|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రోజా ఎత్తుకుని ఆడించిన స్టార్ హీరో గుట్టు రట్టు! చిన్నప్పటి రహస్యం లీక్.. ఎవరో తెలుసా?

Published: 27-12-2025, 7:33 AM
రోజా ఎత్తుకుని ఆడించిన స్టార్ హీరో గుట్టు రట్టు! చిన్నప్పటి రహస్యం లీక్.. ఎవరో తెలుసా?
  • 90లలో స్టార్ హీరోయిన్‌గా రోజా తెలుగు, తమిళ చిత్రసీమలో వెలుగొందారు.
  • రాజకీయాల్లోకి వెళ్లి మంత్రిగా మారి, తిరిగి బుల్లితెరకు రీఎంట్రీ ఇచ్చారు.
  • చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
  • పాన్ ఇండియా స్టార్ రామ్ చరణ్‌ను చిన్నప్పుడు ఎత్తుకుని ఆడిచ్చినట్లు తెలిపారు.

90లలో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన రోజా, ఇటీవలి ఇంటర్వ్యూలో సినీ కెరీర్ విశేషాలు పంచుకున్నారు. అనేక మంది స్టార్ హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, చిన్నప్పుడు ఎత్తుకుని ఆడించిన ప్రస్తుత పాన్ ఇండియా స్టార్ హీరో ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

రోజా సినీ ప్రస్థానం – రాజకీయ ప్రవేశం

90 దశకంలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది రోజా. ఇటు తెలుగు సినిమా.. అటు తమిళ సినిమాలో ఒకేసారి స్టార్ డమ్ తో దూసుకుపోయింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ బాలయ్య, నాగార్జున, సుమన్, జగపతిబాబు, శ్రీకాంత్, మోహన్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది రోజా. తమిళంలో రజినీకాంత్, విజయ్ కాంత్, అజిత్, శరత్ కుమార్.. లాంటి హీరోల సరసన నటించి మెప్పించింది. తెలుగు సినిమా రంగంలో తనదైన ముద్ర వేసిన నటి రోజా, ఆ తర్వాత రాజకీయాల్లోకి ప్రవేశించి సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తున్నారు.

సినిమాలు, రాజకీయాలకే కాకుండా బుల్లితెరపై కూడా సందడి చేసి ప్రేక్షకులను అలరించింది రోజా. మంత్రి పదవి వచ్చిన తరువాత స్మాస్ స్క్రీన్ ను వదిలిన ఆమె.. రీసెంట్ గా మళ్లీ రీఎంట్రీ ఇచ్చింది. జీలో ఓ షోకి జడ్జిగా ఆమె కనిపించింది. అంత కాదు సినిమాల్లో కూడా రోజా రీ ఎంట్రీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం రోజా తమిళంలో ఓ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రోజా, తన ఫిల్మ్ కెరీర్ కు సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను వెల్లడించారు. భైరవ ద్వీపం సినిమాలో రాజకుమారి పాత్ర గురించి… అన్నమయ్యలో మోహన్ బాబు పక్కన క్వీన్ పాత్రకు సంబంధించి ఎన్నో విషయాలు ఆమె వెల్లడించారు. టాలీవుడ్ లో స్టార్ హీరోల గురించి కూడా తన అభిప్రాయాలను వెల్లడించింది రోజా.

స్టార్ హీరోలతో రోజా అనుభవాలు

వెంకటేష్ సెట్లో రిజర్వ్‌డ్‌గా ఉంటారని, తన పని తాను చూసుకుంటారని తెలిపిన రోజా.. బాలకృష్ణ మాత్రం షూటింగ్ లో చాలా ఉల్లాసంగా ఉంటారని, అందరితో కలిసి కబుర్లు చెప్పడం, పాటలు, పద్యాలు పాడుతూ సరదాగా గడుపుతారని అన్నారు. ఇక నాగార్జున గురించి చెప్పాలంటే.. చాలా మంది హీరోయిన్లకు ఆయనంటే ఇష్టమని, ఆయన చాలా కూల్‌గా, డిగ్నిఫైడ్‌గా ఉంటారని అన్నారు. చిరంజీవితో తన తొలి సినిమా ముఠామేస్త్రి గురించి మాట్లాడుతూ, మొదటి షాట్ డ్యాన్స్‌తోనే ప్రారంభమైందని గుర్తు చేసుకున్నారు. చిరంజీవి సహనంతో.. తనకు ఎంతో సహకరించారని రోజా అన్నారు. కృష్ణ ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉంటారని, రిహార్సల్స్ కూడా లేకుండా ఒకే టేక్‌లో డాన్స్ కానీ.. డైలాగ్ కానీ పూర్తి చేసే ట్యాలెంట్ ఆయనకు ఉందన్నారు రోజా.

ఇక ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఉన్న రామ్ చరణ్ గురించి కూడా రోజా మాట్లాడింది. చిన్నప్పుడు తాము ఆయన్ను ఎత్తుకొని పెంచామని, ముఠామేస్త్రి షూటింగ్ సమయంలో ఊటికి వచ్చాడని గుర్తు చేసుకున్నారు రోజా.. . అప్పట్లో చరణ్ చాలా అల్లరి చేసేవాడని, ఊటి స్కూల్‌లో చేరిన తర్వాత సైలెంట్ అయ్యాడని రోజా అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా చూసినప్పుడు గర్వంగా అనిపించిందని, మెగా అభిమానిగా, కుటుంబ సభ్యురాలిగా ఆ సినిమాలోని మొదటి షాట్ తనకు ఎంతో నచ్చిందని రోజా తెలిపారు. చిన్నప్పుడే చిరంజీవి డాన్స్ వేస్తుంటే, రామ్ చరణ్ కూడా అదే పాటలకు డాన్స్ చేసేవాడని, చెన్నైలో ఉన్న రోజుల్లో చిరంజీవి ఇంటికి అప్పుడప్పుడు వెళ్తేవారం అని ఆమె అన్నారు.

చిన్ననాటి రామ్ చరణ్‌తో రోజా జ్ఞాపకాలు

ఇక ఇప్పుడు ఉన్న హీరోలలో రోజాకు ఇష్టమైన హీరో ఎవరంటే..? ప్రస్తుత తరం హీరోలలో.. జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి వారినటన నచ్చుతుందని. వారితో భవిష్యత్తులో అమ్మ, అత్త, వదిన పాత్రలు చేయాల్సివస్తే చేస్తానని రోజా నవ్వుతూ అన్నారు. అంతే కాదు రాజకీయాల్లో చాలా మంది నటుల కంటే ఎక్కువ యాక్టింగ్ ఉంటుందని నవ్వుతూ అన్నారు.

రోజా ఇంటర్వ్యూ సినీ అభిమానులను ఆకట్టుకుంది. స్టార్ హీరోలతో ఆమె అనుభవాలు, ముఖ్యంగా చిన్నప్పుడు రామ్ చరణ్‌ను ఎత్తుకున్న వైనం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది ఒక తరం సినిమా జ్ఞాపకాన్ని గుర్తుచేసింది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.