|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

లవ్ ట్రాక్ నడపడానికే బిగ్ బాస్ కి వచ్చింది.. రీతూ, అయేషా మధ్య రణరంగం

Published: 21-10-2025, 2:21 AM
లవ్ ట్రాక్ నడపడానికే బిగ్ బాస్ కి వచ్చింది.. రీతూ, అయేషా మధ్య రణరంగం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 43వ రోజు నామినేషన్స్ ప్రక్రియ ఉత్కంఠగా సాగింది. రీతూ లవ్ ట్రాక్ కోసమే హౌస్‌కు వచ్చిందని అయేషా సంచలన ఆరోపణలు చేసింది. దీంతో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇతర కంటెస్టెంట్ల మధ్య కూడా తీవ్ర వాగ్వాదాలు చెలరేగాయి.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో 43వ రోజు నామినేషన్స్ ప్రక్రియ ఉద్రిక్తంగా జరిగింది.

2

అయేషా, రీతూ లవ్ ట్రాక్ పై సంచలన ఆరోపణలు చేయడంతో గొడవ తీవ్రమైంది.

4

దివ్య, సాయి, రమ్య, కళ్యాణ్ నామినేషన్స్ కూడా వాగ్వాదాలతో నిండిపోయాయి.

రీతూ, అయేషా మధ్య రణరంగం

బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో భాగంగా 43వ రోజు నామినేషన్స్ ప్రక్రియ జరిగింది. ఈవారం నామినేషన్స్ దద్దరిల్లాయి. కొందరు కంటెస్టెంట్స్ అయితే ఒకరిపై ఒకరు ఎక్కడ దాడి చేసుకుంటారో అని అనిపించేలా రచ్చ చెలరేగింది. బిగ్ బాస్ ఇమ్మాన్యుయేల్, అయేషా లకు ఒక టాస్క్ ఇచ్చారు. హౌస్ లో వందలకొద్దీ బెలూన్స్ ఉంచారు. వాటిని పగలగొడితే కొన్ని చీటీలు బయటపడతాయి. అవి నామినేషన్స్ కి సంబంధించిన చీటీలు. వాటిని ఇమ్మాన్యుయేల్, అయేషా తాము కోరుకున్న వారికి ఇవ్వొచ్చు. ఆ విధంగా చీటీలు పొందిన వారు వేరే వాళ్ళని నామినేట్ చేయొచ్చు. అందులో ఒక డైరెక్ట్ నామినేషన్ ఉంటుంది.

అయేషా డైరెక్ట్ నామినేషన్ చీటీని తనవద్దే ఉంచుకుంది. దీనితో అయేషా ముందుగా రీతూని డైరెక్ట్ నామినేట్ చేసింది. దీనికి అయేషా చెప్పిన రీజన్ సంచలనంగా ఉంది. రీతూ చేసే ఓవరాక్షన్ నాకు నచ్చట్లేదు.  రీతూ బిగ్ బాస్ కి వచ్చింది లవ్ ట్రాక్ నడపడానికి మాత్రమే. కెమెరాలో కనిపించడానికి అది చాలా సులభమైన మార్గం. ఎంతసేపు లవ్ ట్రాక్ లు నడుపుకుంటూ టైం గడుపుతోంది. గేమ్ అసలు ఆడట్లేదు అంటూ అయేషా సంచలన వ్యాఖ్యలు చేసింది. రీతూ కూడా అయేషా ఆరోపణలపై చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. రీతూ కూడా తిరిగి అయేషా ని నామినేట్ చేసింది.

నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదాలు

ఈసారి వీరిద్దరి మధ్య గొడవ తారా స్థాయికి చేరింది. రీతూని అయేషా పోవే అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీనితో ఒకరిపై ఒకరు దూకుతూ ఎక్కడ దాడి చేసుకుంటారో అని అనిపించేలా వాగ్వాదానికి దిగారు. మొత్తంగా రీతూ చౌదరి డైరెక్ట్ గా నామినేట్ అయింది. ఆ తర్వాత దివ్య.. అయేషా, సాయి లని నామినేట్ చేసింది. సాయి తనని తాను డిపెండ్ చేసుకునే క్రమంలో ఈ హౌస్ లో ఫ్యామిలీని మైంటైన్ చేసింది నువ్వే అంటూ దివ్యకి కౌంటర్ ఇచ్చాడు. భరణి నీ వల్లే ఎలిమినేట్ అయ్యాడు అంటూ సాయి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రీతూ చౌదరి రాముని కూడా నామినేట్ చేసింది. వీరిద్దరి మధ్య కూడా గొడవ ఒక రేంజ్ లో చెలరేగింది. రాము హౌస్ లో అసలు కనిపించడం లేదు, అతడు ఫేక్ అంటూ రీతూ కామెంట్స్ చేసింది. రమ్య మోక్ష.. తనూజని నామినేట్ చేసింది. తనూజ సొంతంగా గేమ్ ఆడలేదు. తనూజ ఫేక్, ఆమె నటిస్తోంది. ఆమె చేసేది మొత్తం నటనే. ఇలా తీవ్ర వ్యాఖ్యలతో రమ్య విరుచుకుపడింది.

ఇతర కంటెస్టెంట్స్ వివాదాలు

కళ్యాణ్ సంజనని నామినేట్ చేశారు. ఈ విషయంలో ఇమ్మాన్యుయేల్ హర్ట్ అయ్యాడు. ఇమ్మాన్యుయేల్ కళ్యాణ్ కి చీటీ ఇచ్చింది తనూజని నామినేట్ చేయడానికి. కానీ కళ్యాణ్ సంజనని నామినేట్ చేయడం ఇమ్మాన్యుయేల్ కి నచ్చలేదు. గౌరవ్ కి ఉన్న ప్రత్యేకమైన పవర్ తో నామినేషన్స్ లో ఉన్న వారిలో ఒకరిని సేవ్ చేయమని బిగ్ బాస్ కోరారు. దీనితో గౌరవ్ తాను అయేషాని సేవ్ చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తంగా ఈ వారం నామినేషన్స్ లో రీతూ, సాయి, రాము, కళ్యాణ్, సంజన, దివ్య నిలిచారు.

ఈ వారం నామినేషన్స్ హౌస్‌లో తీవ్ర ఉద్రిక్తతను సృష్టించాయి. కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత ఆరోపణలు, గొడవలతో రణరంగంగా మారింది. ఈ పరిణామాలు రాబోయే గేమ్ పైన ఎలాంటి ప్రభావం చూపుతాయో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.