|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sagar: తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం.. హీరోగా సాగర్.. పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా

Published: 03-10-2025, 2:49 AM
Sagar: తెరపైకి సింగరేణి కార్మికుల జీవితం.. హీరోగా సాగర్.. పాన్ ఇండియా లెవల్లో కొత్త సినిమా

మొగలిరేకు ఆర్కేగా పేరుపొందిన నటుడు సాగర్ ‘ది 100’ తర్వాత కొత్త పాన్ ఇండియా సినిమాను ప్రకటించారు. తెలంగాణలోని సింగరేణి కార్మికుల జీవితాలను తెరపైకి తీసుకురానున్న ఈ చిత్రాన్ని ‘జార్జ్ రెడ్డి’ దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఇది పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుంది.

Key Points

1

నటుడు సాగర్ 'ది 100' తర్వాత కొత్త పాన్ ఇండియా సినిమా ప్రకటించాడు.

2

సింగరేణి కార్మికుల జీవితాలు, కష్టాలు ఈ సినిమా ప్రధానాంశం.

4

తెలుగుతో పాటు కన్నడ, తమిళ, హిందీ భాషల్లో ప్రముఖ నటులు నటించనున్నారు.

సీరియల్ నటుడు సాగర్ పాన్ ఇండియా ఎంట్రీ

Sagar: సాగర్ అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, మొగలిరేకులో సీరియల్ లో ఆర్కే అంటే మాత్రం టక్కున గుర్తుపెట్టేస్తారు. అంతలా తన నటనతో ఆకట్టుకున్నాడు నటుడు సాగర్. చాలా గ్యాప్ తరువాత ఈ నటుడు ఇటీవలే ‘ది 100’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రైం థ్రిల్లర్ బ్యాక్డ్రాప్ తో వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకుంది. మంచి విజయాన్ని సాధించింది. ఈ నేపధ్యంలోనే మరో కొత్త సినిమాను ప్రకటించాడు నటుడు (Sagar)సాగర్. దసరా పండుగ సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన చేశారు.

Casting Couch: ఇండస్ట్రీలో ఓ పెద్ద నిర్మాత ఆ అమ్మాయిని మోసం చేశాడు.. నేరెళ్ల శారద షాకింగ్ కామెంట్స్

సింగరేణి కార్మికుల పోరాట గాథ

ఈ సినిమా కోసం మరో వినూత్న ప్రాజెక్ట్‌ ను ఎంచుకున్నాడు సాగర్. తెలంగాణాలోని సింగరేణి కార్మికుల జీవితాల్ని తెరపైకి ఆవిష్కరించాలని ఫిక్స్ అయ్యాడు. పాన్ ఇండియా లెవల్లో వస్తున్న ఈ సినిమాను ‘జార్జ్ రెడ్డి’ సినిమా చేసిన దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించబోతున్నాడు. సింగరేణి బొగ్గు గనుల కార్మికుల కష్టాలు, పోరాటాలు, ఆశలు, అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇవ్వడం ఖాయమని మేకర్స్ చెప్తున్నారు.

నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం

అలాగే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం ప్రముఖ స్టార్ హీరోని తీసుకోబోతోన్నట్టు తెలిపారు. ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోని ప్రముఖ నటుల్ని ఈ చిత్రం కోసం తీసుకుంటున్నట్టు సూచించారు. ఇక నవంబర్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానున్నట్టుగా టీం ప్రకటించారు.

సాగర్ పాన్ ఇండియా చిత్రం సింగరేణి కార్మికుల జీవితాలను ఆవిష్కరించనుంది. నవంబర్ నుండి షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.