|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

నాకు ఊర్లో ఉన్నోళ్లంతా కావాలి.. సంజనాపై విరుచుకుపడ్డ రీతూ చౌదరీ

Published: 11-11-2025, 8:07 AM
నాకు ఊర్లో ఉన్నోళ్లంతా కావాలి.. సంజనాపై విరుచుకుపడ్డ రీతూ చౌదరీ

బిగ్ బాస్ తెలుగు 9 పదో వారంలో ఆటలు వేడెక్కాయి. నామినేషన్స్ లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక టాస్క్‌లో సంచాలక్‌గా ఉన్న రీతూ చౌదరీ, సంజనా మధ్య తీవ్ర వాగ్వాదం జరగడం హైలైట్‌గా నిలిచింది. ఈ ఘటన పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Key Points

1

బిగ్ బాస్ తెలుగు 9 పదో వారంలో కొత్త గేమ్‌లు ప్రారంభం.

2

ఈ వారం నామినేషన్స్ నుంచి ఇమ్మాన్యుయెల్‌కి మినహాయింపు.

4

టాస్క్ లో సంచాలక్‌గా రీతూ చౌదరీ, సంజనా మధ్య తీవ్ర వాగ్వాదం.

బిగ్ బాస్ 9 పదో వారం హైలైట్స్

బిగ్‌ బాస్‌ తెలుగు 9 పదోవారంలో అసలు గేమ్‌లు స్టార్ట్ అయ్యాయి. ఓవైపు ఫన్‌, మరోవైపు సీరియస్‌ టాస్క్ లతో కంటెస్టెంట్లతో ఆడుకుంటున్నారు బిగ్‌ బాస్‌. ఆడియెన్స్ ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. ఫన్‌ యాంగిల్‌ మాత్రం బాగానే వర్కౌట్‌ అవుతుంది. ఇమ్మాన్యుయెల్‌, సుమన్‌ శెట్టి, సంజనా, రీతూ చౌదరీ, డీమాన్‌ పవన్‌ చాలా వరకు ఫన్‌ క్రియేట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నవ్విస్తున్నారు. అయితే సీరియస్‌ గేమ్‌ల విషయంలోనే అంతగా డ్రామా పండటం లేదు. అదే పెద్ద లోటుగా చెప్పొచ్చు. ఆ విషయంలోనే కంటెస్టెంట్లు ఫెయిల్‌ అవుతున్నారు. గట్టిగా వాదించుకోవడానికి వెనకాడుతున్నారు.

ఇక పదో వారానికి సంబంధించిన నామినేషన్స్ సోమవారం జరిగింది. కంటెస్టెంట్లు నామినేషన్‌ చేసిన దాని ప్రకారం భరణి, దివ్య, రీతూ, నిఖిల్‌, రీతూ, గౌరవ్‌ నామినేట్‌ అయ్యారు. కానీ బిగ్‌ బాస్‌ ట్విస్ట్ ఇచ్చారు. ఈ సారి అందరు నామినేషన్‌లో ఉంటారని తెలిపారు. కంటెస్టెంట్ల సపోర్ట్ తో కెప్టెన్‌ అయిన ఇమ్మాన్యుయెల్‌ ఈ నామినేషన్‌ నుంచి తప్పించుకున్నారు. మిగిలిన వారంతా నామినేషన్‌లో ఉంటారు. అయితే వీరు నామినేషన్‌ నుంచి సేవ్‌ అయ్యే అవకాశం కల్పించారు బిగ్‌ బాస్‌. అందుకోసం బిగ్‌ బాస్‌ హౌజ్‌ని ఒక రాజ్యంగా మార్చేశారు. ఇందులో కళ్యాణ్‌, రీతూ, దివ్య రాజు రాణులుగా వ్యవహరిస్తారు. సుమన్‌ శెట్టి, ఇమ్మాన్యుయెల్‌, భరణి, గౌరవ్‌లు ప్రజలుగా, తనూజ, నిఖిల్‌, సంజనా, డీమాన్‌ పవన్‌ కమాండర్లుగా పని చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో రాజు, రాణులను ఇమ్మాన్యుయెల్‌ ఆటపట్టించిన తీరునవ్వులు పూయించింది. ఆ తర్వాత సుమన్‌ శెట్టిని కమాండర్స్ ట్రీట్‌మెంట్‌ కామెడీని పంచింది.

నామినేషన్స్ లో బిగ్ బాస్ ట్విస్ట్

ఇక అనంతరం కమాండర్లకి ఒక టాస్క్ ఇచ్చారు. బుట్టల్లో బాల్స్ వేయాల్సి ఉంటుంది. ఆట ముగిసే సమయానికి ఎవరి వద్ద అయితే తక్కువ బాల్స్ ఉంటాయో, వాళ్లు సేవ్‌ అయి ఆట నుంచి తప్పుకుంటారు. దీనికి రీతూ చౌదరీ సంచాలక్‌గా వ్యవహరించారు. ఇందులో నిఖిల్‌, డీమాన్‌ పవన్‌లు రెండు మూడు సార్లు లైన్‌ దాటి వెళ్లారు. అయినా ఎక్స్ క్యూజ్‌ చేసిన రీతూ.. నిఖిల్‌ విషయంలో ఎలిమినేట్‌ చేయగా సంజనా ఫైర్‌ అయ్యింది. డీమాన్‌ కూడా లైన్‌ క్రాస్‌ అయ్యాడని,ముందు ఆయన్ని ఎలిమినేట్‌ చేయాలని నిఖిల్‌, తనూజ చెప్పడంతో సంజనా ఇన్‌వాల్వ్ అయ్యింది. ఆయన్ని ఎలిమినేట్‌ చేయాలని డిమాండ్‌ చేసింది. తాను ఏం చేయాలో నువ్వు చెప్పొద్దంటూ రీతూ ఫైర్‌ అయ్యింది.

టాస్క్ లో రీతూ-సంజనా వాగ్వాదం

ఈ క్రమంలో మీకు కావాల్సిన వాళ్లని కాపాడుకుంటారని సంజనా కామెంట్‌ చేయడంతో రీతూ రెచ్చిపోయింది. నాకు ఊర్లో వాళ్లంతా కావాల్సిన వాళ్లే అంటే సెటైరికల్‌గా రియాక్ట్ అయ్యింది. ఆమెపై ఫైర్‌ అయ్యింది. గేమ్‌ ఆడకుండా పక్కన నిల్చొని వాళ్లని వీళ్లని అనడం మీకు ఫెయి‌రా అంటూ కౌంటర్‌ ఇచ్చింది రీతూ. నా స్ట్రాటజీ గురించి మాట్లాడటానికి నీకు ఏం హక్కు ఉందంటూ సంజనా రెచ్చిపోయింది. నన్ను ప్రశ్నించడానికి ఆఫ్ట్రాల్‌ నవ్వు ఎవరు అంటూ నోరు జారింది. తాను ఆఫ్ట్రాల్‌ కాదంటూ రెచ్చిపోయింది. దీంతో హౌజ్‌ మొత్తం హీటెక్కిపోయింది. తాజాగా విడుదలైన బిగ్‌ బాస్‌ తెలుగు 9.. 65 ఎపిసోడ్‌ ప్రోమో ఆకట్టుకుంటుంది.

మొత్తంగా, బిగ్ బాస్ తెలుగు 9 పదో వారం ఎంటర్టైన్మెంట్, డ్రామాతో నిండిపోయింది. రీతూ, సంజనాల మధ్య జరిగిన వాగ్వాదం షోకు మరింత ఆసక్తిని పెంచింది. వచ్చే వారాల్లో ఇంకా ఎలాంటి మలుపులు వస్తాయో చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.