
సుపర్ హిట్ ‘కాంతార’ సినిమా ప్రీక్వెల్ షూటింగ్ సమయంలో వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ముగ్గురు నటులు మరణించగా, తాజాగా జరిగిన బోటు ప్రమాదంలో 30 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
Key Points
'కాంతార' చిత్రీకరణ సమయంలో మరో ప్రమాదం.
జలాశయంలో బోటు మునిగిపోవడంతో 30 మంది ప్రాణాలతో బయటపడ్డారు.
షూటింగ్ ప్రారంభం నుంచి ఇప్పటికే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు.
సినిమాకు శాపం పట్టుకుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
జలాశయంలో బోటు ప్రమాదం
‘కాంతార’ సినిమా సూపర్ హిట్. వందల కోట్ల కలెక్షన్స్ వచ్చాయి. దీంతో ప్రీక్వెల్ తీయడం మొదలుపెట్టారు. అప్పటినుంచి ఏం శాపం వెంటాడుతుందో ఏమో గానీ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. షూటింగ్‌కి వచ్చిన పలువురు నటులు చనిపోతున్నారు. ఇప్పుడు కూడా బోటు ప్రమాదం జరిగింది. ఆ టైంలో బోటులో హీరోతో పాటు ఏకంగా 30 మంది వరకు ఉన్నారు. కానీ కొద్దిలో భారీ ప్రమాదం నుంచి అందరూ తప్పించుకున్నారు. దీంతో టీమ్ అంతా ఊపిరి పీల్చుకుంది.
ముగ్గురు జూనియర్ ఆర్టిస్టుల మరణం
కన్నడ హీరో రిషభ్ శెట్టి హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కాంతార 1’. గతంలో వచ్చిన చిత్రానికి ఇది ముందు భాగం అనమాట. ఈ ఏడాది అక్టోబరు 2న థియేటర్లలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు. అందుకు తగ్గట్లే చాన్నాళ్ల నుంచి షూటింగ్ చేస్తున్నారు. కానీ ఇదివరకే ముగ్గురు జూనియర్ ఆర్టిస్టులు మరణించారు. తొలుత రాకేష్ పూజారి అనే కన్నడ నటుడు సెట్లో గుండెపోటుతో మరణించాడు. తర్వాత కొన్నాళ్లకు జూనియర్ ఆర్టిస్ట్ కపిల్.. కర్ణాటకలోని ఉడిపి జిల్లాలోని సౌపర్ణిక నదిలో ప్రమాదవశాత్తు మునిగిపోయి ప్రాణాలు కోల్పోయాడు. కొన్నిరోజుల క్రితం కళాభవన్ అనే వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడు.
‘కాంతార 2’ షూటింగ్‌లో వరుస ప్రమాదాలు
కర్ణాటకలోని మాణి జలాశయంలో శనివారం రాత్రి షూటింగ్ జరుగుతుండగా బోటు నీటిలో మునిగింది. ప్రమాద సమయంలో హీరో రిషభ్ శెట్టి సహా 30 మంది నటీనటులు, సిబ్బంది అందులో ఉన్నారు. అయితే సంఘటన జరిగిన తర్వాత వారందరూ ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. కానీ షూటింగ్ సామాగ్రి మాత్రం నీటిపాలైంది. అయితే చిత్రీకరణ మొదలైనప్పటి నుంచి ఇలా వరస ప్రమాదాలు జరుగుతుండటంతో సినిమాకు ఏమైనా శాపం పట్టుకుందా అని నెటిజన్లు, అభిమానులు మాట్లాడుకుంటున్నారు. షూటింగ్ పూర్తయ్యేలోపు ఇంకెన్ని జరుగుతాయో ఏంటోనని అనుకుంటున్నారు.
వరుస ప్రమాదాలతో ‘కాంతార 2’ చిత్రీకరణ ఆందోళన కలిగిస్తోంది. షూటింగ్ పూర్తయ్యే వరకు మరిన్ని ప్రమాదాలు జరుగుతాయేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


