
📌 Key Points
- సాయి పల్లవి డ్యాన్సర్ నుండి హీరోయిన్ గా ఎదిగారు.
- ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులతో గుర్తింపు తెచ్చుకున్నారు.
- ప్రస్తుతం బాలీవుడ్ లో రామాయణం, ఏక్ దిన్ చిత్రాల్లో నటిస్తున్నారు.
- పెళ్లి గురించి సాయి పల్లవి ఇచ్చిన సమాధానం అభిమానులను ఆశ్చర్యపరిచింది.
సాయి పల్లవి డ్యాన్సర్ గా తన కెరీర్ ప్రారంభించి హీరోయిన్ గా ఎదిగారు. ఫిదా సినిమాలో తెలంగాణ యాసలో డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆమె పెళ్లి గురించి చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
సాయి పల్లవి సినీ ప్రస్థానం
Sai Pallavi:డాన్సర్ గా తన కెరియర్ ను మొదలుపెట్టి ఢీ వంటి షోలలో తన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని టైటిల్ విజేతగా నిలిచింది సాయి పల్లవి (Sai Pallavi). అలా నాట్య మయూరిలా తన డ్యాన్స్ తో అందరినీ ఆకట్టుకున్న ఈమె.. ఆ తర్వాతే సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. నిజానికి చిన్నప్పటి నుంచే నటించాలనే కోరిక బలంగా ఉండేదట. కాకపోతే చదువు పూర్తయ్యాకే నటనలోకి వెళ్లాలని అనుకున్న ఈమె.. అందుకు తగ్గట్టుగానే డాక్టర్ కోర్స్ పూర్తి చేసింది. ఆ తర్వాత కూడా నటనపై ఆసక్తి తగ్గకపోవడంతో సినిమాల్లోకి రావాలని బలంగా కోరుకుందట .
అందుకు తగ్గట్టుగానే చిన్న చిన్న పాత్రలు చేస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈమె.. మలయాళ దర్శకుడు ఆల్ఫోన్స్ పుత్రన్ దృష్టిలో పడి.. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీకి హీరోయిన్ గా తొలిసారి పరిచయమైంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు నటించగా.. అందులో ఒకరిగా తన నటనతో అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ సినిమాలో సాయి పల్లవి పోషించిన టీచర్ పాత్రకు అంత గుర్తింపు వస్తుందని బహుశా ఈమె కూడా ఊహించి ఉండదేమో.. అంతలా క్రేజ్ దక్కించుకున్న ఈమె తెలుగులో ‘ఫిదా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలంగాణ యాసాలో అద్భుతమైన డైలాగ్ డెలివరీతో అందరి దృష్టిని ఆకట్టుకుంది సాయి పల్లవి.
ఫిదా చిత్రంతో సాయి పల్లవికి గుర్తింపు
ఇక తాను ఎంచుకునే పాత్ర ఏదైనా సరే అందులో పరకాయ ప్రవేశం చేసి మరీ నటించేది. అందుకే సాయి పల్లవి సక్సెస్ ని చూసిన అభిమానులు “లేడీ పవర్ స్టార్” అనే బిరుదును కూడా అందించారు. అలా తమిళ్ , తెలుగు అంటూ ఈమె వరుస చిత్రాలలో నటిస్తూ బిజీగా మారిన సాయి పల్లవి.. ప్రస్తుతం హిందీలో రామాయణం చిత్రంలో సీత పాత్ర పోషిస్తోంది. అలాగే సాయి పల్లవి , అమీర్ ఖాన్ వారసుడు జునైద్ ఖాన్ నటిస్తున్న ‘ఏక్ దిన్’ అనే చిత్రం ద్వారా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది .త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే మరోవైపు ‘రామాయణం’ సినిమాలో సీతగా నటిస్తోంది. అలాగే తమిళంలో ధనుష్ కి జోడిగా మరో చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే .
పెళ్లి గురించి సాయి పల్లవి సంచలన వ్యాఖ్యలు
ఇలా తమిళ్ , హిందీ అంటూ వరుస చిత్రాలతో బిజీగా మారిన సాయి పల్లవి ఇటీవల ఒక కార్యక్రమంలో పాల్గొనగా పెళ్లెప్పుడు చేసుకుంటారు అని మీడియా మిత్రులు ప్రశ్నించారు. దీంతో మేల్ ఫ్యాన్స్ కూడా ఆశ్చర్యపోయేలా తనదైన సమాధానాన్ని చెప్పి అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది సాయి పల్లవి. పెళ్లెప్పుడు చేసుకుంటారన్న ప్రశ్నకు సాయి పల్లవి మాట్లాడుతూ..” ప్రస్తుతం నేను కెరియర్ పై ఫోకస్ చేశాను. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇప్పట్లో అయితే లేదు. ప్రస్తుతానికి నేను సింగిల్ మాత్రమే” అని చెప్పుకొచ్చింది. మొత్తానికైతే పెళ్లి చేసుకునే ఆలోచనలు ఇప్పట్లో లేవని తెలిపింది. మరి భవిష్యత్తులో ఆ ఆలోచన వస్తే అప్పుడు తనకు ఎలాంటి భర్త కావాలో చెబుతుందేమో అని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. కాగా సాయి పల్లవి వయసు ప్రస్తుతం 33 సంవత్సరాలు. ఇకపోతే ఈమె తన చెల్లెలు పూజా కన్నన్ కు రెండేళ్ల క్రితమే దగ్గరుండి మరీ వివాహం చేయించింది. మరి సాయి పల్లవి ఎప్పుడు ఆ శుభవార్త చెబుతుందో చూడాలి.
సాయి పల్లవి పెళ్లి గురించి చేసిన ఈ ప్రకటన ఆమె అభిమానులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆమె భవిష్యత్తు ప్రాజెక్టుల కోసం ఎదురు చూద్దాం. ఆమె కెరీర్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆశిద్దాం.


