|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

సల్మాన్ ఖాన్ ఇల్లు మరోసారి టార్గెట్‌ అయిందా..?

Published: 22-05-2025, 6:23 AM
సల్మాన్ ఖాన్ ఇల్లు మరోసారి టార్గెట్‌ అయిందా..?

బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఇంటికి మరోసారి ఒక వ్యక్తి చొరబడిన సంఘటన వెలుగులోకి వచ్చింది. ముంబై పోలీసులు జితేంద్ర కుమార్ సింగ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఇది సల్మాన్ ఖాన్ భద్రతపై మరోసారి ప్రశ్నార్థకం లేవనెత్తుతోంది.

Key Points

ఇంటికి చొరబాటు ఘటన

బాలీవుడ్ స్టార్ ‍హీరో సల్మాన్ ఖాన్ భద్రత విషయంలో ఎప్పుడూ పలు వార్తలు వస్తూనే ఉంటాయి. తాజాగా ఆయన ఇంట్లోకి చొరబడిని ఒక వ్యక్తిని అరెస్ట్‌ చేసినట్లు ముంబై పోలీసులు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన రెండురోజుల తర్వాత పోలీసులు ప్రకటించారు. అయితే, తనని విచారిస్తున్నట్లు వారు చెప్పుకొచ్చారు. ఇప్పటికే పలుమార్లు సల్మాన్‌ ఇంటి వద్ద ఇలాంటి సంఘటనలు జరిగిన విషయం తెలిసిందే.

ముంబైలోని సల్మాన్‌కు చెందిన గెలాక్సీ అపార్ట్‌మెంట్‌లోకి  చొరబడిన వ్యక్తి పేరు  జితేంద్ర కుమార్‌ సింగ్‌ అని పోలీసులు ప్రకటించారు. అయతే, తను సల్మాన్‌ను కలిసేందుకు వెళ్లినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు ఇలా తెలిపారు. ‘ రెండురోజుల క్రితం సల్మాన్‌ ఇంటిముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న జితేంద్రను భద్రతా సిబ్బంది మొదట హెచ్చరించించి. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపింది. ఆ సమయంలో సెక్యూరిటీ సిబ్బందితో గొడవపెట్టుకుని తన ఫోన్‌ను విసిరేశాడు.

అరెస్ట్ చేసిన వ్యక్తి వివరాలు

అయితే, అదేరోజు సాయింత్రం మళ్లీ సల్మాన్‌ ఇంటి వద్ద అతను మరో వ్యక్తితో కనిపించాడు. ఒకరు బయట ఉన్న సిబ్బందితో వాగ్వాదం పెట్టుకుంటన్నట్లు గేమ్‌ ప్లాన్‌ చేయగా సల్మాన్‌ ఇం​ట్లోకి జితేంద్ర వెళ్లే ప్రయత్నం చేశాడు. సెక్యూరిటీ తనను అడ్డుకుని ముంబై పోలీసులకు అప్పజెప్పారు.’ అని వారు తెలిపారు. అయితే, పోలీసుల విచారణలో  సల్మాన్‌ఖాన్‌ను కలవాలనుకుంటున్నానని జితేంద్ర చెప్పాడు. అడిగితే అనుమతి లేదని చెప్పడంతో ఇలాంటి పనిచేశానని తెలిపాడు. జితేంద్రపై కేసు నమోదు చేశామని పోలీసులు చెప్పారు.

గ్యాంగ్స్టర్ బెదిరింపులు

కొంతకాలంగా సల్మాన్‌ఖాన్‌కు గ్యాంగ్‌స్టర్‌ లారెన్స్‌ బిష్ణోయ్‌ గ్యాంగ్‌ నుంచి బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వారు పలుమార్లు సల్మాన్‌ ఇంట్లోకి చొరబడే ప్రయత్నం చేశారు. దీంతో ముంబై పోలీసులు సల్మాన్‌కు భద్రత కల్పించారు.

సల్మాన్ ఖాన్ భద్రతకు సంబంధించిన ఈ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసులు తీసుకుంటున్న చర్యలతో భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.