|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

ఛాలెంజ్ విసిరిన సమంత… పోస్ట్ వైరల్

Published: 28-06-2025, 11:51 AM
ఛాలెంజ్ విసిరిన సమంత... పోస్ట్ వైరల్

టాలీవుడ్ హీరోయిన్ సమంత తన సన్నగా ఉన్న శరీరంపై వచ్చిన విమర్శలకు సమాధానంగా నెటిజన్లకు ఛాలెంజ్ విసిరింది. ఆమె పోస్ట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.

Key Points

1

సమంత తన సన్నగా ఉన్న శరీరానికి సంబంధించి నెటిజన్ల కామెంట్లకు సమాధానంగా ఛాలెంజ్ విసిరారు.

2

ఆమె మూడు పుల్ అప్స్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

4

నెటిజన్లు ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేయడంతో ఆమె ఈ ఛాలెంజ్ విసిరింది.

సమంత యొక్క ఛాలెంజ్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ( Samantha Ruth Prabhu) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన టాలీవుడ్ ఇండస్ట్రీలో దాదాపు 15 సంవత్సరాలుగా అగ్రశ్రేణి హీరోయిన్ గా కొనసాగుతున్నారు సమంత. అలనాటి సౌందర్య తరహాలోనే సమంతకు మంచి ఆదరణ లభిస్తుంది. ఆమె పర్సనల్ జీవితంలో ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ.. ప్రేక్షకులను మాత్రం ఆకట్టుకుంటున్నారు.

మంచి మంచి సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్నారు సమంత. అయితే అలాంటి హీరోయిన్ సమంత తాజాగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ సందర్భంగా నెటిజన్స్ కు ఛాలెంజ్ అంటూ… సమంత వెల్లడించారు. మీరు గనక నాలాగా ఇలా మూడు పులప్స్ చేయలేకపోతే నన్ను సన్నగా ఉన్నావు… అనారోగ్యానికి గురయ్యావు అనే కామెంట్స్ చేయకూడదంటూ… ఛాలెంజ్ విసిరారు హీరోయిన్ సమంత.

వైరల్ అయిన వీడియో

ఈ మేరకు పులప్స్ చేసిన వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు హీరోయిన్ సమంత. ఎక్కువగా జిమ్ చేస్తుండటంతో సన్నగా అయిపోతున్నామని.. హీరోయిన్ సమంతను గత కొన్ని రోజులుగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అనారోగ్యం కారణంగా సమంత ఇలా అవుతుందని మరికొంతమంది పేర్కొన్నారు. అయితే వాళ్లందరి నోర్లు మూయించేందుకే సమంత ఇలా ఛాలెంజ్ విసిరారు. దీంతో ఇప్పుడు… సమంత చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.

నెటిజన్ల స్పందన

A post shared by Samantha (@samantharuthprabhuoffl)

సమంత చేసిన ఈ ఛాలెంజ్ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.