
📌 Key Points
- సమంత, రాజ్ నిడిమోరుల వివాహం డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగింది.
- ది ఫ్యామిలీ మ్యాన్ 2 సెట్స్‌లో వీరిద్దరూ కలుసుకున్నారు; ప్రేమ చిగురించింది.
- నాగ చైతన్యతో విడాకుల తర్వాత రాజ్ తనకు అండగా నిలిచాడని సమంత తెలిపింది.
- సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఒక సంచలన వార్త వైరల్ అవుతోంది. ఆమె తన రెండో భర్త రాజ్ నిడిమోరుతో విడాకులు తీసుకుంటుందా? ఈ ప్రశ్నకు సమాధానం ఇక్కడ ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్దాం!
రాజ్ నిడిమోరుతో సమంత వివాహం వెనుక అసలు కథ
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రుతు ప్రభు కి పరిచయం అవసరం లేదు. ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గుర్తింపు తెచ్చుకున్న సామ్… అక్కినేని వారసుడు నాగ చైతన్య నుండి విడాకులు తీసుకున్న తర్వాత చాలా విమర్శలను ఎదుర్కొంది. ఈ విడాకులకు సమంతను కారణం చేస్తూ.. సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేశారు.
నాగ చైతన్య- సమంతది పదేళ్ల పరిచయం. దాదాపు ఇద్దరూ ఒకేసారి కెరీర్ మొదలుపెట్టారు. పదేళ్ల స్నేహం, మూడేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలికి.. వీరు 2021లో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ లోనూ ఈ జోడికి విపరీతమైన క్రేజ్ ఉంది. అందుకే.. వీరు విడిపోవడానికి ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. కానీ.. వీరిద్దరూ తమ జీవితంలో రెండో ప్రయాణం మొదలుపెట్టారు. నాగ చైతన్య… శోభితను పెళ్లి చేసుకున్న సంవత్సరానికి సమంత కూడా రాజ్ నిడిమోరును పెళ్లి చేసుకున్నారు. కాగా.. రాజ్ తో తన పరిచయం..విడాకుల సమయంలో రాజ్ తనకు ఎలా సపోర్ట్ గా నిలపడ్డాడో సమంత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
విడాకుల పుకార్లపై సమంత క్లారిటీ
అంతేకాదు.. తాను రాజ్ నిడిమోరుతో విడిపోతున్నానంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయని.. అందులో ఎలాంటి నిజం లేదని సమంత క్లారిటీ ఇచ్చింది. వోగ్ ఇండియాతో సమంత మాట్లాడుతూ.. ‘ నేను, నాగ చైతన్యతో విడిపోయినప్పుడు, నేను పూర్తిగా కుంగిపోయాను. ఆ సమయంలో మరొకరిని నమ్మే స్థితిలో నేను లేను. అసలు ఇక జీవితంలో ఇంకొకరిని నమ్ముతాను అని కూడా ఎప్పుడూ అనుకోలేదు. కానీ నా అదృష్టం మారిపోయింది. అదృష్టవశాత్తు నాకు రాజ్ లాంటి వ్యక్తి దొరికాడు. ఇప్పుడు జీవితం బాగుంది. దయచేసి పుకార్లు వ్యాప్తి చేయద్దు’ అని చెప్పారు.
సమంత కొత్త సినిమా విశేషాలు
రాజ్ నిర్మించిన , సమంత నటించిన “ది ఫ్యామిలీ మ్యాన్” సీజన్ 2 సెట్స్‌లో ఇద్దరూ కలుసుకున్నారు. వారు డిసెంబర్ 1, 2025న కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లోని లింగ భైరవి ఆలయంలో వివాహం చేసుకున్నారు.సమంత కెరీర్ విషయానికి వస్తే… చివరగా సిటాడెల్ హనీ బనీ అనే వెబ్ సిరీస్ లో కనిపించింది. ఇది అమేజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతోంది. త్వరలోనే ఆమె నటించిన ‘ మా ఇంటి బంగారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సమంత, రాజ్ నిడిమోరుల బంధంపై వస్తున్న పుకార్లకు తెరపడింది. వారిద్దరూ సంతోషంగా ఉన్నారు. మరిన్ని ఆసక్తికరమైన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.


