
టాలీవుడ్‌లో దూసుకుపోతున్న సాయి పల్లవి బాలీవుడ్‌లోనూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. తాజాగా ఆమెకు మరో పెద్ద అవకాశం లభించింది. ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటిస్తోన్న ‘ఏక్ దిన్’ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.
Key Points
సాయి పల్లవి బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకుంది.
ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో 'ఏక్ దిన్' సినిమాలో నటిస్తోంది.
సాయి పల్లవి బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటోంది.
సాయి పల్లవి బాలీవుడ్ ప్రయాణం
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి(Sai Pallavi) వరుస హిట్స్ సాధిస్తూ ఫుల్ ఫామ్‌లో ఇండస్ట్రీకి షేక్ చేస్తోంది. ఇటీవల అమరన్, తండేల్ వంటి సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది. అక్కడ వరుస అవకాశాలు అందుకుంటూ ఈ అమ్మడు ఫుల్ బిజీ బిజీగా గడుపుతోంది. అత్యంత భారీ బడ్జెట్ చిత్రం ‘రామాయణ’లో నటిస్తోంది. ఇందులో రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటిస్తుండగా.. నీతేష్ తివారి తెరకెక్కిస్తున్నారు. ఇందులో యశ్ రావణుడిగా కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. సాయి పల్లవి బాలీవుడ్‌లో మరో బంపర్ ఆఫర్ అందుకుంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా సైలెంట్‌గా కంప్లీట్ చేసినట్లు సమాచారం. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్(Junaid Khan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఏక్ దిన్’ మూవీలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది.
సునీల్ పాండే దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇక ఈ మూవీని బాలీవుడ్ స్టార్ నిర్మాత మన్సూర్ ఖాన్, ఆమిర్ ఖాన్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక వీరిద్దరూ ఏకంగా 17 ఏళ్ల తర్వాత కలిసి పని చేస్తుండటం విశేషం. తాజాగా, ‘ఏక్ దిన్’ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ఫిక్స్ అయినట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రం నవంబర్ 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక వాటిని చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సాయి పల్లవి సైలెంట్‌గా బాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటూ క్రేజీ బ్యూటీగా మారడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.
‘ఏక్ దిన్’ సినిమా వివరాలు
రిలీజ్ డేట్ ప్రకటన
సాయి పల్లవి బాలీవుడ్‌లో సత్తా చాటుతోంది. ‘ఏక్ దిన్’ సినిమా విడుదలతో ఆమె కెరీర్‌కు మరో మెట్టు ఎక్కుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.


