|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Sai Durgha Tej: తిరుమలలో హీరో సాయి దుర్గ తేజ్.. పెళ్లిపై ప్రకటన.. వచ్చే ఏడాది ముహూర్తం..

Published: 17-11-2025, 12:41 AM
Sai Durgha Tej: తిరుమలలో హీరో సాయి దుర్గ తేజ్.. పెళ్లిపై ప్రకటన.. వచ్చే ఏడాది ముహూర్తం..

మెగా హీరో సాయి దుర్గ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తన పెళ్లి, కొత్త సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ విడుదలపై కీలక ప్రకటనలు చేశారు. ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

Key Points

1

సాయి దుర్గ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.

2

వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటన చేశారు.

4

పెళ్లి, సినిమా ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తిరుమలలో సాయి దుర్గ తేజ్ దర్శనం

Sai Durgha Tej: మెగా హీరో సాయి దుర్గ తేజ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఈరోజు (నవంబర్ 17) ఆయన స్వామివారి ప్రభాత సేవ తర్వాత బ్రేక్‌ దర్శనంలో పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడనిన ఆయన తన పెళ్లి గురించి ప్రకటన చేశాడు. “నాకు మంచి సినిమాలు, (Sai Durgha Tej)మంచి జీవితం ఇచ్చిన శ్రీవారికి కృతజ్ఞతలు తెలిపేందుకు తిరుమలకుక్ వచ్చాను. కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతున్నాం కాబట్టి స్వామివారి ఆశీస్సులు తీసుకొని ముందుకు సాగాలనుకుంటున్నాను. వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాను”అంటూ చెప్పుకొచ్చాడు. అలాగే తాను హీరోగా వస్తున్న ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా కూడా వచ్చే ఏడాది విడుదల అవుతుంది అని గుర్తు చేశాడు సాయి దుర్గ తేజ్. దీంతో పెళ్లిపై ఆయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

IFFI 2025: ఫిలిం ఇండస్ట్రీలో 50 ఏళ్ళు.. రజనీకాంత్‌, బాలకృష్ణలకు అరుదైన గౌరవం.. గోవా ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘన సన్మానం..

పెళ్లిపై మెగా హీరో కీలక ప్రకటన

కొత్త సినిమా ‘సంబరాల ఏటిగట్టు’ విడుదల

తిరుమల నుంచి సాయి దుర్గ తేజ్ చేసిన ఈ ప్రకటనలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపాయి. వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్న సాయికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.