|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రుక్మిణి వసంత్: కాంతార, డ్రాగన్, ధర్మన్… భారీ ప్రాజెక్టులున్నప్పటికీ అసలు సమస్య ఏంటి?

Published: 16-07-2026, 1:15 AM

‘సప్త సాగరాలు దాటి’ సినిమాతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన రుక్మిణి వసంత్, ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఆమె చేతిలో కాంతార, ధర్మన్, డ్రాగన్ వంటి భారీ ప్రాజెక్టులున్నప్పటికీ, కీలక పాత్రలకే పరిమితమవుతుందా అనే చర్చ జరుగుతోంది.

Key Points

1

రుక్మిణి వసంత్ 'సప్త సాగరదాచే ఎల్లో' సినిమాతో ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించింది.

2

రజినీకాంత్, యష్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంది.

4

మెయిన్ హీరోయిన్‌గా కాకుండా కీలక పాత్రలకే పరిమితం అవుతుందా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

రుక్మిణి వసంత్: సౌత్ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్

Rukmini Vasanth :రుక్మిణి వసంత్ …ఈ పేరు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీస్ షేక్ చేస్తుంది.అవును మామూలుగా ఇండస్ట్రీకి వచ్చే హీరోయిన్స్ గ్లామర్ నమ్ముకుంటే ఈ అమ్మడు మాత్రం తనదైన యాక్టింగ్ తో దూసుకుపోతుంది.పైగా లండన్ లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ లో యాక్టింగ్ కోర్స్ పూర్తి చేసింది కూడా.ఆ తర్వాత 2019లో వచ్చిన ‘బీర్బల్ ట్రయాలజీ కేస్ వన్’ సినిమాతో కన్నడ నాట అడుగు పెట్టిన ఈ అమ్మడు మొదటి సినిమాతోనే సత్తా చాటింది .

అయితే ఈ అమ్మడి కెరీర్ ని మలుపు తిప్పింది మాత్రం 2023లో వచ్చిన ‘సప్త సాగరదాచే ఎల్లో’.హేమంతరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగులో సప్త సాగరాలు దాటి అనే టైటిల్ తో  రిలీజ్ అయింది.ఇక ఈ సినిమాలో ప్రియా అనే పాత్రలో రుక్మిణి పండించిన ఎమోషన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేశాయి.ఆ సినిమా రుక్మిణికి ఓవర్ నైట్ స్టార్ డమ్ ని తెచ్చింది.

మోస్ట్ అవైటెడ్ హీరోయిన్  రుక్మిణి వసంత్

భారీ ప్రాజెక్టులు: కాంతార, ధర్మన్, డ్రాగన్

ఇక ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారంటే అది రుక్మిణి వసంత్ అనే చెప్పాలి.ఎందుకంటే ఆ అమ్మడు  చేతిలో ఉన్న ప్రాజెక్టులు అలాంటివి మరి .టాలీవుడ్, హాలీవుడ్, శాండల్ వుడ్ అన్న తేడా లేకుండా స్టార్ డైరెక్టర్లు అందరి సినిమాల్లో తనే కనిపిస్తుంది.

దీంతో కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న హీరోగా నటించిన ధర్మన్ సినిమాలోన కీలకపాత్రలో కనిపించనుందట.మరోవైపు గీత మోహన్ దాస్ ,యష్ కాంబోలో టాక్సిక్ లోనూ కీలక పాత్రలో కనిపించనుంది .మరోవైపు టాలీవుడ్ లో  యంగ్ టైగర్ తారక్ ,నీల్ కాంబోలో వస్తున్న డ్రాగన్ లోనూ నటిస్తున్నానంటూ కన్ఫాం చేసింది .మరి అది హీరోయిన్ గానా లేక ఎప్పటిలాగే సైడ్ రోలా అన్నది మేకర్స్ అప్ డేట్ ఇస్తే కాని తెలీదు.

రుక్మిణిని సార్ డైరెక్టర్లు కమర్షియల్ మెటీరియల్ గా చూడట్లేదా

కీలక పాత్రలకే పరిమితమా? అభిమానుల ప్రశ్న

అయితే సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నట్టుగా  అందం, అభినయం ఉన్నప్పటికీ ఈ అమ్మడికి మెయిల్ హీరోయిన్ గా కన్నా పెద్ద సినిమాల్లో కీలక పాత్రలకే పరిమితం చేస్తున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.సప్త సాగరాలు దాటి లాంటి సినిమా చేసి నటనలో తనకి తాను ప్రూవ్ చేసుకున్న రుక్మిణిని సార్ డైరెక్టర్లు కమర్షియల్ మెటీరియల్ గా చూడట్లేదా అన్న అన్నది ఫ్యాన్స్ లో వినిపిస్తున్న ప్రశ్న.

అయితే రజనీకాంత్, యష్, ఎన్టీఆర్ లాంటి స్టార్ సినిమాలో కనిపించడం అంటేనే నెక్స్ట్ లెవెల్ ,ఆ సినిమాలు కనుక బాక్సాఫీస్ వద్ద సాలిడ్ సక్సెస్ చూస్తే రుక్మిణి బ్రాండ్ వాల్యూ ఆటోమేటిక్ గా పెరగడం ఖాయం అంటూ మరికొందరి ఆర్గ్యుమెంట్ .దేమైనా వచ్చే రెండేళ్లలో రుక్మిణి వసంత్  స్టార్ హీరోయిన్ అవడం పక్కా అని రాబోతున్న ప్రాజెక్టులే చెబుతున్నాయి .చూడాలి మరి నిజంగానే ఈ సినిమాలు ఒప్పుకొని  మంచి పని చేసిందా లేదా అన్నది అవి  రిలీజ్ అయితే గాని తెలియదు!

రుక్మిణి వసంత్ నటనకు తిరుగులేదని నిరూపించుకున్నా, స్టార్ డైరెక్టర్లు ఆమెను కమర్షియల్ హీరోయిన్‌గా చూడటం లేదా అనే ప్రశ్న మిగిలింది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టులు ఈ సందేహాలకు సమాధానం చెప్పాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.