|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్‌?.. నన్‌గా మారిన నటి?!

Published: 28-06-2025, 10:18 AM
రితికా కంటే ముందు ఆమెతో ప్రేమలో రోహిత్‌?.. నన్‌గా మారిన నటి?!

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ తన ప్రేమ జీవితం గురించి ఆసక్తికరమైన విషయాలను వెల్లడించాడు. రితికా సజ్దేహ్ తో వివాహం చేసుకున్న రోహిత్, గతంలో సోఫియా హయత్ తో డేటింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి.

Key Points

1

రోహిత్ శర్మ తన ప్రేమకథను వెల్లడించాడు.

2

సోఫియా హయత్ తో రోహిత్ డేటింగ్ గురించి వార్తలు వచ్చాయి.

4

రోహిత్ శర్మ ప్రస్తుతం రితికా సజ్దేహ్ తో సంతోషంగా ఉన్నాడు.

రోహిత్ శర్మ ప్రేమకథ

టీమిండియా వన్డే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (Rohit Sharma) తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. క్రికెట్‌ ఓనమాలు దిద్దిన స్టేడియం పిచ్‌పైనే మోకాళ్లపై కూర్చుని ప్రేయసి రితికా (Ritika Sajdeh)కు ప్రేమను వ్యక్తపరిచినట్లు వెల్లడించాడు. ఆమె కూడా సంతోషంగా ఒప్పుకోవడంతో ఇద్దరం పెళ్లి బంధంతో ఒక్కటయ్యామని రోహిత్‌ శర్మ తన రొమాంటిక్‌ ప్రపోజల్‌ గురించి చెబుతూ నవ్వులు చిందించాడు.

ఇద్దరు పిల్లలు.. ముచ్చటైన కుటుంబం మాజీ క్రికెటర్‌ హర్భజన్‌ సింగ్‌ అతడి భార్య గీతా బస్రా కలిసి నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూకు భార్య రితికాతో కలిసి హాజరైన రోహిత్‌ ఈ విషయాన్ని వెల్లడించాడు. కాగా రోహిత్‌- రితికా చాలా ఏళ్ల పాటు డేటింగ్‌ చేసి.. 2015, డిసెంబరు 13న పెళ్లిపీటలు ఎక్కారు. వీరికి కూతురు సమైరా, కుమారుడు అహాన్‌ సంతానం.

తెరపైకి సోఫియా హయత్‌ పేరు ఇక రోహిత్‌ శర్మ తన ప్రేమకథ గురించి వివరించిన నేపథ్యంలో గతంలో అతడు డేటింగ్‌ చేసిన అమ్మాయిల గురించి కూడా సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. ఈ క్రమంలో ప్రధానంగా తెరపైకి వచ్చిన పేరు సోఫియా హయత్‌ (Sofia Hayat).

లండన్‌లో కామన్‌ ఫ్రెండ్‌ ద్వారా సోఫియా- రోహిత్‌లకు పరిచయమైంది. తొలిచూపులోనే రోహిత్‌ను ఇష్టపడ్డ సోఫియా అతడితో డేటింగ్‌ చేసిందనే ప్రచారం ఉంది. అయితే, ప్రేమలో ఉన్నపుడు ఇద్దరూ కూడా ఈ విషయం గురించి బయటపెట్టలేదు. కానీ.. మీడియాలో వీరి గురించి వార్తలు రాగా.. 2012లో సోఫియా స్వయంగా స్పందించింది.

సోఫియా హయత్ తో సంబంధం

నేను రోహిత్‌ శర్మతో డేటింగ్‌ చేశా ‘‘ఇకనైనా వదంతులకు స్వస్తి పలుకుదాం. అవును.. నేను రోహిత్‌ శర్మతో డేటింగ్‌ చేశా. కానీ ఇప్పుడు అదంతా ముగిసిపోయింది.. ఇకపై జీవితంలో అతడితో మరోసారి డేటింగ్‌ చేయను. ఈసారి నేను మనసున్న మంచి వ్యక్తి కోసం మాత్రమే ఎదురుచూస్తున్నా’’ అని సోఫియా ట్వీట్‌ చేసింది.

అందుకే బ్రేకప్‌ చెప్పాను అంతేకాదు.. రోహిత్‌ శర్మతో తన బంధం ముగిసిపోవడానికి గల కారణాన్ని వివరిస్తూ.. ‘‘అతడు మంచివాడు. కలిసి ఉన్నపుడు ఎన్నో విషయాలు మాట్లాడుకునేవాళ్లం. అయితే, అతడు బిడియస్తుడు. హోటల్స్‌, రూమ్స్‌ దగ్గర మేము మీడియా కంటపడకూడదని భావించేవాళ్లం.

కానీ మీడియాకు టిప్‌ అందింది. అపుడు మా మేనేజరే ఈ విషయం గురించి స్పందించారు. రోహిత్‌తో ఉన్న నాకున్న రిలేషన్‌పై గౌరవంతో నేనూ ఏమీ మాట్లాడలేదు. కానీ ఓసారి రోహిత్‌ మీడియాతో మాట్లాడుతున్నపుడు నా గురించి ప్రశ్న ఎదురుకాగా.. నేను కేవలం తన అభిమానిని మాత్రమే అని చెప్పాడు.

దాంతో నేను చాలా బాధపడ్డాను. అందుకే అతడితో బ్రేకప్‌ చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అతడితో ఉన్న అన్ని రకాల కాంటాక్టులను చెరిపివేశా’’ అని సోఫియా గతంలో ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది.

రితికా సజ్దేహ్ తో వివాహం

పెదవి విప్పని రోహిత్‌ అయితే, రోహిత్‌ మాత్రం ఆమెతో ప్రేమ, బ్రేకప్‌ గురించి ఒక్కమాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే.. వివాదాలకు కేరాఫ్‌ అయిన సోఫియా.. విరాట్‌ కోహ్లి కోసం తాను రోహిత్‌ను వదిలేశానంటూ మరో ట్వీట్‌ చేసింది. దీన్ని బట్టి చూస్తే ఆమె ప్రచారం కోసమే ఇదంతా చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

నటి నుంచి నన్‌గా? సోఫియా హయత్‌ బ్రిటిష్‌ మోడల్‌, సింగర్‌. ఆ తర్వాత టెలివిజన్‌ రంగంలోకి ప్రవేశించింది. హిందీ బిగ్‌బాస్‌ 7లో సోఫియా పాల్గొంది. 2013లో బిగ్‌ బ్రదర్‌ ఇండియన్‌ వర్షన్‌లోనూ తళుక్కుమంది. అయితే, 2016లో అందరికీ షాకిస్తూ… ఆధ్యాత్మిక బాటలో నడుస్తూ.. నన్‌గా మారినట్లు ప్రకటించింది. తన పేరును గైయా సోఫియా మదర్‌గా మార్చుకుంది. యోగా టీచర్‌, హీలర్‌గా తన ఇన్‌స్టాగ్రామ్‌ బయోలో పేర్కొంది.

రోహిత్ శర్మ తన జీవితంలోని ప్రేమ విషయాలను వెల్లడించడం ద్వారా అభిమానులకు ఆసక్తికరమైన విషయాలు అందించాడు. ప్రస్తుతం ఆయన సంతోషంగా ఉన్న విషయం సంతోషాన్ని కలిగిస్తుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.