
బాలీవుడ్‌లో సైయారా సినిమా సంచలన విజయం సాధించింది. వారం రోజుల్లోనే రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, ఖాన్ హీరోల రికార్డులను బద్దలు కొట్టింది. 800 థియేటర్లతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.
Key Points
రూ.200 కోట్లకు పైగా వసూళ్లతో సైయారా సరికొత్త రికార్డులు సృష్టించింది.
800 థియేటర్లతో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయింది.
ప్రపంచవ్యాప్తంగా 2000 థియేటర్లలో ప్రదర్శితమవుతోంది.
అద్భుతమైన వసూళ్లు
బాలీవుడ్ మొత్తం ఇప్పుడు సైయారా జపం చేస్తోంది . ఎక్కడ చూసినా ఈ చిన్న సినిమా గురించే చర్చిస్తున్నారు . విడుదలై వారం రోజులు దాటినా .. జనాలు ఈ సినిమాను మర్చిపోవడం లేదు . బాక్సాఫీస్ కలెక్షన్స్ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి . వారం రోజుల్లో ఈ చిత్రం రూ . 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి .. బడా హీరోల పేరిట ఉన్న రికార్డులను కొల్లగొడుతోంది .
అహన్ పాండే, అనీత్ పడ్డా హీరోహీరోయిన్లు నటించిన ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించాడు . ఈ నెల 18 న ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం 800 థియేటర్స్ లో మాత్రమే విడుదలైంది . తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది . ఫలితంగా రెండో రోజు నుంచి ఈ సినిమా వసూళ్లు పుంజుకున్నాయి . ఎనిమిది రోజుల్లో రూ . 200 కోట్ల వరకు వసూళ్లను సాధించింది . ఇటీవల బాలీవుడ్ లో విడుదలైన అన్ని చిత్రాల్లో ఇదే అత్యధిక కలెక్షన్స్ . ఖాన్ సినిమాలు సైతం ఈ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టడం లేదు .
ఖాన్స్ రికార్డులను అధిగమించి
ఆమిర్ ఖాన్ ‘ సితారే జమీన్ పర్ (164 కోట్లు ), అజయ్ దేవ్ గన్ రైడ్ 2 (173 కోట్ల ) చిత్రాలకు మించిన కలెక్షన్స్ ని రాబట్టి .. అత్యధిక వసూళ్ల సాధించిన డెబ్యూ ఫిల్మ్ గా రికార్డెకెక్కింది . సినిమాకు హిట్ టాక్ రావడంతో థియేటర్స్ సంఖ్య కూడా భారీగా పెరిగింది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 2000 థియేటర్స్‌లో ఈ సినిమా ప్రదర్శితం అవుతోంది.
సినిమా కథ
సైయారా కథ విషయానికొస్తే .. వాణి బత్రా(అనీత్ పడ్డా) ఓ రైటర్ . కాలేజీలో తన సీనియర్ అయిన మహేశ్ అయ్యర్ ని ప్రేమించి , ఇంట్లో వాళ్లకి చెప్పి పెళ్లికి కూడా ఒప్పిస్తుంది . కానీ చివరి నిమిషంలో అతను హ్యాండ్ ఇస్తాడు . ఆరు నెలల వరకు వాణి ఆ డిప్రెషన్ లోనే ఉంటుంది . తర్వాత ఓ కంపెనీలో ఉద్యోగంలో చేరుతుంది . అదే రోజు ఆమె జీవితంలోకి క్రిష్ కపూర్ ( అహన్ పాండే ) వస్తాడు . తానో సింగర్ . అవకాశాల కోసం తిరుగుతుంటారు . వాణితో కలిసి ఓ పాట కోసం పని చేస్తారు . ఈ క్రమంలో ఇద్దరు ప్రేమలో పడిపోతారు . అదే సమయంలో వాణి జీవితంలోకి మళ్లీ మహేశ్ అయ్యర్ వస్తాడు . ఆ తర్వాత ఏం జరిగింది . ఈ ఇద్దరిలో వాణి ఎవరికి దగ్గరైంది అనేదే మిగతా కథ .
చిన్న బడ్జెట్ సినిమా అయినా సైయారా సాధించిన విజయం అద్భుతం. ఖాన్ హీరోల రికార్డులను అధిగమించి సరికొత్త చరిత్ర సృష్టించింది.


