|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రిషబ్ శెట్టికి ఊహించని ఆఫర్! జై హనుమాన్ కోసం రికార్డు స్థాయి పారితోషికం!!

Published: 22-03-2026, 4:05 AM
రిషబ్ శెట్టికి ఊహించని ఆఫర్! జై హనుమాన్ కోసం రికార్డు స్థాయి పారితోషికం!!
  • జై హనుమాన్: రిషబ్ శెట్టికి మైత్రి మూవీస్ భారీ ఆఫర్!
  • రిషబ్ ముందు రెండు ఆప్షన్లు: ₹20 కోట్ల + లాభాల్లో వాటా లేదా ₹80 కోట్ల ఫిక్స్‌డ్ పారితోషికం!
  • 2026 ఫిబ్రవరి 22న హంపిలో అంజనాద్రిలో జై హనుమాన్ మూవీ షూటింగ్ ప్రారంభం!
  • పాన్ ఇండియా స్థాయిలో జై హనుమాన్ మూవీ విడుదల, ప్రశాంత్ వర్మ దర్శకత్వం!

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ‘జై హనుమాన్’ మూవీ రాబోతోంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో రిషబ్ శెట్టి నటిస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఆయనకు ఆఫర్ చేసిన పారితోషికం ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్!

జై హనుమాన్: రిషబ్ శెట్టి పాత్ర ఇదే!

హనుమాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా జై హనుమాన్ రూపొందించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి కనిపించనున్నాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మించబోతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ 2026 ఫిబ్రవరి 22న హంపిలోని అంజనాద్రిలో ఘనంగా ప్రారంభమైంది. ఇదిలా ఉంటే ఈ సినిమాకు గాను రిషబ్ శెట్టికి ఈ మూవీ నిర్మాణ సంస్థ భారీ పారితోషకం ఆఫర్ చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఆయనకు రెండు రకాల పారితోషకం ఎంచుకునే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది.

మొదటి ఆప్షన్: సుమారు ₹20 కోట్ల పారితోషకం తీసుకోవడం, అదనంగా సినిమా లాభాల్లో 33 శాతం వాటా పొందడం.

పారితోషికం విషయంలో నిర్మాతల భారీ ఆఫర్!

రెండో ఆప్షన్: సినిమా లాభనష్టాలతో సంబంధం లేకుండా ₹80 కోట్లు ఫిక్స్‌డ్ పారితోషకం ముందుగానే తీసుకోవడం.

రిషబ్ శెట్టి ఏ ఆప్షన్ ఎంచుకుంటారో తెలుసా?

ప్రస్తుతం నిర్మాణ సంస్థ మాత్రం ఒకేసారి ₹80 కోట్లు ఫిక్స్‌డ్‌గా ఇవ్వడం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే హీరో రిషబ్ శెట్టి మాత్రం ₹20 కోట్లు + లాభాల్లో వాటా ఉన్న మొదటి ఆప్షన్‌పై ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది.

జై హనుమాన్ చిత్రం టాలీవుడ్‌లో సంచలనం సృష్టిస్తోంది. రిషబ్ శెట్టి పారితోషికం గురించిన ఈ వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.