలు మరియు నటీనటులు

రైడ్ 2 చిత్రం సుమారు రూ.120కోట్ల బడ్జెట్‍తో రూపొందింది. ఈ చిత్రం రూ.230కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కించుకుంది. కమర్షియల్‍గా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టింది. ఈ మూవీలో అజయ్ దేవ్‍గణ్‍కు జోడీగా వాణి కపూర్ నటించారు. రితేశ్ దేశ్‍ముఖ్ నెగెటివ్ రోల్ చేశారు. రజత్ కపూర్, సౌరభ్ శుక్లా, అమిత్ సియాల్ కీలకపాత్రల్లో కనిపించారు.

రైడ్ 2 సినిమా 1990ల బ్యాక్‍డ్రాప్‍లో రూపొందింది. ఓ భారీ ఐటీ రైడ్ చేసిన తర్వాత ఆఫీసర్ అమయ్ పట్నాయక్ (అజయ్ దేవ్‍గణ్).. రాజస్థాన్‍లోని భోజ్‍కు బదిలీ అవుతాడు. అక్కడ అవినీతి పరుడైన రాజకీయ నాయకుడు మనోహర్ ధన్కడ్ అలియాడ్ దాదా మనోహర్ బాయ్ (రితేశ్)పై నిఘా వేస్తాడు. అవినీతి గుట్టు విప్పేందుకు ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో సస్పెండ్ అయి మళ్లీ డ్యూటీలో జాయిన్ అవుతాడు అమయ్. మనోహర్ అవినీతిని బయటపెట్టే క్రమంలో అమయ్‍కు ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయనేవి రైడ్ 2 చిత్రంలో ఉంటాయి.

చివరగా, ‘రైడ్ 2’ సినిమా ఓటీటీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో జూన్ 26న ఈ సినిమాను ఎంజాయ్ చేయండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.