
డైలాగ్ కింగ్ సాయి కుమార్ నటించిన ‘చౌకీదార్’ సినిమా నుంచి తాజాగా ఒక ఎమోషనల్ సాంగ్ విడుదలైంది. ఈ పాటలో తండ్రి ప్రేమ, త్యాగాలు ప్రధానంగా చూపించారు. ఈ పాట లిరిక్స్ నెటిజన్లను కదిలించాయి.
Key Points
సాయి కుమార్ నటనతో ‘చౌకీదార్’ సినిమాలో ఎమోషనల్ సాంగ్ విడుదల.
తండ్రి ప్రేమ, త్యాగాలను చాటుతూ సాగే గుండెను కదిలించే పాట.
సంతోష్ వెంకీ రచన, విజయ్ ప్రకాష్ గానం, సచిన్ బస్రూర్ సంగీతం.
సాయి కుమార్, పృథ్వీ అంబర్ మధ్య ఎమోషనల్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి.
‘చౌకీదార్’ సినిమా ఎమోషనల్ సాంగ్ విడుదల
డైలాగ్ కింగ్ సాయి కుమార్(Sai Kumar) ప్రస్తుతం ఏ చిత్రంలో నటిస్తే ఆ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతున్న సంగతి తెలిసిందే. గత ఏడాది ఆయన నటించిన సినిమాలన్నీ కూడా బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి. సాయి కుమార్ ప్రస్తుతం తెలుగు, కన్నడ భాషల్లో ‘చౌకీదార్’ అనే సినిమాను చేస్తున్నారు. ఈ చిత్రంలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ జంటగా నటిస్తున్నారు. ‘చౌకీదార్’(Chowkidar) మూవీని వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ బండియప్ప(Chandrasekhar Bandiyappa) తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ ఎమోషనల్ సాంగ్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా గుండెను పిండేసేలా ఓ చక్కటి బాణీని అందించారు.
నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ అందించిన బాణీ అయితే ప్రతీ ఒక్కరినీ కదిలించేలా ఉంది. తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటేలా పాటను రచించారు. ఇక లిరికల్ వీడియో చూస్తుంటే సాయి కుమార్ తండ్రిగా మరోసారి ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు. పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఉండేట్టుగా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించనున్నారు.
తండ్రి ప్రేమను చాటుకునే లిరిక్స్
నెటిజన్ల స్పందన
‘చౌకీదార్’ సినిమాలోని ఎమోషనల్ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నట్లు సమాచారం.


