|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

అక్కడ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ లవర్.. వదిన అన్న రాలేడా అంటూ కామెంట్స్

Published: 01-06-2025, 12:55 AM
అక్కడ ఎంజాయ్ చేస్తున్న సాయి ధరమ్ తేజ్ లవర్.. వదిన అన్న రాలేడా అంటూ కామెంట్స్

టాలీవుడ్ నటి మెహ్రీన్ ఫిర్జాదా తన లాండ్రెస్ సెలవుల ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతూ, సాయి ధరమ్ తేజ్ తో ఆమెకున్న సంబంధం గురించి నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Key Points

1

మెహ్రీన్ ఫిర్జాదా లాండ్రెస్‌లో సెలవులు గడుపుతోంది.

2

ఆమె అందాలతో సోషల్ మీడియాలో అదరగొడుతోంది.

4

మెహ్రీన్ యొక్క ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ వైరల్ అవుతోంది.

మెహ్రీన్ ఫిర్జాదా యొక్క లాండ్రెస్ సెలవులు

టాలీవుడ్ యంగ్ బ్యూటీ మెహ్రీన్ ఫిర్జాదా(Mehrin Firzaada) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’(Krishna Gaadi Veera Prema gadha) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి ఫస్ట్ మూవీతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత F2, F3 సినిమాలతో మరింత క్రేజ్ తెచ్చుకుంది. అలాగే తన అందం అభినయంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇక కెరీర్ స్టార్టింగ్‌లోనే ఓ వ్యక్తితో ఎంగేజ్‌మెంట్ చేసుకుని షాక్ ఇచ్చిన ఈ బ్యూటీ కొన్నాళ్లకే బ్రేకప్ అయిపోయిందని వెల్లడించింది. అయితే అప్పడు ఫుల్ బక్కచిక్కి పోయి కనిపించి అయ్యో పాపం అనిపించింది. ఇప్పుడిప్పుడే మళ్లీ మంచి గ్లామరస్‌గా తయారవుతుంది.

ఇదిలా ఉంటే.. సినిమాలకు దూరమైన ఈ భామ సోషల్ మీడియా(Social Media)లో మాత్రం ఫుల్ యాక్టీవ్‌గా ఉంటూ నిత్యం అందాల జాతరతో అదరహో అనిపిస్తుంది. అంతేకాకుండా తన వ్యక్తిగత జీవితం గురించి పంచుకుంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా మెహ్రీన్ తన ఇన్‌స్టాగ్రామ్(Instagram) వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు

అందులో లాండ్రెస్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫొటోస్‌ను షేర్ చేసింది. అలగే అక్కడి వెదర్‌ను ఆస్వాదిస్తున్న పిక్స్‌ను షేర్ చేస్తూ..‘ఎ బ్యూటిఫుల్ డే ఇన్ లాండ్రెస్’ అనే క్యాప్షన్ రాసుకొచ్చింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు అన్న రాలేడా అని కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ బ్యూటీ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో డేటింగ్‌లో ఉందనే పుకార్లు అప్పట్లో నెట్టింట షికార్లు చేసిన సంగతి తెలిసిందే.

సాయి ధరమ్ తేజ్ తో డేటింగ్ రూమర్స్

A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa)

మెహ్రీన్ ఫిర్జాదా యొక్క సోషల్ మీడియా పోస్ట్‌లు ఎల్లప్పుడూ ఆసక్తిని రేకెత్తిస్తాయి. ఈసారి లాండ్రెస్‌లో ఆనందంగా గడిపిన ఫోటోలు నెటిజన్లలో చర్చకు దారితీశాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.