
📌 Key Points
- ‘మోగ్లీ’లో రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ జంటగా నటించారు.
- శ్రీవిష్ణు ‘మోగ్లీ’ని అటవీ నేపథ్య ప్రేమకథగా అభివర్ణించారు.
- హీరో రోషన్, బండి సరోజ్ కుమార్ నటనకు శ్రీవిష్ణు ప్రశంసలు కురిపించారు.
- కాల భైరవ సంగీతం, సందీప్ రాజ్ దర్శకత్వంపై శ్రీవిష్ణు కితాబు ఇచ్చారు.
రోషన్ కనకాల, సాక్షి మడోల్కర్ నటించిన ‘మోగ్లీ’ సినిమా డిసెంబర్ 13న విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికీ, టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు మాత్రం ప్రశంసలు కురిపించారు. అటవీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రేమకథకు శ్రీవిష్ణు ఎలా స్పందించారో చూద్దాం.
మోగ్లీ సినిమా విశేషాలు
రోషన్ కనకాల(Roshan Kanakala), సాక్షి మడోల్కర్ (Sakshi Madolkar)జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘మోగ్లీ’(Mowgli). బండి సరోజ్ కుమార్, హర్ష చెముడు కీలక పాత్రలో కనిపించారు. నేషనల్ అవార్డు విన్నర్ సందీర్ రాజ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాను పీపుల్ మీడియా బ్యానర్‌పై నిర్మించారు. డిసెంబర్ 13న విడుదలైన ఈ లవ్ స్టోరీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలో మాత్రం మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. మోడర్న్ సితారాముల కథగా వచ్చిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంటుంది. తాజాగా, ఈ సినిమా చూసిన టాలీవుడ్ హీరో శ్రీవిష్ణు ప్రశంసలు కురిపించారు. ‘‘మోగ్లీ’ మూవీ చాలా బాగుంది.
ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్‌లో కొత్త లవ్ స్టోరీ. యాక్టర్స్ అందరూ చాలా బాగా చేశారు హీరో రోషన్ చాలా బాగా చేశారు. బండి సరోజ్ కుమార్ గారు పోలీస్ రోల్‌లో అదరగొట్టేశారు. క్లైమాక్స్ చాలా బాగుంది. మంచి డివోషనల్ టచ్ ఇచ్చారు. తప్పకుండా యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చి ఈ సినిమాని పెద్ద సక్సెస్ చేస్తారు. మ్యూజిక్ డైరెక్టర్ కాల భైరవ అద్బుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చారు. డైరెక్టర్ సందీప్ రాజ్ మంచి సినిమా తీశారని పేర్కొన్నాడు. అలాగే ఈ చిత్రాన్ని అందరూ చూడాలని విజ్ఞప్తి చేశాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.
శ్రీవిష్ణు ప్రశంసలు: మోగ్లీపై
సోషల్ మీడియాలో మోగ్లీ టాక్
శ్రీవిష్ణు ప్రశంసలు ‘మోగ్లీ’ సినిమాకు మరింత పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేయవచ్చు. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ తప్పకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేయడంతో, ఈ చిత్రం భవిష్యత్తులో మరింత విజయం సాధిస్తుందని ఆశిద్దాం.


