|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో రచ్చ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

Published: 09-11-2025, 2:15 AM
ఓటీటీలోకి రొమాంటిక్ మూవీ.. ఇద్దరు హీరోయిన్లతో రచ్చ.. స్ట్రీమింగ్ ఎందులోనంటే?

సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటించిన రొమాంటిక్ మూవీ ‘తెలుసు కదా’ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకుంది. నవంబర్ 14 నుంచి ‘తెలుసు కదా’ నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీలో వరుణ్ అనే అనాధ యువకుడి ప్రేమకథ ప్రధానం.

Key Points

1

రొమాంటిక్ డ్రామా మూవీ 'తెలుసు కదా' నవంబర్ 14న ఓటీటీలోకి రానుంది.

2

సిద్ధు జొన్నలగడ్డ, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.

4

ఒక అనాథ యువకుడి ప్రేమకథ, అతడి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిల ప్రవేశం ఈ కథాంశం.

తెలుసు కదా మూవీ: నటీనటులు

టాలీవుడ్ హీరోయిన్ రాశిఖన్నా గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తక్కువ సమయంలోనే మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం తెలుగు, హిందీ చిత్రాలతో ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది హీరోయిన్ రాశి ఖన్నా. ఇటీవల తెలుసు కదా మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఉస్తాద్ భగత్ సింగ్ తో రాబోతుంది. ఇదిలా ఉండగా.. దీపావళి సందర్భంగా గత నెల(అక్టోబర్ 17) లో థియేటర్లలో సందడి చేసిన రొమాంటిక్ డ్రామా మూవీ తెలుసు కదా. ఈ మూవీలో హీరోగా సిద్ధు జొన్నలగడ్డ, కథానాయికలుగా రాశీఖన్నా, శ్రీనిధి శెట్టి నటించారు.

ఓటీటీలోకి ఎప్పుడు, ఎక్కడ?

డైరెక్టర్ నీరజా కోన తెరకెక్కించిన ఈ రొమాంటిక్ చిత్రం ఇప్పుడు ఓటీటీ లోకి రానుంది. ఇక, తెలుసు కదా మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇందుకోసం చిత్ర నిర్మాతలకు భారీ మొత్తం చెల్లించినట్లు సమాచారం. థియేట్రికల్ వెర్షన్ ముగియడంతో తెలుసు కదా స్ట్రీమింగ్ డేట్ పై అధికారిక ప్రకటన వెలువడింది. ఈ నెల(నవంబర్‌) 14 నుంచి నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది.

తెలుసు కదా కథేంటి?

ఇదిలా ఉంటే.. తెలుసు కదా మూవీ స్టోరీ ఏంటంటే.. ఈ మూవీలో వరుణ్(హీరో) ఒక అనాధ. ఈ క్రమంలో ఒక రెస్టారెంట్ నడుపుతాడు. అనాధగా ఉన్న వరుణ్ తనకంటూ ఒక కుటుంబం కావాలని ఆశపడతాడు. ఈ సమయంలో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంటుంది. వరుణ్ కి అంతకు ముందే రాగా(హీరోయిన్ శ్రీనిధి శెట్టి) అనే అమ్మాయితో బ్రేకప్ అవుతుంది. ఈ సమయంలో అతని జీవితంలోకి అంజలి(హీరోయిన్ రాశి ఖన్నా) వస్తుంది. వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. దీంతో వరుణ్ అంజలిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే అతని లైఫ్ లోకి ముందు ప్రేమలో పడిన రాగ వస్తుంది. ఇక.. అప్పుడు వరుణ్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే ఈ మూవీ చూడాల్సిందే.

ఒక అనాధ యువకుడి ప్రేమకథతో రూపొందిన ‘తెలుసు కదా’ ఓటీటీ ద్వారా ప్రేక్షకులకు చేరువకానుంది. సిద్ధు, రాశీఖన్నా, శ్రీనిధి శెట్టిల నటనతో ఆకట్టుకున్న ఈ చిత్రం నవంబర్ 14న నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. తప్పకుండా చూసి ఆనందించండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.