
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ 70% పూర్తయింది. త్వరలో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ప్రారంభం కానుంది.
Key Points
సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ చిత్రం షూటింగ్ 70% పూర్తయింది.
120 రోజుల్లో షూటింగ్ పూర్తి చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నారు.
త్వరలో యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.
మూడు సెట్లలో సాయి ధరమ్ తేజ్ పాల్గొంటారని సమాచారం.
‘సంబరాల ఏటిగట్టు’ షూటింగ్ ప్రగతి
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej)యాక్సిడెంట్ కారణంగా కొద్ది రోజులపాటు సినిమాలకు దూరం అయ్యాడు. మళ్లీ ‘బ్రో’ చిత్రంతో రీఎంట్రీ ఇచ్చాడు. ఇక చివరగా ‘విరూపాక్ష’మూవీతో హిట్ అందుకున్నారు. ఇక గత ఏడాది ‘గాంజా శంకర్’ తో రాబోతున్నట్లు ప్రకటించాడు. కానీ ఈ సినిమా టైటిల్ వివాదం కావడంతో మొత్తానికే ఆ ప్రాజెక్ట్‌ను వదిలేశారు. ప్రస్తుతం సాయి ధరమ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘సంబరాల ఏటిగట్టు’(SambaralaYetiGattu). 18వ చిత్రంగా రాబోతుతన్న ఈ సినిమాను రోహిత్ కెపి తెరకెక్కిస్తున్నారు. ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిరంజన్ రెడ్డి(Niranjan Reddy), చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. అయితే పాన్ ఇండియా రేంజ్‌లో తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇప్పటికే ఇందులోంచి విడుదలైన పోస్టర్స్,గ్లింప్స్ మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే గత కొద్ది రోజుల నుంచి ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ రావడం లేదు. దీంతో మెగా అభిమానులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘సంబరాల ఏటిగట్టు’ మూవీకి సంబంధించిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులను సంతోష పెడుతోంది. ఇక దీనికి సంబంధించిన షూటింగ్‌ను 120 రోజుల్లోనే 70శాతం పూర్తి చేసినట్లు సమాచారం. త్వరలోనే యాక్షన్ షెడ్యూల్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఇందుకోసం మూడు సెట్స్ కూడా చిత్రబృందం సిద్ధం చేసిందట. వీటిల్లో సాయి ధరమ్ తేజ్ పాల్గొనబోతున్నట్లు టాక్. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అనుకున్న తేదీకి విడుదల చేయాలని మేకర్స్ చకా చకా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.
యాక్షన్ షెడ్యూల్ ప్రారంభం
అభిమానుల ఆనందం
‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. త్వరలోనే విడుదల తేదీ ప్రకటించే అవకాశం ఉంది. సాయి ధరమ్ తేజ్ అభిమానులకు ఇది శుభవార్త.


