
టాలీవుడ్ నటి సయామీ ఖేర్ తన అద్భుతమైన నటనతోనే కాకుండా, క్రీడల్లోనూ తన సత్తా చాటుతోంది. ఇటీవల ఆమె ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్‌ను పిరియడ్స్‌లోనూ పూర్తి చేసి రికార్డు సృష్టించింది.
Key Points
పిరియడ్స్‌లోనూ 70.3 మైళ్ల ఐరన్‌మ్యాన్ ట్రయాథ్లాన్ పూర్తి చేసి సయామీ ఖేర్ రికార్డు సృష్టించింది.
ఒకే ఏడాదిలో రెండు సార్లు ఐరన్‌మ్యాన్ 70.3 రేసు పూర్తి చేసిన తొలి భారతీయ నటి సయామీ.
ఈత, సైక్లింగ్, పరుగుతో కూడిన ఈ కష్టతరమైన రేసును సయామీ విజయవంతంగా పూర్తి చేసింది.
నెలసరి సమస్య ఉన్నప్పటికీ, సయామీ తన ధైర్యం, దృఢ సంకల్పంతో ఈ ఘనత సాధించింది.
సయామీ ఖేర్ అసాధారణ ఘనత
కొంతమంది తారలు నటనతో ఆకట్టకుంటూనే అప్పుడప్పుడు తమలోని అసాధరణమైన నైపుణ్యాన్ని బయటిప్రపంచానికి చూపించి.. ఆశ్చర్యపరుస్తుంటారు. కేవలం సినిమా రంగంలోనే కాకుండా..ఇతర రంగాలలోనూ తన టాలెంట్‌ని నిరూపించుకొని ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకుంటారు . అలాంటి వారిలో నటి సయామీ ఖేర్(Saiyami Kher ) ఒకరు . తనదైన నటనతో అటు బాలీవుడ్ , ఇటు తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఈ బ్యూటీ .. క్రీడల్లోనూ రాణిస్తోంది . ఇటీవల ‘ ఐరన్‌మ్యాన్ 70.3’ అనే ట్రయాథ్లాన్‌ను పూర్తిచేసి .. ఒకే ఏడాదిలో రెండు సార్లు ఈ రేసుని పూర్తి చేసిన తొలి భారతీయ నటిగా రికార్డు సృష్టించింది . అయితే ఈ సారి ఆమె పిరియడ్స్ లో ఉన్నప్పుడు ఈ ఘనత సాధించడం గమనార్హం .
ఏమిటీ ‘ఐరన్ మ్యాన్ 70.3’ ‘ ఐరన్‌మ్యాన్ 70.3’ అనేది ఒక ప్రముఖ ట్రయాథ్లాన్ రేసు, ఇది ఐరన్‌మ్యాన్ సిరీస్‌లో భాగం. దీనిని “హాఫ్ ఐరన్‌మ్యాన్” అని కూడా పిలుస్తారు . ఎందుకంటే ఇది పూర్తి ఐరన్‌మ్యాన్ రేస్ దూరంలో సగం ఉంటుంది. ఈ రేస్ మూడు ఈవెంట్‌లను కలిగి ఉంటుంది . తొలుత 1.9 కిలోమీటర్లు (1.2 మైళ్లు ) ఈత కొట్టాలి . తర్వాత 90 కిలో మీటర్లు (56 మైళ్లు ) సైక్లింగ్ చేయాలి . ఆ తర్వాత 21.1(13.1 మైళ్లు ) కిలోమీటర్లు పరుగెత్తాలి . మొత్తం దూరం 113 కిలోమీటర్లు (70.3 మైళ్లు ). అందుకే దీన్నీ ఐరన్ మ్యాన్ 70.3 అని పిలుస్తారు . ఇది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాలలో నిర్వహించబడుతుంది . జులై 6 న స్వీడన్ లోని జోంకోపింగ్ లో నిర్వహించిన ఈ రేస్ లో సయామీ ఖేర్ పాల్గొని పతాకాన్ని సాధించిది . గతేడాది సెప్టెంబర్‌లో తొలిసారిగా మెడల్ అందుకున్న సయామీ .. ఇప్పుడు స్వీడన్‌లో నిర్వహించిన రేస్‌లో సత్తా చాటి మరో పతకం అందుకుంది.
ఐరన్‌మ్యాన్ 70.3 ట్రయాథ్లాన్ వివరాలు
నెలసరి సమస్యను అధిగమించి.. నాకు పీసీఓఎస్ ( పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ) ఉంది . దీని వల్ల రుతుక్రమం సరిగ్గా కాదు . రేసులో పాల్గొనే వారంలోనే నాకు పిరియడ్స్ మొదలయ్యాయి . అదృష్టవశాత్తు నా పీరియడ్స్ చివరి రోజు రేసులో పాల్గొన్న కాబట్టి నొప్పి అంతగా లేదు . కానీ సాధారణ రోజుల కంటే ఆ సమయంలోనే నాకు కాస్త అసౌకర్యంగానే అనిపించింది . మానసికంగా కొంత కలవరపెట్టింది . చాలా మంది మహిళలు పీరియడ్స్ ఉన్నప్పుడు కూడా ఉద్యోగానికి , ఇతర పనులకు హాజరవుతుంటారు . అసౌకర్యంలోనూ మనం ఎలా ముందుకు సాగాలో వారి నుంచి నేర్చుకోవచ్చు . నేను కూడా నెలసరి సమస్యను అధిగమించి గత పోటీ కంటే ఈ సారి 32 నిమిషాల ముందే రేసుని పూర్తి చేశాను ’ అని సయామీ ఓ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది .
నెలసరి సమస్యను అధిగమించి సాధించిన విజయం
సయామీ సీనీ నేపథ్యం నాసిక్ కి చెందిన సయామీ .. ‘ రేయ్ ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది . ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి .. అక్కడ వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది . చాలా కాలం తర్వాత ‘ వైల్డ్ డాగ్ ’ సినిమాతో మళ్లీ టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది . ఇటీవల వచ్చిన హిందీ చిత్రం ‘జాబ్’లో కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం హిందీ, మరాఠీ చిత్రాలతో బీజీగా అయింది .
నెలసరి సమస్య ఉన్నప్పటికీ తన దృఢ సంకల్పంతో ఐరన్‌మ్యాన్ 70.3 రేసును పూర్తి చేసిన సయామీ ఖేర్, మహిళలకు స్ఫూర్తిదాయకంగా నిలిచింది. ఆమె సాధించిన ఈ విజయం అభినందనీయం.


