
📌 Key Points
- అడివి శేష్, మృణాల్ ఠాకూర్ జంటగా ‘డెకాయిట్’ మూవీ రేపు విడుదల.
- అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ నిర్మించిన సినిమాకు సమంత విషెస్.
- సుప్రియ పట్టుదలను మెచ్చుకుంటూ సమంత ఎమోషనల్ పోస్ట్.
- సమంత సపోర్ట్ వెనుక కారణాలపై నెటిజన్ల ఆరాలు.
సమంత మళ్ళీ అక్కినేని కాంపౌండ్‌లో చర్చనీయాంశంగా మారింది. నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించిన ‘డెకాయిట్’ సినిమాకు సమంత మద్దతు తెలుపుతూ పోస్ట్ చేయడంతో ఈ విషయం హాట్ టాపిక్ అయింది.
సమంత పోస్ట్ వైరల్.. అసలేం జరిగింది?
Dacoit Movie: క్షణం, ఎవరు, గూడచారి వంటి సినిమాలతో మోస్ట్ ప్రామిసింగ్ హీరోగా స్టాంప్ వేసుకున్న అడివి శేష్,సీతా రామంతో క్రేజ్ కొట్టేసిన మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’. ఈ సినిమా రేపు అంటే ఏప్రిల్ 10న రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. షానియల్ డియో దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లో అంచనాలు భారీగానే ఉన్నాయ్. అయితే, సినిమా రిలీజ్ కంటే ముందు ఇప్పుడు నెట్టింట్లో ఒక వార్త ఓ రేంజ్‌లో వైరల్ అవుతోంది. అదే.. స్టార్ హీరోయిన్ సమంత పెట్టిన పోస్ట్!
అక్టోబర్ 6 , 2017న చైతుతో మూడు ముళ్ళు
ఏమాయ చేసావే అంటూ తెలుగు ఆడియన్స్ తో పాటు నాగచైతన్య ని కూడా మెస్మరైజ్ చేసిన ఈ అమ్మడు అక్టోబర్ 6,2017న చైతుతో మూడు ముళ్ళు వేయించుకున్న సంగతి తెల్సిందే. అయితే కారణాలేవైనా 2021 అక్టోబర్ 2న తమ డైవోర్స్ ని అఫీషియల్ గా డిక్లేర్ చేసి అభిమానులకి పెద్ద షాకే ఇచ్చారు.ఇక నాలుగేళ్ల వివాహ బంధానికి ఎండ్ కార్డ్ వేసిన ఈ ఇద్దరు ఇపుడు ఒకరికొకరు కనీసం పలకరించుకోని పరిస్థితి. ఈ క్రమంలోనే గతేడాది చైతు శోభిత ధూళిపాళ్ల మెళ్ళో మూడు ముళ్ళు వేయగా సమంత కూడా ఈ ఏడాది మొదట్లో డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ రాజ్ నిడిమోరుని పెళ్లి చేసుకున్న సంగతి తెల్సిందే.
సుప్రియకు సమంత ఎందుకు సపోర్ట్ చేసింది?
సమంత సపోర్ట్ ఇవ్వడం ఎంటా అంటూ ఆరాలు
ఇక ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు అనుకున్న ఈ టైమ్ లో అక్కినేని నాగార్జున మేనకోడలు సుప్రియ యార్లగడ్డ నిర్మించిన సినిమాకు సమంత విషెస్ చెప్పడం ఇప్పుడు టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయింది. “సుప్రియ.. మీ కృషిని, పట్టుదలను నేను దగ్గరుండి చూశాను. ఒక బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడానికి మీకంటే అర్హులు ఎవరూ లేరు. దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి” అంటూ సాదాసీదాగా కాకుండా, ఫుల్ ఎమోషనల్ గా సుప్రియను ఉద్దేశించి పోస్ట్ పెట్టడం నెటిజన్లలో కొత్త చర్చకు తెరతీస్తుంది.అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో వస్తున్నఈ సినిమాకు అసలు సమంత సపోర్ట్ ఇవ్వడం ఎంటా అంటూ ఫ్యాన్స్ ఆరాలు తీయడం మొదలెట్టారు కూడా.
నెట్టింట సమంత పోస్ట్ పై చర్చలు
ప్రమోషన్ స్టంటా లేక నిజమైన స్నేహమా?
ఒకవైపు అక్కినేని ఫ్యామిలీతో సంబంధాలు తెగిపోయాయని అనుకుంటున్న ఈ టైం లో , సమంత ఇలా సడన్ గా ఎంట్రీ ఇచ్చి ‘డెకాయిట్’ టీమ్‌కి, అందులోనూ సుప్రియకు విషెస్ చెప్పడంపై సోషల్ మీడియాలో మిక్స్డ్ ఒపీనియన్స్ ని షేర్ చేస్తున్నారు “చైతూ కొత్త లైఫ్ లో బిజీగా ఉన్నా, సమంత మాత్రం ఇంకా పాత బంధాలను వదులుకోలేదా.. కొంపదీసి అక్కినేని ఫ్యామిలీలోకి మళ్ళీ ఎంట్రీ ఇస్తుందా అని కొందరు కామెంట్స్ చేస్తుంటే, “ఇది కేవలం ప్రమోషన్ స్టంటా లేక నిజమైన స్నేహమా?” అంటూ మరికొందరు నెగెటివ్ గా సెటైర్లు వేస్తున్నారు. అయితే సుప్రియతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగానే సామ్ ఇలా పోస్ట్ పెట్టి ఉంటుందన్నది ఇంకొందరి ఆర్గ్యుమెంట్.
ఏది ఏమైనా, అడివి శేష్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్స్ ఉన్నా కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ప్రమోషన్లు ఊదరగొడుతున్నా రాని క్రేజ్, సమంత ఒక్క పోస్ట్‌తో ‘డెకాయిట్’కు వచ్చేసింది.చూడాలి మరి, సమంత విషెస్ ఈ ‘డెకాయిట్’ను బాక్సాఫీస్ వద్ద ఎంతవరకు గట్టెక్కిస్తాయో!
సమంత పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విడాకుల తర్వాత కూడా అక్కినేని కుటుంబంతో ఆమె సంబంధాలు కొనసాగుతున్నాయా అనే చర్చ జరుగుతోంది. దీనిపై సమంత ఎలా స్పందిస్తుందో చూడాలి.


