|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్: డిమాన్ పవన్ నన్ను భరిస్తాడు! రీతూ చౌదరి లవ్ సీక్రెట్స్ లీక్!!

Published: 18-01-2026, 6:30 AM
షాకింగ్: డిమాన్ పవన్ నన్ను భరిస్తాడు! రీతూ చౌదరి లవ్ సీక్రెట్స్ లీక్!!
  • బిగ్ బాస్ సీజన్ 9లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట వైరల్! వీరి కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా!!
  • డిమాన్ పవన్ నన్ను భరిస్తాడు, తిడతాడు కూడా: రీతూ చౌదరి హాట్ కామెంట్స్! వైరల్ ఇంటర్వ్యూ!!
  • ఫైర్ స్టార్మ్ సమయంలో డిమాన్ సపోర్ట్ వల్లే నిలబడ్డా: ఎమోషనల్ అయిన రీతూ చౌదరి!
  • డిమాన్ పవన్ లాంటి భర్త కావాలి: మనసులోని మాట బయటపెట్టిన రీతూ! BB జోడిలో బంధం!!

బిగ్ బాస్ ఫేమ్ రీతూ చౌదరి సంచలన విషయాలు బయటపెట్టింది. డిమాన్ పవన్ తో తన రిలేషన్ గురించి మాట్లాడుతూ కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.

బిగ్ బాస్ జంట మధ్య కెమిస్ట్రీ వైరల్

Rithu Chowdary : ఇటీవల బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో రీతూ చౌదరి – డిమాన్ పవన్ జంట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. హౌస్ లో వీళ్లిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా నడిచింది. వీరిద్దరూ హౌస్ లో బాగా క్లోజ్ అయ్యారు. ఈ బిగ్ బాస్ జంట BB జోడి డ్యాన్స్ షోకి కూడా వచ్చి హాట్ హాట్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ తో రెచ్చిపోతున్నారు.(Rithu Chowdary )

తాజాగా రీతూ చౌదరి ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డిమాన్ పవన్ గురించి మాట్లాడింది.

డిమాన్ పవన్ పై రీతూ చౌదరి కామెంట్స్

రీతూ చౌదరి మాట్లాడుతూ.. డిమాన్ పవన్, నేను ఫస్ట్ వీక్ నుంచి మెల్లిగా పరిచయం అయి క్లోజ్ అయ్యాం. మూడో వారం నుంచే మేమిద్దరం బాగా క్లోజ్ అయ్యాము. నేను ఏం చెప్పినా ఎంత చెప్పినా డిమాన్ నన్ను భరిస్తాడు. కావాలంటే తిరిగి తిడతాడు కూడా. హౌస్ లో సరదాగా డైలీ గొడవలు పడేవాళ్ళం. మేము బయటకు వచ్చిన దగ్గర్నుంచి అసలు గొడవ పడలేదు. మా ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉంది. ఫైర్ స్టార్మ్ జరిగినప్పుడు నేను బయటకి వెళ్ళిపోవాలి అనుకున్నాను. అప్పుడు డిమాన్ ని నాతో మాట్లాడొద్దు అన్నారు. ఆ వారం చాలా కష్టపడ్డాను. అన్ని వీక్స్ అతనితో ఉండి అతనితో మాట్లాడొద్దు అంటే నా వల్ల కాలేదు. అందరూ నా గురించి అతనికి నెగిటివ్ గా చెప్పారు. చాలా కష్టంగా ఉండేది అప్పుడు. కానీ అప్పుడు కూడా డిమాన్ నాకు సపోర్ట్ గా ఉన్నాడు. ఎవరెన్ని చెప్పినా నా గురించి తెలుసు అని నాకు సపోర్ట్ చేసాడు అని తెలిపింది.

BB జోడిలో ఈ జంట బంధం ఎలా?

అయితే ఎలాంటి భర్త కావాలి అంటే రీతూ కొన్ని లక్షణాలు చెప్పగా డిమాన్ పవన్ లాంటి వాడు అయితే పర్ఫెక్ట్ సరిపోతాడా అని అడగ్గా అవును అని చెప్పింది రీతూ. అసలే ఈ జంట ఇప్పుడు BB జోడిలో డ్యాన్స్ చేస్తుంది. మరి రానున్న రోజుల్లో వీరి బంధం ఇంకెంత ముందుకు వెళ్తుందో చూడాలి.

రీతూ చౌదరి మరియు డిమాన్ పవన్ లవ్ స్టోరీ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వీరిద్దరి మధ్య బంధం ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.