|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రోషన్ మేక సంచలనం: కన్నప్ప బ్యూటీతో మాస్ మూవీకి సైన్! డైరెక్టర్ ఎవరంటే..?

Published: 04-02-2026, 8:35 AM
రోషన్ మేక సంచలనం: కన్నప్ప బ్యూటీతో మాస్ మూవీకి సైన్! డైరెక్టర్ ఎవరంటే..?
  • రోషన్ మేక, శైలేష్ కొలను కాంబోలో యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఫిక్స్!
  • సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ భారీ నిర్మాణం!
  • కన్నప్ప బ్యూటీ ప్రీతీ ముకుందన్ గ్లామర్ రోల్‏లో మెరవనుంది.
  • 2026 ఎండింగ్ లో గ్రాండ్ రిలీజ్ ప్లాన్ చేస్తున్న మేకర్స్!

టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక తన నెక్స్ట్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి రెడీ అయ్యాడు. హిట్ డైరెక్టర్ శైలేష్ కొలనుతో కలిసి ఒక పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్లో నటించనున్నాడు.

శైలేష్ కొలనుతో రోషన్ నెక్స్ట్ మూవీ!

Roshan Meka: ఛాంపియన్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో రోషన్ మేక. పీరియాడికల్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమాలో మైకేల్ పాత్రలో అదరగొట్టేశాడు. పెళ్లి సందD సినిమా తరువాత దాదాపు నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని మరీ ఛాంపియన్ సినిమా చేశాడు రోషన్. ప్రదీప్ అద్వైతం తెరకెక్కించిన ఈ సినిమాతో కమర్షియల్ సినిమాలు కూడా చేయగలను అని ప్రూవ్ చేసుకున్నారు రోషన్.

అయితే, రెండో సినిమాకి చాలా గ్యాప్ తీసుకున్న రోషన్ మూడవ సినిమాకి మాత్రం అంత లేట్ చేయడం లేదు. తన తరువాతి సినిమాను త్వరగానే మొదలుపెట్టనున్నాడు. అందుకోసం హిట్ సిరీస్ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలనుతో జత కడుతున్నాడు. ఈ దర్శకుడు చెప్పిన యాక్షన్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్టు రోషన్ కి బాగా నచ్చిందట. అందుకే, వెంటనే ఒకే చెప్పేశాడట.

కన్నప్ప బ్యూటీతో జోడీ కట్టనున్న రోషన్!

ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ నిర్మిస్తున్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే, ఈ సినిమాలో రోషన్ పక్కన హీరోయిన్ గా కన్నప్ప బ్యూటీ ప్రీతీ ముకుందన్(Roshan Meka) ను తీసుకుంటున్నారట మేకర్స్. కన్నప్ప సినిమాలో డివోషనల్ టచ్ తో పాటు గ్లామర్ టచ్ ఇచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాలో మాత్రం పూర్తి గ్లామర్ పాత్ర చేయనుందట.

సితార బ్యానర్ పై భారీ యాక్షన్ థ్రిల్లర్!

దీనికి సంబందించిన సంప్రదింపులు కూడా ఇప్పటికే పూర్తయ్యాయని సమాచారం. ఇక ఈ సినిమా త్వరగా ఫినిష్ చేసి 2026 ఇయర్ ఎండింగ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట మేకర్స్. మరి, ఈ ఫస్ట్ టైం అవుట్ అండ్ అవుట్ కమర్షియాల్ సినిమా చేస్తున్న రోషన్ ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.

రోషన్ మేక, శైలేష్ కొలను కాంబోలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.