|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

Samantha: రోడ్డు మీదనే రెచ్చిపోయిన సమంత.. బోల్డ్ వీడియో వైరల్.. మా ప్రాణాలు పోతే ఎవరు గ్యారెంటీ అంటూ నెటిజన్ల కామెంట్స్

Published: 17-06-2025, 7:45 AM
Samantha: రోడ్డు మీదనే రెచ్చిపోయిన సమంత.. బోల్డ్ వీడియో వైరల్.. మా ప్రాణాలు పోతే ఎవరు గ్యారెంటీ అంటూ నెటిజన్ల కామెంట్స్

టాలీవుడ్ నటి సమంతకు సంబంధించిన బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జిమ్‌ నుండి బయటకు వస్తుండగా, కొంతమంది ఆమె ఫోటోలు, వీడియోలు తీయడంతో ఆమె అసహనం వ్యక్తం చేసింది. ఈ ఘటన నెటిజన్లలో చర్చకు దారితీసింది.

Key Points

1

సమంతకు సంబంధించిన బోల్డ్ వీడియో వైరల్‌గా మారింది.

2

జిమ్‌లోంచి బయటకు వస్తుండగా ఫోటోలు, వీడియోలు తీయడంతో సమంత అసహనం వ్యక్తం చేసింది.

4

సమంత యొక్క ప్రతిచర్య సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

సమంత బోల్డ్ వీడియో వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత(Samantha) మయోసైటీస్ వ్యాధి కారణంగా గత కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉంటుంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్‌గా ఉంటూ తన ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. అలాగే ఓ పాడ్‌కాస్ట్‌ను స్టార్ట్ చేసిన ఆమె ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు తెలియజేస్తోంది. ఇక ఇటీవల నిర్మాతగా మారి తన సొంతంగా ట్రాలాలా పిక్చర్స్‌పై ‘శుభం’(shubham) సినిమాను నిర్మించింది. అయితే ఈ మూవీ మే 9న థియేటర్స్‌లోకి వచ్చి పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది.

నెటిజన్ల ప్రతిచర్య

ప్రస్తుతం ఓటీటీలో స్ట్రీమింగ్ అందుబాటులో ఉంది. ఇక ఆ తర్వాత మరో ప్రాజెక్ట్ ప్రకటించిన సమంత మాత్రం పలు యాడ్స్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. తాజాగా, సమంతకు సంబంధించిన ఓ బోల్డ్ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇక ఇందులో జిమ్ అవుట్‌ఫిట్‌లో కనిపించింది. ఒంటికి గట్టిగా అంటిపెట్టుకుని ఉన్న స్కిన్ టైట్ డ్రెస్‌లో హాట్ షోతో కుర్రకారుకు పిచ్చేక్కించింది. ముంబైలోని బాంద్రా ఏరియాలో సమంత జిమ్‌లో వర్కౌట్స్ ముగించుకుని బయటికి వచ్చి సమయంలో తన కారు కనిపించలేదు. దీంతో కారు ఎక్కడికి వెళ్లిందా అని అయోమయంగా ఫోన్‌లో మాట్లాడుతూ అటు ఇటు తిరుగుతుండగా.. కొంతమంది నెటిజన్లు తమ ఫోన్లలో ఫొటోలు, వీడియోలు తీశారు.

సమంత అసహనం

దీంతో చాలా ఇబ్బందికి గురైన సామ్ వాళ్లందరినీ చూసి కాస్త అసహనంగా ఫీల్ అయింది. డ్రెస్ కంఫర్ట్‌గా లేకపోవడంతో.. ఫొటోలు తీస్తున్న వారిని తీయోద్దని మండిపడింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు సమంతను మామూలుగా చూస్తేనే తట్టుకోలేం.. ఇంత హాట్‌గా చూసాక మా ప్రాణాలు పోతే ఎవరు గ్యారెంటీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొందరు మాత్రం ఇంటికి వెళ్లాక ఆ కారు డ్రైవర్‌కు ఉంది.. గట్టి వార్నింగ్ ఇస్తుందని అంటున్నారు. మొత్తానికి సమంత వీడియో సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు చర్చనీయాంశంగా మారింది.

చివరగా, సమంత బోల్డ్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. నెటిజన్ల విభిన్నమైన ప్రతిస్పందనలు ఈ ఘటనకు మరింత ఆసక్తిని కలిగించాయి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.