|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

`కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా? 25 రెట్లు పెంపు.. యష్‌, శివరాజ్‌ కుమార్‌లు దరిదాపుల్లో కూడా లేరు

Published: 12-07-2025, 7:30 AM
`కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం ఎంతో తెలుసా? 25 రెట్లు పెంపు.. యష్‌, శివరాజ్‌ కుమార్‌లు దరిదాపుల్లో కూడా లేరు

కన్నడ సినిమా పరిశ్రమలో సంచలనం సృష్టించిన కాంతార సినిమా ప్రీక్వెల్ కాంతార 2 అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి పాత్రకు సంబంధించి ఆసక్తికరమైన విషయం బయటపడింది.

Key Points

1

కాంతార 2 కోసం రిషబ్ శెట్టి పారితోషికం అనూహ్యంగా పెరిగింది.

2

మొదటి భాగంతో పోలిస్తే 25 రెట్లు పెరిగిన రెమ్యునరేషన్.

4

అక్టోబర్ 2న పాన్ ఇండియా రిలీజ్ తో భారీ అంచనాలు.

రిషబ్ శెట్టి పారితోషికం షాకింగ్ న్యూస్

కన్నడలో `కేజీఎఫ్‌` మూవీ ఒక సంచలనం సృష్టించింది. కన్నడ సినిమా పరిశ్రమని ప్రపంచానికి పరిచయం చేసింది. రీమేక్‌ సినిమాలతో రన్‌ అయ్యే పరిశ్రమ అనే విమర్శల నుంచి తాము సంచలనాలు క్రియేట్‌ చేస్తామని నిరూపించింది `కేజీఎఫ్‌`.

దాన్ని కంటిన్యూ చేసింది `కాంతార`. ఎలాంటి అంచనాలు లేకుండా మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది. కన్నడ సినిమా పరిశ్రమ సత్తా ఏంటో చూపించింది. ఈ చిత్రం నాలుగు వందల కోట్లకుపైగా కలెక్షన్లని సాధించడం విశేషం.

ఇప్పుడు `కాంతార 2` రాబోతుంది. `కాంతార`కి ప్రీక్వెల్‌గా `కాంతారః ఛాప్టర్‌ 1` పేరుతో దీన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు రిషబ్‌ శెట్టి. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.

ఇటీవలే రిలీజ్‌ డేట్‌ని ప్రకటించారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2న విడుదల చేయనున్నట్టు టీమ్‌ వెల్లడించింది.

పాన్‌ ఇండియా మూవీగా దీన్ని కన్నడతోపాటు తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు.

కాంతార 2: భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ప్రీక్వెల్

ఈ సినిమా `కాంతార` కథకి ముందు జరిగిన స్టోరీ ప్రధానంగా సాగుతుంది. కథ మూలాలను ఆవిష్కరించే చిత్రమిది.  హీరో పాత్రకి సంబంధించిన గత చరిత్రని ఆవిష్కరించబోతున్నారు.

`కాంతార` మూవీని రిషబ్‌ శెట్టి దర్శకత్వం వహిస్తూ, హీరోగా నటించారు. ఆయన సరసన సప్తమిగౌడ హీరోయిన్‌గా నటించింది. ఇప్పుడు దీని ప్రీక్వెల్‌ని కూడా ఆయనే దర్శకత్వం వహిస్తూ నటిస్తున్నారు.

హోంబలే ఫిల్మ్స్ చాలా ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్‌తో దీన్ని తెరకెక్కిస్తోంది. మొదటి సినిమా భారీ విజయం సాధించడంతో `కాంతార 2` స్కేల్‌ బాగా పెరిగిపోయింది.

యాక్షన్‌ సీన్లు హైలైట్గా ఉంటాయని సమాచారం.  చాలా గ్రాండియర్‌గా తీర్చిదిద్దుతున్నారు.  వెయ్యి కోట్ల బాక్సాఫీసు కలెక్షన్ల టార్గెట్‌తో దీన్ని తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది.

అయితే `కాంతార 2`కి రిషబ్‌ శెట్టి పారితోషికం తెలిస్తే షాక్‌ అవ్వక మానరు. ఎందుకంటే మొదటి పార్ట్ తో పోల్చితే 25రెట్లు పెంచడం విశేషం.

అక్టోబర్ 2న పాన్ ఇండియా రిలీజ్

మొదటి సినిమాకి నాలుగు కోట్ల పారితోషికం తీసుకున్న రిషబ్‌ శెట్టి ఇప్పుడు `కాంతారః ఛాప్టర్‌ 1`కి ఏకంగా వంద కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారట. ఇదే ఇప్పుడు కన్నడలో చర్చనీయాంశంగా మారింది.

ఒక్క సినిమా హిట్‌ తో 25రెట్లు పారితోషికం పెంచిన ఏకైక ఇండియన్‌ స్టార్‌గా రిషబ్‌ శెట్టి రికార్డు సృష్టించారని చెప్పొచ్చు. దీంతో ఇప్పుడు పాన్‌ ఇండియా తెలుగు హీరోల జాబితాలో రిషబ్‌ శెట్టి చేరిపోయారు.

అంతేకాదు కన్నడలో ఈ రేంజ్‌లో పారితోషికం తీసుకునే నటుడు ఎవరూ లేరు. `కేజీఎఫ్‌`తో సంచలనాలు క్రియేట్ చేసిన యష్‌ సైతం రూ.50 కోట్లు మాత్రమే పారితోషికంగా తీసుకుంటున్నారట.

ప్రస్తుతం ఆయన `టాక్సిక్‌` రెమ్యూనరేషన్‌ యాభై కోట్లు. ఇక కన్నడ స్టార్స్ సుదీప్‌ ఇరవై కోట్ల వరకు, దర్శన్‌ ఇరవై కోట్ల వరకు, శివరాజ్‌ కుమార్‌ పది కోట్ల వరకు, ఉపేంద్ర రూ.15కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్నారు. వీరంతా రిషబ్‌ శెట్టి దరిదాపుల్లో కూడా లేకపోవడం గమనార్హం.

ఇదిలా ఉంటే రిషబ్‌ శెట్టి తెలుగులో `జై హానుమాన్‌`లో టైటిల్‌ రోల్‌పోషిస్తున్న విషయం తెలిసిందే.

కాంతార 2 భారీ అంచనాల మధ్య విడుదలవుతున్న నేపథ్యంలో రిషబ్ శెట్టి పారితోషికం కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో విజయం సాధిస్తుందో చూడాలి.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.