
జియోహాట్‌స్టార్‌లో విడుదలైన ‘రోంత్’ సినిమాకు మంచి స్పందన లభించింది. ఈ నేపథ్యంలో, ఓటీటీలో అందుబాటులో ఉన్న మరికొన్ని ఉత్తమ మలయాళ పోలీస్ థ్రిల్లర్ సినిమాల గురించి తెలుసుకుందాం.
Key Points
రోంత్ లాంటి మరింత మలయాళ పోలీస్ థ్రిల్లర్లు చూడాలనుకుంటున్నారా?
రేఖాచిత్రమ్, నాయట్టు, ఇరట్టా వంటి సూపర్ హిట్ మూవీస్ ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి.
కన్నూర్ స్క్వాడ్, ఆఫీసర్ ఆన్ డ్యూటీ, గోలమ్ వంటి మంచి రేటింగ్ ఉన్న సినిమాలు కూడా చూడండి.
ఏ ఓటీటీలో ఏ సినిమా ఉందో తెలుసుకోండి మరియు మీకు నచ్చిన థ్రిల్లర్‌ని ఎంచుకోండి.
రోంత్ తర్వాత చూడాల్సిన మలయాళ పోలీస్ థ్రిల్లర్లు
మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సూపర్ థ్రిల్లర్ రోంత్ (Ronth). ఈ సినిమా ఈ మధ్యే జియోహాట్‌స్టార్ లోకి వచ్చింది. తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతుండటంతో మూవీకి మంచి రెస్పాన్స్ వస్తోంది. రాత్రి గస్తీకి వెళ్లే ఇద్దరు పోలీసుల చుట్టూ తిరిగే కథతో ఈ మూవీ ప్రేక్షకులను మంచి థ్రిల్ పంచుతోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి వచ్చిన ఇతర పోలీస్ థ్రిల్లర్స్ ఏవో ఒకసారి చూద్దాం.
రేఖాచిత్రమ్ – సోనీ లివ్ ఓటీటీ
ఈ ఏడాది మలయాళం నుంచి సూపర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఇది. ఆసిఫ్ అలీ ఓ పోలీస్ ఆఫీసర్ గా 40 ఏళ్ల కిందట జరిగిన ఓ హత్య కేసును ఛేదించే స్టోరీ ఇది. ఈ ఏడాది వచ్చిన బిగ్గెస్ట్ హిట్స్ లో ఇదీ ఒకటి. ఈ రేఖాచిత్రమ్ మూవీ ప్రస్తుతం సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఐఎండీబీలో 8.1 రేటింగ్ ఉంది.
నాయట్టు మూవీలో కుంచకో బొబన్, జోజు జార్జ్, నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటించారు. ఓ దళితుడి హత్య కేసులో అనుకోకుండా చిక్కుకొని పారిపోయే ముగ్గురు పోలీస్ అధికారుల చుట్టూ తిరిగే కథ ఇది. ఐఎండీబీలో 8 రేటింగ్ ఉన్న ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో ఉంది.
ఉత్తమ మలయాళ పోలీస్ థ్రిల్లర్ సినిమాలు మరియు వాటి ఓటీటీ లభ్యత
జోజు జార్జ్ డ్యుయల్ రోల్లో నటించిన మూవీ ఇరట్టా . హెడ్ కానిస్టేబుల్, డీవైఎస్పీ పాత్రల్లో అతడు నటించాడు. హెడ్ కానిస్టేబుల్ పాత్రధారి సినిమా మొదట్లోనే పోలీస్ స్టేషన్ లో చనిపోయి కనిపిస్తాడు. అతడు ఎలా చనిపోయాడన్నదే ఈ మూవీ స్టోరీ. మంచి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 7.7 రేటింగ్ ఉన్న మూవీ ఇది.
కన్నూర్ స్క్వాడ్ – జియోహాట్‌స్టార్
మమ్ముట్టి పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించిన సినిమా కన్నూర్ స్క్వాడ్. ఓ కేసులో దేశం మొత్తం తిరుగుతూ నేరస్థుడిని పట్టుకోవడానికి ప్రయత్నించే ఓ పోలీస్ స్క్వాడ్ చుట్టూ తిరిగే కథ ఇది. ఐఎండీబీలో 7.6 రేటింగ్ ఉంది. జియోహాట్‌స్టార్ లో చూడొచ్చు.
ఐఎండీబీ రేటింగ్స్‌తో పాటు సినిమా వివరాలు
ఆఫీసర్ ఆన్ డ్యూటీ – నెట్‌ఫ్లిక్స్
కుంచకో బొబన్ నటించిన మరో కాప్ థ్రిల్లర్ ఈ ఆఫీసర్ ఆన్ డ్యూటీ. అమ్మాయిల ప్రైవేట్ వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేసే ఓ గ్యాంగ్ పని పట్టే పోలీస్ అధికారి కథే ఈ సినిమా. ఐఎండీబీలో 7.5 రేటింగ్ ఉన్న ఆఫీసర్ ఆన్ డ్యూటీ సినిమాను నెట్‌ఫ్లిక్స్ లో చూడొచ్చు.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న మరో మూవీ గోలమ్. ఈ సినిమా ఓ ఆఫీసులో బాస్ చనిపోవడం, తర్వాత జరిగే పోలీస్ ఇన్వెస్టిగేషన్ చుట్టూ తిరుగుతుంది. మొదటి నుంచి చివరి వరకు మంచి సస్పెన్స్ తో సాగే థ్రిల్లర్ మూవీ ఇది. ఐఎండీబీలో 7.2 రేటింగ్ ఉంది.
మలయాళ సినిమా పరిశ్రమ నుండి వచ్చిన అద్భుతమైన పోలీస్ థ్రిల్లర్లను ఓటీటీలో ఆస్వాదించండి. మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఆనందించండి!


