
📌 Key Points
- గాన కోకిల ఎస్. జానకి అనారోగ్యంతో మైసూర్ లో కన్నుమూశారు.
- దాదాపు 50 వేలకు పైగా పాటలు పాడి భారతీయ సినిమా చరిత్రలో మైల్ స్టోన్.
- నాలుగు జాతీయ అవార్డులు, 31 రాష్ట్రస్థాయి అవార్డులు అందుకున్నారు.
- ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజాతో ఆమె సంగీత ప్రయాణం అద్భుతం.
గాన కోకిల ఎస్. జానకి కన్నుమూతతో సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మైసూర్ లో తుది శ్వాస విడిచారు. ఆమె మరణ వార్త యావత్ దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. సంగీత ప్రపంచానికి ఇది తీరని లోటు.
సంగీత లోకంలో తీరని లోటు
S. Janaki Passes Away: సినీ ఇండస్ట్రీలో వరస మరణాలు క్యూ కడుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న భారతీ రాజా, ఆ తర్వాత భాగ్యరాజా వంటి ప్రముఖులు మృతిచెందగా తాజాగా లెజండరీ ప్లేబ్యాక్ సింగర్, గాన కోకిల ఎస్. జానకి తుది శ్వాస వదిలారు.కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె మైసూర్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.ఆమె మరణ వార్త టాలీవుడ్‌తో పాటు యావత్ దక్షిణ భారత చలనచిత్ర రంగాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జానకమ్మ ఇక లేరనే వార్తను సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు.
భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైల్ స్టోన్
ఆమెకి ఒక విలక్షణమైన శైలి ఉంది.ప్రేమ పాటలు పాడాలన్న, ఒక పసిపాపల అమాయకత్వాన్ని గొంతులో పలికించాలన్న ఆమెకే సాధ్యం .ఇక జానపదం, భక్తిరసం, శాస్త్రీయ సంగీతం ఇలా దేన్నైనా అలవోకగా తన గొంతులో పలికించేది జానకమ్మ.ఇక అందుకే ఎలాంటి కఠినమైన ట్యూనైనా సరే, సంగీత దర్శకులు కళ్ళు మూసుకుని జానకమ్మకు అప్పగించేవారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఇళయరాజా వంటి దిగ్గజాలతో ఆమె సాగించిన సంగీత ప్రయాణం భారతీయ సినిమా చరిత్రలోనే ఒక మైల్ స్టోన్ అని చెప్పాలి.
జానకమ్మ సినీ ప్రస్థానం, రికార్డులు
రికార్డు స్థాయిలో 50 వేలకు పైగా పాటలు
సంగీత దర్శకులు ఆమెకు కళ్ళు మూసుకుని అప్పగించేవారు ఇంకా ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇళయరాజా వంటి ప్రముఖులతో ఆమె చేసిన సంగీత ప్రయాణం భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే ఒక మాస్టర్ అలా దాదాపు ఆల్ దశాబ్దాల పాటు సాగిన తన సినీ జీవితంలో రికార్డు స్థాయిలో 50 వేలకు పైగా పాటలు పాడడం విశేషం తెలుగు తమిళ మలయాళ కన్నడ హిందీ లతో పాటు నాన్నకు అన్ని భారతీయ భాషలో ఆమె పాటలు పాడిన ఇప్పించారు అయితే జానకీ గారు తెలుగు తెలుగు వారైనప్పటికీ ఎక్కువగా మలయాళ మరి పాటల్లో కన్నడ భాషల్లో అత్యధికంగా పాటలు పాడటం విశేషం ఇక అక్కడ ప్రజలు జానకి అమ్మను తమ సొంత ఇంటి మనిషిగా ఆరాధించేవారు ఇక ఆమె ప్రతిభకి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆమె ఒళ్లో వచ్చి వాలాయి.
అవార్డులు, గుర్తింపులు
ఉత్తమ గాయనిగా నాలుగు జాతీయ అవార్డులను అందుకున్న జానకమ్మ వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏకంగా 31 సార్లు రాష్ట్రస్థాయి అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఏది ఏమైనా గా కోకిల జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటనే చెప్పాలి.
ప్రఖ్యాత సింగర్ ఎస్.జానకి చివరి వరకు పాటల సవ్వడులతోనే సావాసం చేశారు. ఇటీవల చెన్నైలోని జానకమ్మ ఇంటికి గాయని సునీత వెళ్లారు. ఆమె పాదాల చెంత కూర్చొని పాటలు పాడగా గాన సరస్వతి ఎంతో సంతోషపడ్డారు. చప్పట్లు కొడుతూ ఉత్సాహంగా ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత కొన్ని… https://t.co/8B4v3HQVZY pic.twitter.com/9m1Xe0PLwB
— BIG TV Breaking News (@bigtvtelugu) July 11, 2026
ఎస్. జానకి మరణం సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆమె తన గానంతో కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్నారు. ఆమె పాటలు ఎప్పటికీ మన జ్ఞాపకాల్లో నిలిచిపోతాయి. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుందాం.


