|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సంచలనం: రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై మౌనం వీడారు!

Published: 19-07-2026, 2:06 AM

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై ఎట్టకేలకు స్పందించారు. ఇంగ్లాండ్‌తో మూడో వన్డే తర్వాత రిటైర్మెంట్ తీసుకుంటారన్న ప్రచారంపై ఆయన పరోక్షంగా స్పందిస్తూ, బయట జరుగుతున్న ప్రచారంతో తనకు సంబంధం లేదని తేల్చి చెప్పారు.

Key Points

1

రోహిత్ శర్మ రిటైర్మెంట్ వార్తలపై తీవ్ర చర్చ జరుగుతోంది.

2

ఇంగ్లాండ్‌తో మూడో వన్డే తర్వాత రిటైర్మెంట్ అంటూ పుకార్లు షికార్లు చేశాయి.

4

బయట జరుగుతున్న ప్రచారంతో సంబంధం లేదని రోహిత్ పరోక్షంగా స్పందించారు.

రిటైర్మెంట్ వార్తలపై రోహిత్ శర్మ స్పందన

భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఈ రోజు ఇంగ్లాండ్ తో జరిగే మూడో వన్డే తర్వాత రిటైర్మెంట్ (Retirement) తీసుకుంటున్నట్లు అనేక వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. చారిత్రాత్మక లార్డ్స్ మైదానంలో జరగబోయే కీలకమైన మూడో వన్డేకు ముందు.. టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ వన్డే రిటైర్మెంట్‌పై వస్తున్న వార్తలు తీవ్ర కలకలం రేపాయి. కార్డిఫ్‌లో జరిగిన రెండో వన్డేలో రోహిత్ నెమ్మదిగా బ్యాటింగ్ చేయడంతో, 2027 వన్డే ప్రపంచకప్‌కు ముందే సెలెక్టర్లు అతనికి గుడ్‌బై చెప్పబోతున్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పుకార్లు షికార్లు చేశాయి. ఈ నేపథ్యంలో తన వన్డే భవిష్యత్తు, రిటైర్మెంట్‌పై వస్తున్న ఊహాగానాలపై రోహిత్ శర్మ తొలిసారిగా పరోక్షంగా స్పందించాడు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో రోహిత్ శర్మ, భారత బ్యాటింగ్ కోచ్ సితాంశు కోటక్‌తో మాట్లాడుతూ తన రిటైర్మెంట్ ప్రచారాలను పూర్తిగా కొట్టిపారేశాడు. బయట జరుగుతున్న ప్రచారాలపై స్పందిస్తూ హిందీలో.. “బహర్ క్యా చల్ రహా హై ఉస్సే హమారా క్యా లేనా దేనా” (బయట ఏం జరుగుతుందో దాంతో నాకేం సంబంధం) అంటూ వ్యాఖ్యానించాడు. ఈ ఒక్క మాటతో జట్టు వెలుపల జరిగే అనవసర ప్రచారాలను తాము అస్సలు పట్టించుకోమని రోహిత్ తేల్చి చెప్పగా.. హిట్‌మ్యాన్ కచ్చితంగా 2027 వన్డే ప్రపంచకప్ ఆడుతాడని అభిమానులు సోషల్ మీడియాలో ధీమా వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో పుకార్లు, అభిమానుల ఆందోళన

2027 ప్రపంచకప్ పై రోహిత్ పరోక్ష సంకేతం

మొత్తం మీద, రోహిత్ శర్మ తన రిటైర్మెంట్ వార్తలను తేలికగా కొట్టిపారేయడం అభిమానులకు పెద్ద ఊరటనిచ్చింది. 2027 ప్రపంచకప్‌లో కూడా రోహిత్ ఆడతాడని అభిమానులు ధీమాగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.