|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దుల్కర్ ‘ఐయామ్ గేమ్’ హీరోయిన్‌గా ఆ బ్యూటీనే! మేకర్స్ సంచలన ప్రకటన!

Published: 18-12-2025, 4:24 AM
దుల్కర్ ‘ఐయామ్ గేమ్’ హీరోయిన్‌గా ఆ బ్యూటీనే! మేకర్స్ సంచలన ప్రకటన!
  • దుల్కర్ సల్మాన్ ‘ఐయామ్ గేమ్’ మూవీపై పూర్తి దృష్టి సారించారు.
  • మలయాళ బ్యూటీ కయాదు లోహర్ దుల్కర్‌కు జోడీగా నటిస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
  • ‘ఐయామ్ గేమ్’ చిత్రం యాక్షన్, క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతోంది.
  • కయాదు లోహర్ ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సరసన నటిస్తోంది.

దుల్కర్ సల్మాన్ తన తాజా చిత్రం ‘ఐయామ్ గేమ్’పై పూర్తి ఫోకస్ పెట్టారు. ఈ యాక్షన్ అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌లో ఆయనకు జోడీగా మలయాళ బ్యూటీ కయాదు లోహర్ నటిస్తున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కయాదు ప్రస్తుతం పలు పాన్ ఇండియా చిత్రాలతో బిజీగా ఉంది.

దుల్కర్ సల్మాన్ తదుపరి ప్రాజెక్ట్: ‘ఐయామ్ గేమ్’

మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్(Dulquer Salmaan) ‘సీతారామం’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మంత్ర ముగ్దులను చేశాడు. ఓ వైపు నిర్మాతగా, హీరోగా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటున్నారు. ఇటీవల ఆయన నిర్మాణంలో వచ్చిన ‘లోకా:చాప్టర్1’ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. ఊహించని విధంగా విజయం సాధించింది. ఆ తర్వాత చేసిన ‘కాంత’ మాత్రం పెద్దగా మెప్పించలేకపోయింది. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ ఫోకస్ మొత్తం ‘ఐయామ్ గేమ్’(I’m game) మూవీపై పెట్టారు. నహాస్ హిదాయత్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. యాక్షన్ అండ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్‌గా రాబోతుండగా.. ఇందులో కబీర్ దుహాన్,మిస్కిన్, సంయుక్త విశ్వనాథన్, ఆంటోనీ వర్గీస్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ పాన్ ఇండియా చిత్రం నుంచి ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్‌లో దుల్కర్ స్టైలిష్‌గా కనిపించి అందరిలో హైప్ పెంచేశారు.

అయితే గత కొద్ది కాలంగా ఈ మూవీలో దుల్కర్ సరసన మలయాళ బ్యూటీ కయాదు లోహర్(Kayadu Lohar) నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈక్రమంలో.. తాజాగా, ఈ విషయాన్ని నిజం చేస్తూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు. ‘ఐయామ్ గేమ్’ మూవీలో కయాదు లోహర్ భాగం అయినట్లు వెల్లడించారు. గార్జియస్ బ్యూటీ జాయిన్ కావడం థ్రిల్లింగ్‌గా ఉందంటూ.. ఫైరింగ్ పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా.. ఇటీవల ‘డ్రాగన్’ సూపర్ హిట్ అందుకున్న కయాదులోహర్ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. ప్రజెంట్ తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో స్టార్ హీరోల సరసన చాన్స్ దక్కించుకుంటూ ఫుల్ ఫామ్‌లో ఉంది. తెలుగులో విశ్వక్‌సేన్‌కు జోడీగా ‘ఫంకీ’లో నటిస్తోంది. అలాగే నేచురల్ స్టార్ నాని ‘ది ప్యారడైజ్’లోనూ నటించనున్నట్లు సమాచారం.

‘ఐయామ్ గేమ్’లో హీరోయిన్‌పై అధికారిక ప్రకటన

కయాదు లోహర్ సినీ ప్రస్థానం, బిజీ ప్రాజెక్ట్‌లు

‘ఐయామ్ గేమ్’ చిత్రంలో కయాదు లోహర్ చేరిక సినిమాకు మరింత గ్లామర్ తీసుకురానుంది. ఆమె ప్రస్తతం పలు స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుంటూ కెరీర్ పరంగా దూసుకుపోతోంది. ఈ చిత్రం ఆమెకు మరో మంచి హిట్ అవుతుందని ఆశిద్దాం.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.