|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ల‌క్కీస్టార్‌గా మారిన సాయికుమార్‌ – బైలింగ్వ‌ల్ మూవీ చౌకీదార్‌ నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్‌!

Published: 04-06-2025, 11:52 PM
ల‌క్కీస్టార్‌గా మారిన సాయికుమార్‌ - బైలింగ్వ‌ల్ మూవీ చౌకీదార్‌ నుంచి ఎమోష‌న‌ల్ సాంగ్ రిలీజ్‌!

సాయికుమార్ ఇటీవల విడుదలైన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. దీంతో ఆయన లక్కీస్టార్‌గా మారారు. ప్రస్తుతం ఆయన తెలుగు, కన్నడ భాషల్లో ‘చౌకీదార్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఎమోషనల్ సాంగ్ విడుదలైంది.

Key Points

1

సాయికుమార్ లక్కీస్టార్‌గా ఎలా మారాడో తెలుసుకోండి.

2

బైలింగ్వల్ మూవీ ‘చౌకీదార్’ నుండి ఎమోషనల్ సాంగ్ రిలీజ్.

4

పృథ్వీ అంబర్, సాయికుమార్ నటన హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు.

‘చౌకీదార్’ సినిమా విశేషాలు

సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటించిన కమిటీ కుర్రోళ్లు, లక్కీ భాస్కర్, సరిపోదా శనివారం, మెర్సీ కిల్లింగ్ తో పాటు మరికొన్ని సినిమాలు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన‌ గద్దర్ అవార్డుల్లో సత్తా చాటాయి. సాయికుమార్ నటించిన సినిమాలన్నీ బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌గా నిలుస్తుండ‌టంతో ల‌క్కీస్టార్‌గా మారిపోయారు. ప్ర‌స్తుతం సాయికుమార్‌ తెలుగు, కన్నడ భాషల్లో ‘చౌకీదార్’ అనే సినిమాను చేస్తున్నారు. తండ్రీకొడుకుల అనుబంధంతో తెర‌కెక్కుతోన్న ఈ మూవీలో పృథ్వీ అంబర్, ధన్యా రమ్యకుమార్ హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు.

‘చౌకీదార్’ మూవీని వీఎస్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్ మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తుండగా.. చంద్రశేఖర్ బండియప్ప ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తాజాగా చౌకీదార్ మూవీ నుంచి ఓ ఎమోషనల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. నాన్న గొప్పదనం చాటి చెప్పేలా హృద‌యాల‌ను క‌దిలించేలా ఈ పాట సాగింది. నాన్నా అంటూ సాగే ఈ పాటను సంతోష్ వెంకీ రచించగా.. విజయ్ ప్రకాష్ ఆలపించారు. సచిన్ బస్రూర్ మ్యూజిక్ అందించారు.

ఎమోషనల్ సాంగ్ విడుదల

తండ్రి త్యాగాల్ని, మోసే బాధ్యతల్ని, చూపించే ప్రేమను చాటిచెబుతూ ఈ పాట సాగింది. ఈ లిరిక‌ల్ వీడియో సాంగ్ యూట్యూబ్‌ లో వైర‌ల్ అవుతోంది. ఈ మూవీలో సాయి కుమార్ తండ్రిగా మ‌రోమారు నాచుర‌ల్ యాక్టింగ్‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పించేందుకు రెడీ అవుతోన్నారు. . పృథ్వీ అంబర్, సాయి కుమార్ మధ్య మంచి ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని మేక‌ర్స్ చెబుతోన్నారు.

సాయికుమార్, పృథ్వీ అంబర్ నటన

దియా మూవీతో క‌న్న‌డ‌లో ఫేమ‌స్ అయ్యాడు పృథ్వీ అంబ‌ర్‌. ఇటీవ‌ల రిలీజైన డియ‌ర్ ఉమ మూవీతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో రాక్‌స్టార్‌గా క‌నిపించాడు. క‌న్న‌డ‌, తెలుగుతో పాటు త‌మిళం, తులు భాష‌ల్లో సినిమాలు చేస్తున్నాడు.

‘చౌకీదార్’ చిత్రం తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాన్ని చక్కగా చూపిస్తుందని మేకర్స్ తెలిపారు. సాయికుమార్, పృథ్వీ అంబర్‌ల నటన ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని భావిస్తున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.