|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

M.S.Subbulakshmi Biopic: తెరపైకి లెజెండరీ సింగర్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ జీవితం.. శ్రీకారం చుట్టిన గీతా ఆర్ట్స్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా?

Published: 15-12-2025, 2:08 AM
M.S.Subbulakshmi Biopic: తెరపైకి లెజెండరీ సింగర్ ‘ఎంఎస్ సుబ్బలక్ష్మి’ జీవితం.. శ్రీకారం చుట్టిన గీతా ఆర్ట్స్.. ఎవరు నటిస్తున్నారో తెలుసా?
  • ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథను బయోపిక్‌గా తెరకెక్కిస్తున్నారు.
  • నిర్మాత అల్లు అరవింద్ ఈ భారీ ప్రాజెక్ట్‌ను గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.
  • దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించనున్నారని సమాచారం.
  • ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో మలయాళ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం బయోపిక్‌ల ట్రెండ్ నడుస్తోంది. ఈ కోవలోనే లెజెండరీ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథను తెరకెక్కించేందుకు అల్లు అరవింద్ శ్రీకారం చుట్టారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రానున్న ఈ చిత్రంలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్రలో సాయి పల్లవి నటించనున్నట్లు సమాచారం. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్: ఎవరు నిర్మిస్తున్నారు?

M.S.Subbulakshmi Biopic: ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో బయోపిక్ ల హవా నడుస్తోంది. భాషతో సంబంధం లేకుండా ప్రముఖుల జీవితాలను తెరపైకి తీసుకురావడానికి ఇంట్రెస్ట్ చూస్తున్నారు మేకర్స్. ఆడియన్స్ కూడా అలాంటి సినిమాలను చూసేందుకు ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. ఇప్పటికే, తెలుగులో మహానటి, మహానాయకుడు, కథానాయకుడు లాంటి బయోపిక్ లు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో లెజెండర్ పర్సన్ బయోపిక్ తెరకెక్కనున్నట్టుగా తెలుస్తోంది. ఆ లెజెండరీ పర్సన్ ఎవరో కాదు ప్రముఖ సింగర్ ఎంఎస్ సుబ్బలక్ష్మి(M.S.Subbulakshmi Biopic). ఈమె జీవిత కథను తెరపైకి తీసుకురావాలని బలంగా ప్లాన్ చేస్తున్నాడట నిర్మాత అల్లు అరవింద్.

దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, కథ చర్చలు

Bigg Boss 9 Telugu: కప్పు ముఖ్యం బిడ్డ.. భరణి ఎమోషనల్ కామెంట్స్.. కాళ్ళు మొక్కిన తనూజ..

ఎంఎస్ సుబ్బలక్ష్మిగా సాయి పల్లవి.. అంచనాలు

ఇప్పటికే ఈ కథకు సంబందించిన చర్చలు కూడా కంప్లీట్ అయ్యాయట. మళ్ళీరావా, జెర్సీ, కింగ్డమ్ లాంటి ఎమోషనల్ కథలతో సినిమాలు చేసిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడట. ఇప్పటికే కథ చర్చలు కూడా కంప్లీట్ అవడంతో త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారని సమాచారం. ఇక ఈ సినిమాలో ఎంఎస్ సుబ్బలక్ష్మి పాత్ర ఎవరు చేస్తే బాగుటుందని తర్జనభర్జన పడ్డారట మేకర్స్. ఫైనల్ గా మలయాళ బ్యూటీ సాయి పల్లవి అయితేనే ఆ పాత్రకు సహజత్వం వస్థుంది అని ఫిక్స్ అయ్యారట. ఇదే కనుక నిజం అయితే, సాయి పల్లవి కెరీర్ లో ఇది ఒక మైలురాయిగా మిగిలిపోయే అవకాశం ఉంటుంది. మరి ఈ సినిమా కూడా మహానటి సినిమా రేంజ్ లో హిట్ అవుతుందా అనేది చూడాలి.

ఎంఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ సినీ చరిత్రలో ఓ మైలురాయిగా నిలుస్తుందని మేకర్స్ నమ్ముతున్నారు. సాయి పల్లవి కెరీర్‌కు ఇది పెద్ద ప్లస్ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చిత్రం మహానటిని మించిపోతుందో లేదో వేచి చూడాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.