|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sai Durga Tej: ఏ జన్మ పుణ్యమో ఇది.. సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ పోస్ట్

Published: 14-11-2025, 12:45 AM
Sai Durga Tej: ఏ జన్మ పుణ్యమో ఇది.. సాయి దుర్గ తేజ్ ఎమోషనల్ పోస్ట్

మెగా హీరో సాయి దుర్గ తేజ్ తాజాగా ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2025లో మోస్ట్ డిజైరెబుల్ పర్సన్ అవార్డును గెలుచుకున్నారు. ఈ అవార్డును తన తల్లి దుర్గతో కలిసి అందుకొని, తన ‘సెకండ్ లైఫ్’ గురించి ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఆయన భావోద్వేగ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Key Points

1

సాయి దుర్గ తేజ్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2025లో మోస్ట్ డిజైరెబుల్ పర్సన్ అవార్డు గెలుచుకున్నారు.

2

ఈ అవార్డును తన తల్లి దుర్గతో కలిసి అందుకున్నారు.

4

ప్రస్తుతం 'సంబరాల ఏటిగట్టు' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తున్నారు.

అవార్డు వేడుకలో సాయి దుర్గ తేజ్ ఎమోషనల్

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. మెగా హీరోగా ఇప్పటికే ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇటీవలే విరూపాక్ష సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అనుకున్నాడు ఈ హీరో. హారర్ అండ్ థ్రిల్లర్ (Sai Durga Tej)కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాను దర్శకుడు కార్తీక్ వర్మ తెరకెక్కించాడు. సస్పెన్స్ స్క్రీన్ ప్లేతో ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంటర్టైన్ చేసిన ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరువాత సాయి దుర్గ తేజ్ పవన్ కళ్యాణ్ తో బ్రో సినిమా చేశాడు. కానీ, ఈ సినిమా ఆడియన్స్ ను అంతగా ఆకట్టుకోలేదు.

Sivakarthikeyan-Rashmika: రష్మిక బ్యాడ్ లక్.. ఆ క్రేజీ ప్రాజెక్టు నుంచి తీసేశారు.. మరి ఎవరు చేస్తున్నారో తెలుసా..

అమ్మతో కలిసి అవార్డు అందుకున్న మెగా హీరో

ఇదిలా ఉంటే, తాజాగా హీరో సాయి దుర్గ తేజ్ ఫిలిం ఫేర్ అవార్డ్స్ 2025లో మోస్ట్ డిజైరెబుల్ పర్సన్ గా అవార్డు అందుకున్నాడు. ఈ అవార్డును తన అమ్మ దుర్గతో పాటుగా అందుకున్నాడు సాయి దుర్గ తేజ్. ఈ ఫొటోతో పాటు తాను మొదటిసారిగా తన అమ్మతో పటు అందుకున్న అవార్డు ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు ఈ హీరో. ఆ ఫోటోల గురించి వివరిస్తూ.. మొదటిది నేను జీవితంలో అందుకున్న మొదటి అవార్డు, రెండవది న సెకండ్ లైఫ్ నేను అందుకున్న మొదటి ఫోటో. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో నీకు కొడుకుగా పుట్టాను”అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేశాడు.

“సెకండ్ లైఫ్” గురించి తేజ్ భావోద్వేగ వ్యాఖ్యలు

సెకండ్ లైఫ్ అంటే, సాయి దుర్గ తేజ్ కి ఆమధ్య బైక్ ఆక్సిడెంట్ జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ సాయి దుర్గ తేజ్ మరణం అంచులదాకా వెళ్లి వచ్చాడు. ఒక రకంగా ఆయనకిది పునర్జన్మ అనే చెప్పాలి. అందుకే, ఈ జీవితాన్ని ఆయన సెకండ్ లైఫ్ గా చెప్పుకొన్నాడు. దీంతో ఆయన చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన సంబరాల ఏటిగట్టు అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు రోహిత్ కేపీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

సాయి దుర్గ తేజ్ పోస్ట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. తన తల్లి పట్ల ప్రేమ, ‘సెకండ్ లైఫ్’ పట్ల కృతజ్ఞత ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించింది. ప్రస్తుతం ‘సంబరాల ఏటిగట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.