
📌 Key Points
- సల్మాన్ ఖాన్ ధరించిన చిరిగిన బూట్ల ధర దాదాపు రూ.1.5 లక్షలు!
- అక్షయ్ కుమార్ చిరిగిన కోటుతో బూత్ బంగ్లా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు హాజరు
- బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్లు రెండు రోజులు కష్టపడి ఈ చిరిగిన కోటును తయారు చేశారు
- బాలీవుడ్‌లో ఇప్పుడు చిరిగిన బట్టల ట్రెండ్ వైరల్ అవుతోంది!
బాలీవుడ్ ఇప్పుడు సరికొత్త ఫ్యాషన్ ట్రెండ్‌తో ఊగిపోతోంది. స్టార్ హీరోలు సైతం చిరిగిన బట్టలతో దర్శనమివ్వడం హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్, అక్షయ్ ల లేటెస్ట్ లుక్స్ వైరల్ అవుతున్నాయి.
సల్మాన్ ఖాన్ చిరిగిన బూట్ల వెనుక అసలు కథ
Bollywood : గత కొన్నాళ్లుగా చిరిగిన జీన్స్ వేసుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిలు అని తేడా లేకుండా అందరూ చిరిగిన జీన్స్ వేసుకుంటున్నారు. ఇప్పుడు ఈ ఫ్యాషన్ మరింత ముదిరి చొక్కాలు, షూస్ కూడా చింపుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోలు ఇలా చిరిగినవి వేసుకు రావడంతో ఇవి వైరల్ గా మారాయి.
రెండు రోజుల క్రితం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ ఈవెంట్ కి చిరిగినా షూస్ తో కనిపించాడు. అదేంటి ఇలా వచ్చాడు, మర్చిపోయి వేసుకొచ్చాడేమో అని అంతా అనుకున్నారు. కానీ తర్వాత తెలిసింది ఏంటంటే అవి సరికొత్త ఫ్యాషన్ అంట. అందులోను బ్రాండెడ్ షూస్ అంట.
అక్షయ్ కుమార్ చిరిగిపోయిన కోటుతో దర్శనం
సల్మాన్ ఖాన్ వేసుకొచ్చినవి బాలెన్సియా అనే బ్రాండ్ కి చెందిన షూస్. ఇవి ప్యూర్ లెదర్ తో కౌబాయ్ స్టైల్ లో తయారు చేసారు. ఈ షూ ఖరీదు దాదాపు లక్షా 50వేల రూపాయలు అని తెలుస్తుంది. దీంతో చిరిగిపోయిన షూస్ కి ఇంత రేటా అని ఆశ్చర్యపోతున్నారు జనాలు. ఇక సల్మాన్ చిరిగిన బూట్లు వేసుకొస్తే అక్షయ్ కుమార్ ఏకంగా చిరిగిపోయిన కోటు వేసుకొచ్చాడు.
అక్షయ్ కుమార్ బూత్ బంగ్లా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి చిరిగిపోయిన కోటు వేసుకొచ్చి మీడియా ముందుకు ఫోజులిచ్చి, ఈవెంట్ అంతా అదే చిరిగిపోయిన కోటుతో ఉండి అందరికి షాక్ ఇచ్చాడు. ఆ కోటు చూస్తుంటే ఎలుకలు కొట్టేసినట్టుగా చీలికలు, పీలికలతో ఉంది. పైగా అతని ఫ్యాషన్ డిజైనర్స్ దాదాపు రెండు రోజులు కష్టపడి తయారు చేసారంట ఈ చిరిగిపోయిన కోటుని. దీని ధర కూడా వేలల్లోనే ఉంటుందని సమాచారం.
బాలీవుడ్‌లో కొత్త ఫ్యాషన్ ట్రెండ్ సెట్!
ఇది చూసి చొక్కా చింపుకోవడం ఫ్యాషన్ ఏంటో అది కూడా మరీ ఇలా గుడ్డముక్కల్లాగా చింపడం ఏంటో అని షాక్ అవుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో ఇప్పుడు చిరుగులు ఫ్యాషన్ నడుస్తుంది. స్టార్ హీరోలే ఇలా వేసుకొస్తున్నారు అంటే ఇక మాములు ఆర్టిస్టులు, యూట్యూబ్, సోషల్ మీదకి ఫేమ్ ఉన్న బ్యాచ్ లు మున్ముందు ఇలాంటివి చిరిగినవి ఏమేం వేసుకుంటారో అని చర్చ జరుగుతుంది.
బాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్‌పై మీ అభిప్రాయం ఏమిటి? ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన అప్‌డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


