|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సాయి పల్లవికి ఊహించని షాక్! బాలీవుడ్‌లో భారీ పరాభవం, రామాయణ భవిష్యత్తు ఏంటి?

Published: 06-05-2026, 1:15 AM
సాయి పల్లవికి ఊహించని షాక్! బాలీవుడ్‌లో భారీ పరాభవం, రామాయణ భవిష్యత్తు ఏంటి?
  • సాయి పల్లవి బాలీవుడ్ డెబ్యూ “ఏక్ దిన్” భారీ అంచనాలతో విడుదలైంది, కానీ కలెక్షన్లు లేవు.
  • మొదటి రోజు రూ.1.37 కోట్లు, రెండో రోజు రూ.1 కోటి మాత్రమే వసూలు చేసి నిరాశపరిచింది.
  • సౌత్‌లో స్టార్ క్రేజ్ ఉన్నా, బాలీవుడ్‌లో మొదటి సినిమాకే తీవ్ర ఎదురుదెబ్బ తగిలింది.
  • ఈ పరాభవం “రామాయణం” ప్రాజెక్టులో ఆమె సీత పాత్రపై ప్రభావం చూపుతుందా అన్న చర్చ.

సౌత్ ఇండియాలో సాయి పల్లవి అంటే ఒక సంచలనం! ఆమె క్రేజ్, నటన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కానీ ఇప్పుడు బాలీవుడ్‌లో ఆమెకు ఊహించని షాక్ తగిలింది. భారీ అంచనాలతో వచ్చిన ఆమె మొదటి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ వార్త ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

బాలీవుడ్‌లో సాయి పల్లవికి బిగ్ షాక్!

సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో సాయి పల్లవి క్రేజ్ వేరు. స్టార్ హీరోలకు ఉన్న క్రేజ్ ఆమెకు ఉంది. సాయి పల్లవి నటిస్తుందంటే.. హీరోలతో సంబంధం లేకుండా.. అభిమానులు థియేటర్లకు పరుగులు పెడుతుంటారు. ఎంత పెద్ద స్టార్ హీరోతో సినిమా ఆఫర్ వచ్చిన.. కథ నచ్చితేనే సినిమా చేస్తుంది సాయి పల్లవి. కథ నచ్చకనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమానే సాయి పల్లవి రిజెక్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి. సౌత్ లో సాయిపల్లవి క్రేజ్ ఎంతలా ఉందంటే.. ఆమే.. కావాలని స్టార్ హీరోలు వెయిట్ చేసిన సందర్భాలు కూడా లేకపోలేదు.అటువంటి నేచురల్ హీరోయిన్ కు బాలీవుడ్ లో బిగ్ షాక్ తగిలింది.

స్టార్ హీరోలకు దీటైన క్రేజ్ సంపాదించుకున్న నటి సాయి పల్లవి. కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలను మాత్రమే ఎంపిక చేసుకుంటూ.. తన మార్క్ సినిమాలు చేసుకుంటూ వెళ్తోంది. అయితే, కొంతకాలంగా సౌత్ ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఆమె తాజాగా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ సరసన ఆమె ‘ఏక్ దిన్’ అనే హిందీ మూవీలో నటించింది. ఈ చిత్రాన్ని ఆమీర్ ఖాన్ స్వయంగా నిర్మించడం వల్ల సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సాయి పల్లవి ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్‌లో కూడా తన సత్తా చాటుతుందని అందరు అనుకున్నారు.

“ఏక్ దిన్” కలెక్షన్లు నిరాశే!

అంతే కాదు సాయి పల్లవి ఈ సినిమాతోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుండటంతో.. అందరి దృష్టి ఏక్ దిన్ సినిమాపైనే ఉంది. మే 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో స్పదన రాబట్టలేకపోయింది. . ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా మొదటి రోజే కేవలం రూ.1.37 కోట్ల వసూళ్లను మాత్రమే సాధించింది. రెండో రోజు ఈ వసూళ్లు మరింతగా తగ్గి సుమారు కోటి రూపాయల వద్దకు చేరినట్లు సమాచారం. మూడో రోజు నుంచి కలెక్షన్లు ఇంకా క్షీణించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి చూస్తుంటే, బాక్సాఫీస్ వద్ద ఎక్కువ రోజులు నిలబడే అవకాశం లేనట్టే తెలుస్తోంది. ఈ విషయంలో సాయి పల్లవిపై రకరకాల ట్రోల్స్ కూడా మొదలయ్యాయి.

రామాయణ ప్రాజెక్ట్‌పై ప్రభావం ఎంత?

సౌత్ లో సాయి పల్లవి పేరు చెప్పగానే థియేటర్లు నిండిపోతాయి. కానీ హిందీ మార్కెట్‌లో ఆమె అడుగు పెట్టగానే బిగ్ షాక్ తగిలింది. సినిమా కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడం, ప్రమోషన్ లోపాలు వంటి కారణాలు ఈ రిజల్ట్ కి దారితీసి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. భారీ అంచనాల మధ్య విడుదలైన ఏక్ దిన్ నిరాశ కలిగించడం అభిమానులను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ఇక ఈ ప్రభావం సాయి పల్లవి నెక్ట్స్ బాలీవుడ్ ప్రాజెక్ట్ అయిన ‘రామాయణ’పై పడుతుందేమో అన్న భయం అభిమానుల్లో ఉంది. ఇక ప్రస్తుతం అందరి దృష్టి రామాయణ పైనే ఉంది. ఈసినిమా అయినా ఆమెకు హిందీ మార్కెట్‌లో విజయాన్ని అందిస్తుందా లేదా అన్నది చూడాలి.

సాయి పల్లవి కెరీర్‌పై ఈ ప్రభావం ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరిన్ని తాజా, సంచలన సినీ వార్తల కోసం మా ఛానెల్‌ని చూస్తూ ఉండండి!

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.